
తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు తీర్పు రాష్ట్రంలో అమలులో ఉన్న చట్టాలకు విరుద్ధంగా ఉందని, మతపరమైన ఆచారాలకు ఆటంకం కలిగిస్తోందని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఈ వ్యవహారం ప్రస్తుతం తమిళనాట రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ వాదనలు ఇవే..మే 27న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. 'తమిళనాడు జంతు సంరక్షణ చట్టం-1958' నిబంధనలకు విరుద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ చట్టం ప్రకారం పదేళ్లు దాటిన, వ్యవసాయ పనులకు లేదా సంతానోత్పత్తికి పనికిరావని పశువైద్య అధికారి ధ్రువీకరించిన ఆవులను వధించేందుకు అనుమతి ఉంది. అయితే, హైకోర్టు తీర్పు ఈ చట్టాన్ని పట్టించుకోకుండా, రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించిందని ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది. వాస్తవానికి, కోయంబత్తూరులో బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో జంతువధను నిరోధించాలని మాత్రమే కోర్టులో పిటిషన్ దాఖలైందని, కానీ హైకోర్టు తన పరిధిని దాటి రాష్ట్రవ్యాప్త నిషేధానికి ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వం వివరించింది.మత స్వేచ్ఛకు భంగం..బక్రీద్ లేదా మరే ఇతర రోజుల్లోనూ ఆవులు, దూడలను వధించకుండా చూడాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు కేవలం బక్రీద్ పండుగకే కాకుండా రాష్ట్రంలోని హిందూ దేవాలయాల్లో జరిగే జంతుబలులపై కూడా ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. పండుగల సమయంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా లైసెన్స్ ఉన్న స్లాటర్‌హౌస్‌లలో వసతి కల్పించడం అసాధ్యమని, చాలా వాటికి అంత