
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు మందగించాయి. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 6 శాతం తగ్గినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ రీసెర్చ్ తన...
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు మందగించాయి. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 6 శాతం తగ్గినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. అయితే, ఇదే సమయంలో కొత్త ఇళ్ల సరఫరా మాత్రం పెరగడం గమనార్హం. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నగరాల్లో కొత్త ప్రాజెక్టులు భారీగా ప్రారంభమయ్యాయి.వివరాల్లోకి వెళ్తే, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కలిపి సుమారు 90,715 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 96,285గా ఉంది. మరోవైపు, కొత్త ఇళ్ల సరఫరా వార్షికంగా 7 శాతం పెరిగింది. కొత్త ప్రాజెక్టుల విషయంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), హైదరాబాద్ ముందున్నాయి. హైదరాబాద్‌లో కొత్త సరఫరా ఏకంగా 53 శాతం పెరిగి రికార్డు సృష్టించింది. ఇక్కడ దాదాపు 16,970 కొత్త యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. MMRలో 34,555 యూనిట్లతో 23 శాతం వృద్ధి నమోదైంది.సరఫరా పెరిగినప్పటికీ అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. అత్యధికంగా 28,710 యూనిట్లు అమ్ముడైన MMRలో సైతం గతేడాదితో పోలిస్తే 8 శాతం క్షీణత కనిపించింది. హైదరాబాద్‌లో అమ్మకాలు కేవలం 2 శాతం మాత్రమే పెరిగాయి. అయితే, బెంగళూరు మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా నిలిచింది. అక్కడ అమ్మకాలు ఒక శాతం పెరిగి 15,285 యూనిట్లుగా నమోదయ్యాయి. కోల్‌కతాలోనూ 10 శాతం వృద్ధి కనిపించింది. మరోవైపు, పూణెలో అమ్మకాలు అత్యధికంగా 15 శాతం పడిపోయాయి.పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం,