
సిల్వర్ బోర్డర్ ఉన్న టిష్యూ చీరలు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ అవుతున్నాయి. దీనికి సిల్వర్ బ్లౌజ్ జతచేసి మోనోటోన్ స్టైల్లో మెరిసిపోవచ్చు. నీలి ఆర్గాన్జా చీరపై సిల్వర్ జర్కన్ బోర్డర్ మంచి ఛాయిస్.
ఒకటిన్నర అంగుళాల వెడల్పు ఉన్న ఈ బోర్డర్‌పై పువ్వులు, ఆకుల డిజైన్ అద్భుతంగా ఉంటుంది.
రెయిన్బో షేడ్స్‌లో ఉండే ఈ చీరలో ప్రతి రంగు మధ్యలో సన్నని సిల్వర్ బోర్డర్ ఉంటుంది. ఇది మీకు ట్రెండీ లుక్ ఇస్తుంది.
మీరు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే, ప్రింటెడ్ చీరపై సిల్వర్ మిర్రర్ లేస్ వేయించుకోండి.
ప్లెయిన్ మోడల్ లేదా శాటిన్ సిల్క్ చీరకు డిజైనర్ లుక్ ఇవ్వడానికి సిల్వర్ కట్‌వర్క్ అంచు అందంగా ఉంటుంది.
బ్లాక్, సిల్వర్ కాంబినేషన్ రాయల్, క్లాసీగా ఉంటుంది. ప్లెయిన్ జార్జెట్ బ్లాక్ చీరపై సన్నని సిల్వర్ బోర్డర్ చక్కగా నప్పుతుంది.
రాయల్ బ్లూ, సిల్వర్ కలయిక ఎంతో ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. జార్జెట్ చీరపై సిల్వర్ స్టోన్ వర్క్ లేదా సిల్వర్ లేస్ బోర్డర్ బావుంటుంది.
Gold Ring: 3 గ్రాముల్లోనే గోల్డ్ రింగ్ డిజైన్స్ బడ్జెట్ లో లగ్జరీ లుక్
Pearl Choker: మెడ నిండుగా ముత్యాల చోకర్లు.. ఓసారి చూసేయండి..!
Multipurpose Blouse Designs:ఏ చీరలకైనా సూటయ్యే మల్టీ పర్సస్ డిజైన్లు
Silver Bangles: ఏ డ్రెస్ వేసుకున్నా.. ఈ వెండి గాజులతో అదిరిపోయే లుక్!