
మోదీ 4.0 లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. తాజా లెక్కలు తెర మీదకు వస్తు న్నాయి. అందులో భాగంగా డీలిమిటేషన్.. జమిలి నిర్వహణను ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
అమలు చేసి తీరాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు వీలుగా జాతీయ రాజకీయాల్లో వేగంగా అడుగులు పడుతున్నాయి. పార్లమెంట్ లో వీగిన బిల్లును మరోసారి ప్రవేశ పెట్టి ఆమోదం పొందేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా జమిలి.. డీలిమిటేషన్ అమలు ముహూర్తం దాదాపు ఖారరైంది. అధికారిక ప్రక్రియ లాంఛనంగా మారనుంది.కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త లెక్కలు సిద్దం చేస్తోంది. లోక్‌సభలో ఇటీవల వీగిపోయిన డీలిమిటేషన్.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎలాగైనా ఆమోదించుకునే వ్యూహాలను సిద్దం చేసింది. అందులో భాగంగా తాజాగా ఎన్డీఏ వైపు టీఎంసీ, థాక్రే శివసేన ఎంపీలు మద్దతుగా నిలవటం తో ధీమా కనిపిస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్‌ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు (జమిలి) రెండింటికీ పార్లమెంట్‌ ఆమోదం పొందాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్‌లో డీలిమిటేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు టీఎంసీ నుంచి 29 మంది, డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అప్పుడు ఇండియా కూటమిలో ఉన్న టీఎంసీ, డీఎంకే పార్టీల ఆదేశాల ప్రకారం ఆయా ఎంపీలు ఇలా చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపో యాయి. టీఎంసీ నుంచి 20 మంది ఎన్డీఏ వైపు నిలుస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రల వేళ విజయ్ ఊహించని రాజకీయం..!!కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులుఅయితే.. లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 293 మంది (54%) సభ్యుల మద్దతు ఉండగా, రాజ్యసభ లో ఎన్డీయేకు అనుకూలంగా 141 మంది (58%) సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. తాజా పరిణామా లతో టీఎంసీ (29 మంది ఎంపీలు), డీఎంకే (22 మంది ఎంపీలు) ఓటింగ్‌లో పాల్గొనకుండా గైర్హాజరైనా లేదా బిల్లుకు మద్దతు ప్రకటించినా డీలిమిటేషన్‌ బిల్లు లోక్‌సభలో గట్టెక్కే అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఇండియా కూటమి నుంచి బయటకొచ్చిన ఆమ్‌ ఆద్మీపార్టీ (లోక్‌సభ లో ముగ్గురు ఎంపీలు), కాంగ్రెస్‌తో దూరాన్ని పాటిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ (లోక్‌సభలో 37 మంది ఎంపీలు) ఒకవేళ మద్దతు ప్రకటిస్తే సునాయాసంగా లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లుకు ఆమోదం లభించవచ్చు. ఇక, రాజ్యసభలోనూ లెక్కలు మారిపోతున్నాయి. ఈ లెక్కలను విశ్లేషించిన తర్వాతే.. డీలిమిటేషన్‌ బిల్లును పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర హోం శాఖ మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా వీటి ఆమోదం.. అమలు దిశగా పక్కగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. దీంతో.. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రాజకీయంగా కీలకంగా మారనున్నాయి.