
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli Returns) గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు.
ఇంగ్లాండ్‌తో ఈ నెలలోనే వన్డే సిరీస్ జరగనుంది. ప్రకటించిన స్క్వాడ్‌లో అతడికి చోటు కల్పించిన మేనేజ్మెంట్ ఓ కండీషన్ పెట్టింది. ఫిట్నెస్ సాధిస్తేనే బరిలోకి దింపుతామని పేర్కొంది. దీంతో కోహ్లీ తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు. అందుకోసం మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి సాధన చేస్తున్నాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా విరాట్ (Virat Kohli) కేవలం 50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ టార్గెట్ కూడా అదే. ఇప్పటికే అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన రోహిత్.. ఇంగ్లాండ్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ నేపథ్యంలో వీరిద్దరికి ప్రతి సిరీస్ కీలకమైందే. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌పై రోహిత్-విరాట్ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం టీమ్ఇండియా టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లోనే (India vs England) ఉంది. జులై 14 నుంచి వన్డే సిరీస్ మొదలవుతుంది. తొలి మ్యాచ్ 14న, రెండో వన్డే 16న, మూడో మ్యాచ్ 19న జరుగుతుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమ్ఇండియా బరిలోకి దిగుతుంది. హార్దిక్ పాండ్యకు చోటు దక్కలేదు. జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.