భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ దాదాపు 99 శాతం పూర్తయిందని, కేవలం ఒకే ఒక్క కీలక అంశంపై తుది నిర్ణయం...
భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ దాదాపు 99 శాతం పూర్తయిందని, కేవలం ఒకే ఒక్క కీలక అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా మార్కెట్లో ప్రాంతీయ పోటీదారుల కంటే భారత్కు విశేష ప్రాధాన్యత లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.గురువారం ఢిల్లీలో నిర్వహించిన 'ఇండో-జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్' కార్యక్రమంలో పీయూష్ గోయల్ ప్రసంగించారు. ఈ ఒప్పందం ఇరు దేశాలకూ అత్యంత న్యాయబద్ధంగా, సమతుల్యంగా ఉంటుందని ఆయన అభివర్ణించారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, భారత్కు సుంకాల పరంగా లబ్ధి చేకూర్చేందుకు అవసరమైన చట్టబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించడమే ప్రస్తుతం మిగిలి ఉన్న ఆ ఒక శాతం అడ్డంకి అని ఆయన వివరించారు. తయారీ రంగంలో ప్రధాన పోటీదారులైన చైనా, ఆగ్నేయాసియా దేశాల కంటే భారత్కు మెరుగైన ప్రాధాన్యత లభించాలని కోరుతున్నామని, దీనిపై అమెరికా సానుకూలంగా స్పందిస్తూ పరిష్కారం కోసం చురుగ్గా కృషి చేస్తోందని తెలిపారు.2025 ప్రారంభంలో ఈ సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను ఇరు దేశాలు ప్రకటించాయి. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సైతం ఈ ఒప్పందం తుది దశకు చేరుకుందని, కేవలం ఒక శాతం మాత్రమే పెండింగ్లో ఉందని ఇటీవల వ్యాఖ్యానించారు. జూలై 24న అమెరికా తాత్కాలిక టారిఫ్ చర్యల గడువు