గాలిలో ఉండే అదృశ్యమైన నీటి ఆవిరిని తేమగా పిలుస్తారు. గాలిలో తేమ ఎక్కువగా ఉంటే ఉక్కపోత ఎక్కువగా ఉండి అసౌకర్యంగా అనిపిస్తుంది.వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.
అందుకే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నపుడు ఈ ఆహారాలు తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
నూనెలో డీప్ ఫ్రై చేసిన పకోడి, సమోసా, బజ్జీ లాంటి వాటిలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత పెరిగి ఉక్కపోత మరింత పెరుగుతాయి. అందుకే తేమ ఎక్కువగా ఉన్నపుడు నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తినడం మంచిది కాదు.
చాలామంది వేడి, ఉక్కపోతగా ఉన్నపుడు కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, చల్లటి ప్యాకేజీ పండ్ల రసాలు తాగుతుంటారు. కానీ వీటిలో షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీని డీహైడ్రేట్ చేసి దాహం అయ్యేలా చేస్తుంది. అందుకే వీటి బదులు కొబ్బరి నీళ్లు, ఇంట్లో చేసిన నిమ్మరసం తాగడం మంచిది.
మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమటలు ఎక్కువగా పడతాయి. తేమలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మసాలా ఫుడ్స్ తేమ ఎక్కువగా ఉన్నపుడు తినడం మంచిది కాదు.
ప్యాకేజీ చిప్స్, కార, చుడ్వా వంటి వాటిలో ఉప్పు ఎక్కువగా కలుపుతారు. మీరు ఆ ప్యాకెట్ల మీద చూస్తే సోడియం ఎంత ఉందో తెలుస్తుంది. వీటిని తినడం ద్వారా బాడీ తొందరగా డీహైడ్రేట్ అవుతుంది. దాహం వేస్తుంది. అందుకే తేమ ఎక్కువగా ఉన్నపుడు ఈ స్నాక్స్ తినొద్దు
పిజ్జా, బర్గర్, నూడిల్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు, నూనె ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో కొవ్వు పెంచి ఉష్ణోగ్రతను రెట్టింపు చేస్తాయి. దీంతో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అందువల్ల ఈ ప్రాసెస్ ఫుడ్స్ కూడా తినకూడదు.
మటన్, బీఫ్, పోర్క్ వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర జీవక్రియను పెంచి ఉష్ణోగ్రతను రెట్టింపు చేస్తుంది. దీంతో చెమట ఎక్కువగా పడుతుంది. అందుకే తేమ వాతావరణంలో వీటి బదులు చికెన్, చేపలు, కోడిగుడ్లు వంటివి తినడం మేలు.
కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలు తీసుకుంటే బాడీలోని ఫ్లూయిడ్స్ చెమట రూపంలో బయటకు పోతాయి. దీంతో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. తేమ వాతావరణంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే తేమ ఉంటే ఈ టీ, కాఫీలు తాగొద్దు.
ఆల్కహాల్ బాడీని తొందరగా డీహైడ్రేట్ చేస్తుంది. దీంతో శరీరంలోని లవణాలు కోల్పోయి అలసిపోతారు. అందుకే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నపుడు ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది.