
ఘాటైన హైదరాబాద్ స్టైల్ బిర్యానీకి ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్. నోరూరించే స్పైసీ ఫుడ్ ఇష్టపడేవాళ్లు ఇక్కడ తప్పకుండా ట్రై చేయాలి.
బెంగళూరు ట్రెడిషనల్ రుచి చూడాలనుకునేవాళ్లు జయనగర్ లోని ఈ చారిత్రక హోటల్‌కు వెళ్లొచ్చు. ఇక్కడ విస్తరాకుల్లో (దొన్నెలో (Donne)) ఇచ్చే బిర్యానీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
రాత్రి పూట ఆకలేస్తే బెంగళూరు వాసుల మొదటి ఛాయిస్ ఎంపైర్ రెస్టారెంటే. సువాసనలు వెదజల్లే హైదరాబాదీ, నార్త్ ఇండియన్ బిర్యానీలకు ఈ రెస్టారెంట్ ఫేమస్.
బెంగళూరు బిర్యానీ ప్రియుల 'ఆల్-టైమ్ ఫేవరెట్' స్పాట్ ఇది. నాన్-వెజ్ ప్రియులకే కాదు, వెజిటేరియన్స్‌కి కూడా ఇక్కడ అదిరిపోయే బిర్యానీ ఆప్షన్స్ ఉన్నాయి.
బిర్యానీ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీనే… ఈ అభిప్రాయం ఉన్నవారికి బెంగళూరులో సరైన స్పాట్ 'ప్యారడైజ్'. బాస్మతి బియ్యం సువాసన, మసాలాల అసలైన రుచి ఇక్కడి బిర్యానీ స్పెషాలిటీ.
ప్రధాన వంటకం: హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ. వీటితో పాటు ప్రత్యేకంగా 'గుత్తి వంకాయ బిర్యానీ' (Gutti Vankaya Biryani).
లొకేషన్: జేపీ నగర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌తో పాటు నగరంలోని చాలా ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి.
సమయం: ఉదయం 11:00 నుంచి రాత్రి 11:00 లేదా అర్థరాత్రి 12:00 వరకు (బ్రాంచ్‌ను బట్టి మారుతుంది).
మీకు తెలుసా? : బెంగళూరులోని శివాజీ మిలిటరీ హోటల్ ఉదయం 8 గంటలకే తెరుచుకుంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లోనే బిర్యానీని అందిస్తూ, ఆ పాత సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తోంది!