
నేటి రాశి ఫలాలు: ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, గ్రీష్మ రుతువు, ఉత్తరాయణం, జూలై 2, 2026 నేటి రాశి ఫలాలు గురువారం. పండితుల అభిప్రాయం ప్రకారం ఏ రాశులు జాగ్రత్తగా ఉండాలి?
ఏ రాశులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కష్టాల నుండి బయటపడతారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు.
మిథున రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కష్టపడితేనే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆకస్మిక నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఒత్తిడికి లోనుకాకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా, ప్రశాంతంగా సాగుతుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది.
కుంభరాశి వారు ఈరోజు ఎంతైనా కష్టపడాల్సిన రోజు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మంచి ఫలితాలు పొందాలంటే మంచి ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడండి. అనవసరంగా ఖర్చులు పెంచుకోకండి.
మీన రాశి వారికి కూడా ఈరోజు శుభప్రదమే. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)