
రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఈ నెలలో శంకుస్థాపన చేయనున్నారు. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయం (State Central Library) (స్టేట్ సెంట్రల్ లైబ్రరీ)...
రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఈ నెలలో శంకుస్థాపన చేయనున్నారు. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయం (State Central Library) (స్టేట్ సెంట్రల్ లైబ్రరీ) పనుల్ని ఈ నెలలో ప్రారంభించనున్నారు. దీనికి అవసరమైన నిధుల్లో రూ.100 కోట్లు దుబాయ్‌కు చెందిన స్థిరాస్తి రంగ సంస్థ శోభా గ్రూప్ (Sobha Group) సమకూర్చనుంది. మిగతా రూ.50 కోట్లను ఇతర దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పరిశ్రమల నుంచి సమీకరించనున్నారు. ఇంకా నిధులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. 24 నెలల్లో ఈ లైబ్రరీ నిర్మాణం పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలన్నది లక్ష్మం. దీనికి రాజధానిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎనఐడీ) సంస్థకు సమీపంలో 19.60 ఎకరాల భూమిని సీఆర్డీఏ (CRDA) కేటాయించింది. స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో పాటు తెలుగు సాంస్కృతిక కేంద్ర, మానవ వనరుల అభివృద్ధి సంస్థ భవనాల్ని కూడా ఈ నెల 19.60 ఎకరాల్లోనే నిర్మించనున్నారు. భవన డిజైన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి.