
మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోట దురదృష్టవశాత్తూ యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసుతో తాజాగా వార్తల్లో నిలిచింది. నిజానికి ఈ కోట శతాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలుస్తోంది.
ఎన్నో రాజవంశాల పాలన, యుద్ధాలు, దండయాత్రలను తట్టుకుని చెక్కుచెదరకుండా నిలిచిన ఈ కోటను ‘ఇనుప కోట’గా పిలుస్తారు. అయితే ఆ పేరు కోటను ఇనుముతో నిర్మించినందుకే కాదు. ప్రకృతి, చరిత్ర, అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాల కలయికే దీనికి ఆ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.‘లోహ్‌గఢ్’ పేరు వెనుక కథ‘లోహ’ అంటే ఇనుము. 'గఢ్' అంటే కోట. ఈ రెండు పదాలు కలిసి 'లోహ్‌గఢ్'గా మారాయి. సముద్ర మట్టానికి 1,033 మీటర్ల ఎత్తులో సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న ఈ కోట ఇనుప ఖనిజం అధికంగా ఉన్న రాతి కొండపై నిర్మించారు. బలమైన సహజ పునాది కారణంగా ఈ కోటపై దాడి చేయడం శత్రువులకు చాలా కష్టంగా ఉండేది. అందుకే కాలక్రమంలో దీనిని ‘ఇనుప కోట’గా పిలవడం ప్రారంభించారు.ఎన్నో రాజవంశాలకు సాక్ష్యంలోహ్గఢ్ కోటకు వెయ్యేళ్లకుపైగా చరిత్ర ఉంది. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, బహమనీ సుల్తానులు, నిజాంలు, మొఘలులు, మరాఠాలు ఇలా అనేక రాజవంశాలు ఈ కోట నుంచి పాలించాయి. పాలకులు మారినా కోట మాత్రం చెక్కుచెదరలేదు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ మార్పులను తట్టుకుని నిలిచిన ఈ కోట నిజంగానే తన పేరుకు తగ్గట్టే ఇనుప సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.శివాజీకి అత్యంత ప్రియమైన కోటఛత్రపతి శివాజీ మహారాజు 1648లో ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. 1665లో