క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల నిద్ర హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఉదయం పూట వ్యాయామం చేస్తే రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపడుతుందని హార్వర్డ్ హెల్త్ రిపోర్ట్ తెలిపింది.
మీ బెడ్‌ను కేవలం నిద్ర కోసం మాత్రమే ఉపయోగించండి. బెడ్ మీద వర్క్ చేయడం, ఫోన్ చూడటం వంటివి చేయవద్దు.
బెడ్రూమ్లో టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఉంచవద్దు. ఇవి నిద్రకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. బెడ్రూమ్ను నిద్ర కోసం కంపర్ట్బుల్గా ఉంచండి.
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోండి. ఒకే సమయానికి నిద్రలేవండి. దీని వల్ల సిర్కాడియన్ రిథమ్ బాగుంటుంది. నిద్ర బాగా వస్తుంది.
రాత్రి పూట పడుకునే ముందు తక్కువ తినండి. భారీ మోతాదులో తినడం వల్ల నిద్రలో సమస్యలు వస్తాయి. కాబట్టి మితంగా తినండి.
రాత్రిపూట ఆల్కాహాల్‌కు దూరంగా ఉండండి. మందు తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
నిద్రపోవడానికి 4-5 గంటల ముందు నుంచే కాఫీకి దూరంగా ఉండండి. కాఫీ తాగడం వల్ల నరాలు యాక్టివ్ అవుతాయి. నిద్ర సరిగా రాదు.
ఒత్తిడి పలు సమస్యలకు కారణం అవుతుంది. ఒత్తిడి పెరగడం వల్ల నిద్రకూడా సరిగా పట్టదు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకోండి. ఇందుకోసం ధ్యానం చేయండి.
పడుకునే గదిలో ఉష్ణోగ్రత చల్లగా ఉండేలా చూసుకోండి. గదిని డార్క్‌గా ఉంచుకోండి.