
ప్రస్తుత కాలంలో పెద్ద పెద్ద నగరాల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే మెజారిటీ ప్రజలు అద్దె ఇళ్లు లేదా ఫ్లాట్లలోనే నివసిస్తుంటారు.
అయితే, కొత్తగా అద్దె ఇంట్లోకి మారేటప్పుడు కేవలం బడ్జెట్, లొకేషన్ మాత్రమే చూసుకుంటే సరిపోదు.. కచ్చితంగా వాస్తు నియమాలను కూడా పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాత ఇళ్లు లేదా ప్లాట్లలో ప్రతికూల శక్తులు, వాస్తు దోషాలు ఉండే అవకాశం ఎక్కువ. అందుకే అద్దె ఇల్లు తీసుకునే ముందు మీ జీవితంలో సుఖసంతోషాలు, ఆర్థిక వృద్ధి నిలవాలంటే ఈ 5 ముఖ్యమైన వాస్తు సూత్రాలను తప్పక తనిఖీ చేసుకోవాలి.vastu tips: డబ్బు నిలవాలంటే ఈ చిన్న మార్పులు చేస్తే చాలు!ఏ అంతస్తు ఎంచుకుంటే మంచిది?వాస్తు శాస్త్రం ప్రకారం.. భూమికి ఆనుకుని ఉండే గ్రౌండ్ ఫ్లోర్ కంటే పై అంతస్తుల్లో నివసించడం మానసికంగా, శారీరకంగా మరింత శ్రేయస్కరంగా భావిస్తారు.సాధ్యమైనంత వరకు మొదటి అంతస్తు, రెండో అంతస్తు లేదా అంతకంటే పై అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. వృద్ధులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్‌ను పరిశీలించడం ఉత్తమం.సూర్యరశ్మి, వెలుతురు ఎలా ఉంది?చీకటిగా, కాంతి లేని ఇళ్లలోకి వెళ్తే ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మీరు ఎంచుకునే అద్దె ఇంట్లోకి సహజమైన సూర్యరశ్మి, గాలి సమృద్ధిగా వచ్చేలా ఉండాలి. పెద్ద కిటికీలు, విశాలమైన బాల్కనీలు ఉన్న ఇళ్లను ఎంచుకోండి. సూర్యకాంతి సమృద్ధిగా పడటం వల్ల ఇంట్లోని తేమ, క్రిములు నశించడమే కాకుండా.. సానుకూల శక్తి పెరుగుతుంది.చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి?ఇంటి వాస్తు ఎంత బాగున్నా.. ఆ ఇల్లు ఉన్న పరిసరాలు కూడా అంతే ముఖ్యం. నిర్మానుష్యంగా ఉండే బీడు భూములు, శ్మశానాలు, లేదా పాడుబడిన పాత శిథిల భవనాల సమీపంలో ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకోకూడదు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ జనసంచారం ఉన్న, ప్రశాంతమైన కాలనీలనే ఎంచుకోండి.ఇంట్లో తాబేలును పెంచుకుంటున్నారా? కూర్మావతారంగా పూజిస్తే ఐశ్వర్యమా?..ఇంటి కండిషన్ ఎలా ఉంది?తక్కువ అద్దెకు వస్తుందని కదా అని దెబ్బతిన్న ఇళ్లను అస్సలు ఒప్పుకోవద్దు. గోడలు తేమ పట్టడం, పైకప్పు నుంచి నీరు కారడం, పగుళ్లు పడిన నేలలు, సాలెగూళ్లు దట్టంగా ఉండటం వంటివి తీవ్రమైన వాస్తు దోషాలుగా పరిగణిస్తారు. అలాగే ఇంట్లోని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు, వైరింగ్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. పాడైపోయిన వైరింగ్ భద్రతకే కాదు, వాస్తు పరంగా కూడా నష్టాన్ని కలిగిస్తుంది.ఇంటిపై పడే చెట్ల నీడ జాగ్రత్త!ఇంటి ఆవరణలో చెట్లు ఉండటం మంచిదే కానీ, కొన్ని చెట్ల నీడలు ఇంటిపై పడటం అస్సలు మంచిది కాదు. రావి చెట్టు, ముళ్ల చెట్లు, లేదా చింత చెట్టు నీడ నేరుగా ఇల్లు లేదా ఫ్లాట్ పై పడేలా ఉంటే అలాంటి వాటిని నివారించడం మంచిది. అదే సమయంలో ఇంటి పరిసరాల్లో అశోక, వేప, శమీ (జమ్మి) వంటి పవిత్రమైన చెట్లు ఉంటే అవి శుభప్రదంగా మారి, ఇంట్లోకి లక్ష్మీ కటాక్షాన్ని, సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. వాస్తు శాస్త్రం అనేది మన పూర్వీకులు అందించిన ఒక అద్భుతమైన జీవన విధానం. అద్దె ఇల్లు వెతికేటప్పుడు ఈ వాస్తు నియమాలతో పాటు.. భద్రత, తాగునీటి సదుపాయం, రవాణా సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రతను కూడా సమానంగా బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోండి!