
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుమల, తిరుపతిలో జరిగిన రెండు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా తిరుమలలోని కర్ణాటక భవన్లో టీటీడీ బోర్డు సభ్యుడు జి.
భానుప్రకాష్‌రెడ్డి కుమార్తె డాక్టర్ వైష్ణవి, డాక్టర్ హర్షవర్థన్రెడ్డిల వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి పుష్పగుచ్ఛం అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తిరుపతిలోని భూపాల్ హౌసింగ్‌లో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కే. గౌతమీ శ్వేత నివాసాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతలను ఆశీర్వదించారు. మంత్రి సమక్షంలో వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈరోజు రాత్రి తిరుమలలోని శ్రీ శృంగేరి శారద పీఠంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతల వివాహం జరగనుంది..