
సమాధానం: కాదు.. ఆప్షనలే. మీకు కావాలనుకుంటేనే మీరు పేరును రిజర్వ్ చేసుకోవచ్చు. లేదంటే నంబరుతోనే కొనసాగించొచ్చు. ప్రశ్న: నాకు కావాల్సిన యూజర్‌నేమ్ అందుబాటులో లేకపోతే..?
సమాధానం: కోరుకున్న యూజర్‌నేమ్ అందుబాటులో లేకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఆ పేరుమీద ఇప్పటికే ఇన్‌స్టా, ఫేస్బుక్ యూజర్లు ఉంటే.. వారికే దాన్ని కేటాయిస్తాం. అలాగే సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, మెటా ధ్రువీకరించిన ఖాతాదారుల పేర్లు కొన్నింటిని ఇప్పటికే రిజర్వ్ చేశాం. వాటిని చట్టబద్ధమైన యజమానులు మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంది. ఆ పేర్లను మీరు ఉపయోగించడానికి చేయడానికి ప్రయత్నిస్తే.. అందుబాటులో లేదనే సమాధానం వస్తుంది. కొత్త పేరుకోసం యూజర్‌నేమ్ జనరేటర్ ఆప్షన్‌ను వాడుకునే వీలు కల్పిస్తున్నాం.
ప్రశ్న: నా పేరిట ఇతరులను మోసం చేయడానికి నా యూజర్‌నేమ్ లాంటిదే క్రియేట్ చేసి మెసేజ్‌లు చేస్తే.. మోసపూరిత వ్యక్తులను ఎలా ఆపాలి?
సమాధానం: మెసేజింగ్ కోసం యూజర్‌నేమ్‌లు ఇంకా అందుబాటులోకి రాలేదు. అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త వారి నుంచి సందేశం వస్తే.. ఏ దేశం నుంచి అది వచ్చిందో వెల్లడిస్తాం. మొదటిసారి వచ్చినప్పుడు ఒక హెచ్చరిక చేస్తాం. బ్లాక్, రిపోర్ట్ వంటి ఆప్షన్లనూ కొనసాగిస్తాం.
ప్రశ్న: నా యూజర్‌నేమ్‌ను ఎవరైనా గెస్ చేసి, అపరిచితులు మెసేజ్ చేయడానికి వీలు ఉందా..?
సమాధానం: వాట్సప్‌లో కొత్తవారి నంబర్ కోసం వెతకడానికి అవకాశం లేనట్లే.. యూజర్‌నేమ్‌ను సెర్చ్ చేయడానికీ వీలుండదు. అయినప్పటికీ మీరు మరింత భద్రత కోసం యూజర్‌నేమ్ కీ ఆప్షన్, వాట్సప్‌కే ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను ఎంచుకోవడం వంటి మార్గాలున్నాయి.
సమాధానం: యూజర్‌నేమ్‌తో పాటు అదనపు భద్రత కోసం ఈ కీని ఉపయోగించుకోవచ్చు. ఇది ఎనేబుల్ అయి ఉంటే.. కొత్త వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించడానికి యూజర్‌నేమ్‌తో పాటు ఈ కీ కూడా తెలిసి ఉండాలి. ఈ కీని రీసెట్ చేసుకునే వీలు ఉంటుంది.
ప్రశ్న: మెటాలో ఉన్న ఇతర ఖాతాలను (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) లింక్ చేయాలా..?
సమాధానం: ఇన్‌స్టా, ఫేస్బుక్ ఖాతాలకు ఉన్న యూజర్నేమ్నే కోరుకుంటే.. వాటిని లింక్ చేయాల్సి ఉంటుంది. ఆ ఖాతాకు చట్టబద్ధమైన యజమాని అని నిర్ధరించుకునేందుకు ఇది ఒక మార్గం. కావాలనుకున్నప్పుడు అన్లింగ్ చేయొచ్చు. వాట్సప్‌నకు ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు.
వాట్సప్ కొత్తగా తీసుకొచ్చిన ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌తో.. నకిలీ గుర్తింపు ధ్రువీకరణలు పెరిగి, మోసాలు అధికమవుతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. ప్రముఖ సంస్థలు, వ్యక్తులను పోలిన పేర్లతో యూజర్ నేమ్ తీసుకుని, అమాయకులకు మెసేజ్‌లు పంపి మోసగించే వీలుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నోటీసులు జారీ చేసింది. సైబర్‌నేరాలు పెరిగే ప్రమాదం ఉన్నందున, ఐటీ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని మెటాను కేంద్రం ఆదేశించింది. మూడు రోజుల్లో సవివర నివేదిక అందించాలని, దీనిపై సమగ్ర పరిశీలన జరిపి, తాము సంతృప్తి చెందేవరకు భారత్‌లో అమలు చేయొద్దని ఆదేశించినట్లు కథనాలు వెలువడ్డాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.