
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Woman Seen How to kill Men book video viral: ఇటీవల కొంతమంది మహిళలు సమాజంలో నైతిక విలువలకు తూట్లు పొడుస్తున్నారు. చక్కగా పెళ్లిళ్లు చేసుకొని కాపురాలు చేయాల్సింది పోయి తమ చేజేతులా కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మంది తాము కట్టుకున్న వాళ్లను వివిధ కారణాలతో కాటికి పంపుతున్నారు. కొంత మంది తమ భార్యల్ని చంపితే, మరికొంత మంది తమ భర్తల్ని చంపుతున్నారు. కానీ ఇటీవల కొంతమంది మహిళలు చాలా వైలెంట్ గా తయారయ్యారు. భర్తల్ని లేదా మగాళ్లను కాటికి పంపడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉన్నారు.
ఎక్కడ చూసిన వివాహేతర సంబంధాలు, ఆర్థికపరమైన సమస్యలు మొదలైన అంశాలతో వివాదాలు పెద్దది చేసుకునిమరీ తమ కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. దీంతో చాలా మంది మగాళ్లు అసలు పెళ్లిళ్లు అంటేనే భయంతో జడుసుకుంటున్నారు. ఈ మధ్య పెళ్లిల్లంటేనే అమ్మాయిలు, అబ్బాయిలు చాలా టెన్షన్ కు గురౌతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని మెట్రోలో ఒక జరిగిన ఒక షాకింగ్ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెట్టింట దుమారం రాజుకుంది.
ముంబాయిలోని ఒక మెట్రోలో యువతి జనాల మధ్య కూర్చుని ఏంచక్కా how to kill men అని రాసి ఉన్న పుస్తకంను చదువుతుంది. నార్మల్ గా జర్నీల్లో ఎవరైన బుక్ లు చదవడం మనం చూస్తుంటాం. కొంత మంది కామెడీ బుక్ లు, నవలలు చదువుంటారు. ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. కానీ అసలే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆడవాళ్ల చేతుల్లో మగాళ్లు బలౌతున్న ఇలాంటి తరుణంలో యువతి మెట్రోలో how to kill men book చదవడం పెద్ద రచ్చగా మారింది.
Read more: Snake Video: ఇదెక్కడి మాస్ రా మావా.. నాట్యం చేస్తున్న పాముల తోకల్ని లాగుతున్న కాకి.!. ఫన్నీ వీడియో..
దీన్ని కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు మగాళ్లను చంపడమే కొంత మంది పనిగా పెట్టుకున్నారా..?.. దీని వల్ల సమాజంకు కానీ, మీకు కానీ ఏమైన ఉపయోగం ఉందా..?.. మరీ ఆ యువతి ఏదో ఫన్నీగా ఆ బుక్ తీసుకుని చూసిందో లేదా పబ్లిసిటీ కోసం చేసిన స్టంటో తెలిదూ కానీ మొత్తంగా ఈ వీడియో మాత్రం నెట్టింట కొత్త చర్చకు దారితీసిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.