
అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో ఉన్నతాధికారి నివాసంలో భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబె ట్టారనే ఆరోపణలతో డీఎస్పీ ఎస్.
భీమ్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలు, బంధు వులు, సన్నిహితుల నివాసాలపై గురువారం (జులై 2) తెల్లవారు జామున ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్తో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా అధికారులు అత్యంత గోప్యంగా ఈ సోదాలు చేపట్టాయి. సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంకు లాకర్ల వివరాలు, స్థిరాస్తుల డాక్యుమెంట్లు, స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న వాటి విలువ కోట్లలో ఉండొచ్చని అంటున్నారు.
హైదరాబాద్లో సుమారు రూ.8 కోట్ల విలువైన విల్లాలో భీమ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. ఈ విల్లాతో పాటు ఆయన పేరుపై, కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను కూడా అధికారులు పరిశీలించారు భీమ్ రెడ్డి వద్ద ఉన్న మొత్తం ఆస్తుల విలువ ఎంత? ఆదాయానికి మించిన ఆస్తులు ఎంత మేరకు ఉన్నాయనే అంశా లపై ఏసీబీ అధికారులు లెక్కలు వేస్తు న్నారు. ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే ఈ దాడులకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 20 మంది మహిళలు అరెస్టు.. ఎందుకంటే?
.