భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు..
ఇంగ్లాండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. ఇక ఇటీవలే న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయిన ఇంగ్లాండ్.. స్వల్ప వ్యవధిలో భారత్‌తో సిరీస్‌కు సిద్ధమైంది. అయితే టెస్ట్ మ్యాచ్‌కు ఒకరోజు ముందు తుది జట్టు ప్రకటించే అలవాటు ఉన్న ఇంగ్లాండ్.. టీ20 మ్యాచ్‌కు ముందు సైతం అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. టీమిండియాతో జరిగే తొలి టీ20 మ్యాచ్ కోసం ఒకరోజు ముందే ప్లేయింగ్ లెవెన్‌ను ప్రకటించింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లీష్ జట్టు ఈ సిరీస్‌లో తలపడుతోంది. జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచుకు దూరమయ్యాడు.కాగా భారత్ ఇటీవల ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో చిత్తుగా ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయి.. చరిత్రలో తొలిసారి ఐర్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్‌తో ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ ఇదే..ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్ఇంగ్లాండ్తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, శివమ్ దూబె, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సుయాంశ్ షెడ్గేఇంగ్లాండ్ vs భారత్ టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20: జులై 1,చెస్టర్ లీ స్ట్రీట్రెండో టీ20:జులై 4, మాంచెస్టర్మూడో టీ20: జులై 7, నాటింగ్ హామ్నాలుగో టీ20: జులై 9, బ్రిస్టోల్ఐదో టీ20: జులై 11, సౌథాంప్టన్