
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసత్యాలతో ప్రజలను మబ్బే పెట్టే కార్యక్రమం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు.
హైదరాబాద్, జులై 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలతో ప్రజలను మబ్బే పెట్టే కార్యక్రమం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఈరోజు (గురువారం) తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చే తెగువ కాంగ్రెస్ సర్కార్‌కి లేదని ఎద్దేవా చేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సవాల్ చేశారని.. ప్రెస్క్లబ్కి వెళ్తే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అప్పుల విషయంలో దమ్ముంటే రావాలని సీఎం సవాల్ చేశారని తెలిపారు.
పలు విషయాలపై చర్చించడానికి తాము సిద్ధమని రేవంత్‌రెడ్డికి చెప్పామని.. ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. సవాల్ విరిసిన ముఖ్యమంత్రి పారిపోయారని సెటైర్లు గుప్పించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్యలో సవాల్ విసిరారని.. ముఖ్యమంత్రి పంపితే జూపల్లి వస్తున్నారని అనుకున్నామని.. పనికి మాలిన డైలాగ్‌లను జూపల్లి కొడుతున్నారని వ్యగ్యంగా అన్నారు. సవాల్ విసిరి మంత్రులు పారిపోతున్నారంటేనే.. ఈ ప్రభుత్వ అసమర్ధత ఏంటో తెలిసిందని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు బయల్దేరగానే ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయించిందని ప్రశ్నించారు. గన్‌పార్కు రమ్మన్నారని.. వెళ్తుంటే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చేతకాని వాళ్లు ఎందుకు సవాల్ విసరాలి? అని నిలదీశారు. అసెంబ్లీలో తనకు గంట సమయం ఇవ్వాలని కోరారు.
ఓఆర్ఆర్పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్
అకారణంగా నన్ను సాయికృష్ణ కేసులో ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు: నాగరాజు
Read Latest AP News And Telangana News And National News