గుప్పెడు గుమ్మడి గింజలు తినడం ద్వారా మీకు దాదాపు 160మి.గ్రా మెగ్నీషియం లభిస్తుంది. ఇది మీ రోజువారీ మెగ్నీషియంలో దాదాపు 38 శాతానికి సమానం.
అందువల్ల మీరు రోజూ గుమ్మడి గింజలు తింటే గాఢ నిద్రను పొందవచ్చని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం పేర్కొంది.
ఓ కప్పు ఉడికించిన పాలకూరలో దాదాపు 155మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. ఈ పాలకూర తినడం ద్వారా ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపర్చి మంచి నిద్రను అందిస్తుంది.
ఓ కప్పు ఉడికించిన బ్లాక్ బీన్స్‌లో దాదాపు 120మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. అలాగే ఇందులోని ఫైబర్, ప్రోటీన్ మీక శక్తిని ఇవ్వడమే కాకుండా మంచి నిద్రకు సహాయపడతాయి.
రోజూ నానబెట్టిన ఓ 5-6 బాదం గింజలు తినడం ద్వారా దాదాపు 78మి.గ్రా మెగ్నీషియం పొందవచ్చు. ఈ బాదం తింటే కండరాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి దూరమవుతుంది. మంచి నిద్ర పడుతుంది.
ఒక మీడియం సైజ్ డార్క్ చాక్లెట్ తింటే మీకు దాదాపు 65మి.గ్రా మెగ్నీషియం లభిస్తుంది. అలాగే ఇందులో కోకో శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డార్క్ చాక్లెట్ తింటే తొందరగా నిద్ర పడుతుంది.
ఒక కప్పు జీడిపప్పులో దాదాపు 83మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. దీనిని తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మంచి నిద్రను పొందవచ్చు.
ఓ మీడియం సైజ్ అవకాడో తినడం ద్వారా మీకు దాదాపు 60మి.గ్రా మెగ్నీషియం లభిస్తుంది. అలాగే ఇందులోని హెల్తీ ఫ్యాట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్, చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతాయి. మీకు మంచి నిద్రను అందిస్తాయి.
ఓ కప్పు ఉడికించిన క్వినోవాలో దాదాపు 120మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. దీనిని రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఎనర్జీ పెరుగుతుంది. అలాగే గాఢ నిద్రను పొందవచ్చు.
ఓ గుప్పెడు చియా సీడ్స్‌లో దాదాపు 100మి.గ్రా మెగ్నీషియం లభిస్తుంది. ఈ చియా సీడ్స్లోని ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మంచి నిద్రను అందించడంలో సహాయపడతాయి.