
విద్యాశాఖలో సంస్కరణలు కొనసాగించాలని సూచన యువతలో స్ఫూర్తి నింపేలా లోకేష్ ప్రసంగించారని అభినందించిన రాష్ట్రపతి విద్యాశాఖ మంత్రిగా దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ, ఎన్నో...
విద్యాశాఖలో సంస్కరణలు కొనసాగించాలని సూచన యువతలో స్ఫూర్తి నింపేలా లోకేష్ ప్రసంగించారని అభినందించిన రాష్ట్రపతి విద్యాశాఖ మంత్రిగా దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ, ఎన్నో సంస్కరణలు విజయవంతంగా అమలు చేస్తున్న నారా లోకేష్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఈ సంస్కరణలు కొనసాగాలని సూచించారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరై తిరిగి వెళుతున్నప్పుడు రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు హెలికాప్టర్ వరకు మంత్రి లోకేష్ వెళ్లారు. తన దగ్గరకు మంత్రిని పిలిచిన రాష్ట్రపతి.. ఏపీలో విద్యాసంస్కరణలు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు చాలా బాగున్నాయని అభినందించారు. వీటిని కొనసాగించాలని సూచించారు. విద్యార్థులు కేంద్రంగా సాగుతున్న విద్యా వ్యవస్థ మార్పులు వారికి బంగారు భవిష్యత్తుకు మార్గం వేస్తాయన్నారు. స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం స్ఫూర్తివంతంగా సాగిందని రాష్ట్రపతి అభినందించారు. సభకు హాజరైన గ్రాడ్యుయేట్స్‌కు మంచి సందేశం ఇచ్చారని ప్రశంసించారు.