
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Electric vehicle sales in June 2026: భారత ప్రధాని మోదీ చెప్పిన ఒకే ఒక మాటతో యావత్ దేశం ముందుకు దూసుకుపోతోంది. బంగారం అత్యవసరం అయితే కొనుగోలు చేద్దామన్న ప్రధాని విజ్ఞప్తి.. దేశంలో పసిడి కొనుగోళ్లు 70శాతం వరకు పడిపోయేలా చేసింది. మోదీ మాటలో అర్థం ఉందంటూ జనాలు కూడా ఆలోచిస్తున్నారు. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన కరువు దేశాన్ని కుదిపేసింది. ఈ సమయంలోనే మోదీ మరో విజ్ఞప్తి చేశారు.. ఇంధనాన్ని పొదుపుగా వాడుదాం.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుదాం.. ఇంధన సమస్యలకు పరిష్కారంతోపాటు.. వాతావరణానికి మేలు జరుగుతుందన్న ఒక సందేశంతో.. జనాలు ఈవీల వైపు పరుగులుపెట్టారు.
దీంతో భారత ఆటో రంగం కార్ల అమ్మకాలతో దూసుకుపోతోంది. గత జూన్.. ప్రస్తుతం సంవత్సరం మొదటి త్రైమాసిక గణాంకాలను పరిశీలించినట్లయితే ఈవీలను కొనుగోలు చేయడంలో జనాలు మరింత ఆసక్తి చూపించారు. టాటా మోటార్స్ గత జూన్ లో 12వేలకు పైగా ఈవీలను విక్రయించి ఆగ్రస్థానంలో నిలిచింది. హీంద్రా & మహీంద్రా 7645 యూనిట్లు, JSW MG మోటార్ 5785 యూనిట్లు, మారుతి సుజుకి 1896 యూనిట్లు, విన్‌ఫాస్ట్ 1394 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాయి. దేశీయ బ్రాండ్స్ కే జనాలు బ్రహ్మరథం పట్టారన్న సంగతి స్పష్టం అవుతోంది.
మీరు కూడా ఒక కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. గత జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల రిపోర్టును ఒకసారి చూడండి.
టాటా మోటార్స్: టాటా మోటార్స్ జూన్‌లో మొత్తం 12,025 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2027 మొదటి త్రైమాసికంలో ఈ దేశీయ సంస్థ మొత్తం 32,283 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. Tiago EV, Tigor EV, Punch EV, Nexon EV, Curvv EV, Harrier EV భారీగా అమ్ముడుపోయాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా: మహీంద్రా అండ్ మహీంద్రా జూన్‌లో మొత్తం 7,645 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మొత్తం EV అమ్మకాలు 20,112 యూనిట్లుగా నమోదయ్యాయి. XEV 9S, XEV 9e, BE6, అలాగే XUV 3XO EV, XUV 400 కార్లకు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పాలి.
ఎంజీ మోటార్స్: జూన్‌లో.. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మొత్తం 5,785 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో.. ఈ మొత్తం 16,502 యూనిట్లకు చేరింది. విండ్సర్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ, కామెట్లతో పాటు బాగా అమ్ముడవుతున్నాయి. ప్రీమియం ఈవీ విభాగంలో, సైబర్‌స్టర్, ఎం9 కూడా సేల్స్ లో ముందజలో ఉన్నాయి.
మారుతి సుజుకి: మారుతి సుజుకి తన ఏకైక ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన ఇ-విటారాతో భారత మార్కెట్లో దూసుకుపోతోంది. జూన్‌లో ఇ-విటారా 1,896 యూనిట్లు అమ్ముడవగా, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మొత్తం 4,894 యూనిట్లు అమ్మింది.
విన్‌ఫాస్ట్: వియత్నాం కంపెనీ కూడా భారత మార్కెట్లో హవా కొనసాగిస్తోంది. విన్‌ఫాస్ట్ జూన్‌లో భారత మార్కెట్లో మొత్తం 1,394 ఎలక్ట్రిక్ కార్లను.. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 3,973 ఈవీలను విక్రయించింది. విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో VF6, VF7 వంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో పాటు, VF MPV7 వంటి ఎంపీవీలను కూడా మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది.
టాప్ 10 ఎలక్ట్రిక్ కార్ కంపెనీల జాబితా: జూన్ నెలలో.. 860 యూనిట్లను విక్రయించి, టాప్ 10 ఎలక్ట్రిక్ కార్ కంపెనీల జాబితాలో BYD 6వ స్థానంలో నిలిచింది. కియా ఇండియా 446 యూనిట్లు, హ్యుందాయ్ మోటార్ ఇండియా 347 యూనిట్లు, టయోటా 32 యూనిట్లు, సిట్రోయెన్ కేవలం 24 యూనిట్లను విక్రయించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.