
సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) చిత్రం నుంచి యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ (jaya krishna) హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో జయకృష్ణ యాక్షన్ అలరించేలా ఉంది. సి.అశ్వినీదత్ సమర్పణలో జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ "తాతయ్య కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. తాతయ్య నాకు దేవుడితో సమానం.
ఆయనపై నాకు ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆయన ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను. ‘శ్రీనివాస మంగాపురం’ నా తొలి చిత్రం. అజయ్ భూపతి గారు ఈ కథ చెప్పినప్పుడు ఇందులో ఉన్న ఎమోషన్స్, నా పాత్రలోని డెప్త్ నన్ను చాలా ఆకట్టుకున్నాయి.
ఈ క్యారెక్టర్ ద్వారా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చని, నటుడిగా నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని భావించాను. దత్తు గారు మా తాతగారితో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ మహేష్ బాబుతో ‘రాజకుమారుడు’ చేశారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్నారు.
ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. రాషా అద్భుతమైన నటి. అలాగే చాలా మంచి మనిషి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది.
మోహన్ బాబు గారు, నరేష్ గారు వంటి లెజెండరీ నటులతో కలిసి నటించడం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను మహేష్ బాబాయ్‌కు డైహార్డ్ ఫ్యాన్‌ని. ఈ సినిమా ఫస్ట్
సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) చిత్రం నుంచి యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ (jaya krishna) హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జయకృష్ణ యాక్షన్ అలరించేలా ఉంది. సి.అశ్వినీదత్ సమర్పణలో జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
జయకృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ "తాతయ్య కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. తాతయ్య నాకు దేవుడితో సమానం. ఆయనపై నాకు ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆయన ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను. ‘శ్రీనివాస మంగాపురం’ నా తొలి చిత్రం. అజయ్ భూపతి గారు ఈ కథ చెప్పినప్పుడు ఇందులో ఉన్న ఎమోషన్స్, నా పాత్రలోని డెప్త్ నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఈ క్యారెక్టర్ ద్వారా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చని, నటుడిగా నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని భావించాను. దత్తు గారు మా తాతగారితో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ మహేష్ బాబుతో ‘రాజకుమారుడు’ చేశారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. రాషా అద్భుతమైన నటి. అలాగే చాలా మంచి మనిషి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. మోహన్ బాబు గారు, నరేష్ గారు వంటి లెజెండరీ నటులతో కలిసి నటించడం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను మహేష్ బాబాయ్‌కు డైహార్డ్ ఫ్యాన్‌ని. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను ఆయనే లాంచ్ చేశారు. ఎప్పటికప్పుడు నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు' అని అన్నారు.