
వాట్సప్‌లోని యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల ప్రముఖుల పేర్లతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, దుర్వినియోగానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తోందని సైబర్ నిపుణుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.
దీనిపై వాట్సప్ స్పందించింది. రాబోయే యూజర్‌నేమ్‌ల ఫీచర్ కింద ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీల మెటా ఖాతాల పేర్లను రిజర్వ్ చేసి ఉంచుతుందని తెలిపింది. ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఆ ఫీచర్ పూర్తిగా వినియోగంలోకి రాలేదు : మెటా |