
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Shukra Ketu Yuti In Leo 2026 Telugu News: జ్యోతిష్య శాస్త్ర పరంగా 2026 జూలై నెలలో ఒక కీలకమైన గ్రహ మార్పు చోటుచేసుకోబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జూలై 4వ తేదీన సంపద, వైభవానికి కారకుడైన శుక్ర గ్రహం తన రాశిని మార్చుకుని కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయబోతోంది.. అయితే, అప్పటికే సింహ రాశిలో మాయా గ్రహంగా పరిగణించే కేతువు గ్రహం సంచార దశలో ఉంది.. దీనివల్ల సింహ రాశిలో శుక్ర, కేతువుల అరుదైన కలయిక జరగబోతోంది.
మఘా నక్షత్రంలోకి కేతువు ప్రవేశం.. జూలై 4వ తేదీన మరో ముఖ్యమైన మార్పు కూడా జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కేతువు ఆశ్లేష నక్షత్రాన్ని వదిలిపెట్టి.. తన స్వంత నక్షత్రమైన మఘా నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. కేతువు నీడలోకి శుక్రుడు రావడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని శుభఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్యంగా 4 రాశుల వారు ఈ గ్రహాల అనుగ్రహంతో జూలై నెల నుంచి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన పురోగతిని సాధించబోతున్నారు. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మిథున రాశి: మిథున రాశి వారికి శుక్ర-కేతువుల కలయిక ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి మాటతీరు మెరుగుపడటం వల్ల సమాజంలో వీరికి సంబంధించిన ప్రభావం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడి.. వ్యాపారాలు విస్తరించేందుకు మార్గాలు సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభసాటిగా మారుతాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరగడం వల్ల కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి.
మేష రాశి: మేష రాశి వారికి ఈ కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరిలో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో మీరు వేసిన ప్రణాళికలతో పాటు వ్యూహాలు విజయవంతం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కళలు, రచనలు లేదా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి సమాజంలో మంచి గుర్తింపుతో పాటు పెద్ద ప్రాజెక్టులు లభిస్తాయి. గతంలో చేసిన పెట్టుబడులు, షేర్ మార్కెట్ లేదా ఇతర వనరుల నుంచి ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి అదృష్టం పూర్తిగా కలిసిరాబోతోంది. సుదూర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు, లేదా అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.. వ్యాపారంలో విదేశీ వనరుల నుంచి భారీ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వారసత్వ ఆస్తి లేదా పాత వివాదాల పరిష్కారం వల్ల ఊహించని ఆర్థిక లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
తులా రాశి: ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ కష్టానికి తగ్గ సరైన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరుకు ముగ్ధులవుతారు.. దీనివల్ల పదోన్నతి లేదా జీతాల పెంపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలోపేతం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన బకాయిలు చేతికి అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. సమాజంలో పేరున్న పెద్దల నుంచి మీకు పూర్తి సపోర్ట్ లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.