
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) … తెలుగులో ఆమె మొదటి సినిమా ‘కన్నప్ప’. అలాగే ఆమె నటించిన ‘బ్లాస్ట్’ (Blast) అనే తమిళ సినిమా కూడా రిలీజైంది. అయితే కెరీర్ లో ఆమె అంగీకరించిన తొలి సినిమా ఇవేవీ కాదు.
ఆ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
‘ఆసకూడా’ మ్యూజిక్ వీడియోతో సోషల్ మీడియాను ఊపేసి, ఓవర్ నైట్ స్టార్ గా మారిన తర్వాత ప్రీతి ముకుందన్ సంతకం చేసిన మొదటి సినిమా ‘ఇదాయం మురళి’. ఈ సినిమాలో ఆమెది సెకెండ్ హీరోయిన్ రోల్. ఇప్పుడా సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది ప్రీతి ముకుందన్.
“నాకు మొదటి నుండి ఒక మంచి రొమాంటిక్ కామెడీ సినిమా చేయాలనేది కోరిక ఉండేది, ఆ కల ‘ఇదాయం మురళి’ చిత్రంతోనే నెరవేరబోతోంది. దర్శకుడు ఆకాష్ బాస్కరన్ చెప్పిన ఈ కథ పక్కా రొమాంటిక్ కామెడీ జోనర్ లో సాగుతూ నా మనసుకు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాను. ఇందులో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నేను ఒక విభిన్నమైన కీలక పాత్రలో కనిపించబోతున్నాను.”
జులై 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమానే, ప్రీతి ముకుందన్ తొలిసారి సైన్ చేసిన మూవీ. అందుకే ఈ మూవీని చాలా స్పెషల్ గా చూస్తోంది ప్రీతి. ఇందులో తన పాత్ర రెండు పూర్తి భిన్నమైన కోణాల్లో కనిపిస్తుందని ఆమె చెబుతోంది.