
ఎల్జీ భారత్‌లో ఎక్స్‌బూమ్ బౌన్స్, ఎక్స్‌బూమ్ గ్రాబ్ పేరుతో రెండు కొత్త బ్లూటూత్ స్పీకర్లను విడుదల చేసింది. ఈ రెండు స్పీకర్లలో ఏఐ ఆధారిత ఆడియో టెక్నాలజీని అందించారు.
చుట్టుపక్క వాతావరణాన్ని బట్టి సౌండ్, లైటింగ్, లిజనింగ్ ప్రొఫైల్‌ను ఆటోమేటిగ్గా మార్చుకుంటాయి. భారత్‌లో ఎక్స్‌బూమ్ బౌన్స్ ధర రూ.12,999. ఎక్స్‌బూమ్ గ్రాబ్ ధర రూ.9,999. ప్రస్తుతం LG అధికారిక వెబ్సైట్లో బ్లాక్ కలర్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.ఎక్స్‌బూమ్ బౌన్స్‌లో 2.1-ఛానెల్ స్పీకర్ సిస్టమ్ ఉంది. ఇందులో రెండు 20mm డోమ్ ట్వీటర్లు, 93x53mm వూఫర్, రెండు ప్యాసివ్ రేడియేటర్లు ఉన్నాయి. మొత్తం 40W ఔట్‌పుట్‌ను అందిస్తుంది. ఎక్స్‌బూమ్ గ్రాబ్‌లో 1.1-ఛానెల్ టూ-వే స్పీకర్ సిస్టమ్, 16mm ట్వీటర్, 80x45mm వూఫర్, రెండు ప్యాసివ్ రేడియేటర్లతో 30W ఔట్పుట్ లభిస్తుంది. రెండు స్పీకర్లలోనూ కంటెంట్‌ను విశ్లేషించి ఏఐ ఆటోమేటిగ్గా సర్దుబాటు చేస్తుంది. బాస్, బూస్ట్, స్టాండర్డ్, కస్టమ్ ఈక్యూ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. గది పరిమాణం, పరిసరాలను గుర్తించి ఏఐ క్యాలిబరేషన్ ఆడియోను సర్దుబాటు చేస్తుంది. మ్యూజిక్కు అనుగుణంగా బిల్ట్-ఇన్ లైట్లను ఏఐ లైటింగ్ మార్చుతుంది.ఈ రెండు స్పీకర్లు బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో పాటు ఎస్బీసీ, ఏఏసీ ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ చేస్తాయి. మల్టీపాయింట్ కనెక్టివిటీ, పార్టీ లింక్ (డ్యూయల్, మల్టీ స్పీకర్ మోడ్లు), స్పీకర్‌ఫోన్, ఓటీఏ ఫర్మ్‌వేర్ అప్డేట్లు, గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ కమాండ్లకు కూడా సపోర్ట్ ఉంది. ఎక్స్‌బూమ్ బౌన్స్ ఒక్కసారి ఛార్జ్‌తో గరిష్ఠంగా 30 గంటలు, ఎక్స్‌బూమ్ గ్రాబ్ 20 గంటలు పనిచేస్తాయి.