.webp&w=3840&q=75)
నకిలీ వీసాలతో గల్ఫ్ వెళ్లేందుకు ప్రయత్నించిన 20 మంది మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. గల్ఫ్ దేశంలో ఉద్యోగాల కోసం 20 మంది
మహిళలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒమాన్ ఎయిర్లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వీరు విమానం ఎక్కబోతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు.
తనిఖీల్లో వారి వద్ద ఉన్నవి నకిలీ వీసాలని అధికారులు గుర్తించి ఈ చర్య తీసుకున్నారు. అనంతరం వీరిని ఎయిర్ పోర్టు ఔట్ పోస్టు పోలీసులకు అప్పగించారు. ఇలా ఉండగా ఈ మహిళలంతా తాము ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లేందుకు ఒక ఏజెంట్ ను సంప్రదించామనీ, అతడు తమను మోసం చేశాడనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నకిలీ వీసాలను ఎవరు తయారు చేశారు? ఏ ట్రావెల్ ఏజెంట్ లేదా ముఠా వీరిని మోసం చేసింది? ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపించే అక్రమ రాకెట్ ఏదైనా పనిచేస్తుందా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
డీఎస్పీ భీమ్ రెడ్డి ఇళ్లపై ఏసీబీ మెరుపుదాడులు
.