బాణం, సోలో, ప్రతినిధి, అసుర, రౌడీ ఫెలో వంటి విభిన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్న నారా రోహిత్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ దశలో ఉంది. ఇటీవల భైరవం, సుందరకాండ వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆయన ప్రస్తుతం సీనియర్ హీరోలకు హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. ఒకేసారి ఇండస్ట్రీలోని ఇద్దరు అగ్ర హీరోల ప్రాజెక్టులలో కీలక పాత్రలు దక్కించుకుంటూ ఫిల్మ్ నగర్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారారు.అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో యువ హీరోలు పవర్ఫుల్ పాత్రల్లో మెరవడం కొత్తేమీ కాదు, మరి ఈ సినిమాలో రోహిత్ పాత్ర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..* అజిత్ నివాసానికి సీఎం విజయ్, నటి త్రిష.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు! మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందనున్న భారీ చిత్రం ‘Mega158’ ఇటీవల గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడంతో, ఈ కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్
బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి ప్రియమణి, మలయాళ భామ అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.* మా కష్టాన్ని గుర్తించండి చాలు... 'పెద్ది' ట్రోల్స్‌పై ఓపెన్ అయిన రామ్ చరణ్! అయితే ఈ సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్ర కోసం దర్శకుడు బాబీ పలువురు హీరోల పేర్లను పరిశీలించి, చివరికి నారా రోహిత్‌ను లాక్ చేసినట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఈ సరికొత్త విలక్షణమైన కాంబినేషన్ వెండితెరపై పూనకాలు తెప్పించడం ఖాయం. దీనిపై త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు పెద్ద హీరోల సినిమాలలో భాగం కావడం నారా రోహిత్ కెరీర్‌కు పెద్ద ప్లస్ కానుంది. అన్నట్టు నారా రోహిత్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య సిరి ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. ఇటీవలే ఆమెకు నిర్వహించిన సీమంతానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అటు కెరీర్, ఇటు పర్సనల్ లైఫ్‌లో రోహిత్ ప్రస్తుతం పీక్స్ దశని ఆస్వాదిస్తున్నాడు.