
యూరప్‌లోని పలు దేశాల్లో ఇటీవల నమోదవుతున్న 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకే తారు రోడ్లు కరిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన చాలామంది
కి, 45 డిగ్రీల వేడిని సైతం తట్టుకునే మన రోడ్లతో పోల్చి, యూరప్ రోడ్ల నాణ్యతపై సందేహాలు వస్తున్నాయి. అయితే, ఇది నిర్మాణ లోపం కాదు, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించే శాస్త్రీయ ఇంజినీరింగ్ విధానమే దీనికి కారణం.యూరప్ దేశాల్లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువకు పడిపోతాయి. ఆ సమయంలో రోడ్లు గడ్డకట్టి పగుళ్లు రాకుండా ఉండేందుకు, అక్కడ మృదువుగా ఉండే 'సాఫ్ట్ బిటుమిన్' (తారులో ఒక రకం)ను ఉపయోగిస్తారు. ఇది చలిని బాగా తట్టుకుంటుంది, కానీ దీనికి వేడిని తట్టుకునే సామర్థ్యం తక్కువ. అందుకే, బయటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటినప్పుడు, సూర్యరశ్మికి నేరుగా వేడెక్కే రోడ్డు ఉపరితలం ఉష్ణోగ్రత 50-60 డిగ్రీలకు చేరి, తారు మెత్తబడి కరిగిపోతుంది.ఇందుకు భిన్నంగా, భారతదేశంలో ఏళ్ల తరబడి తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే 'హార్డ్ బిటుమిన్' (గట్టి తారు)ను రోడ్ల నిర్మాణంలో వాడతారు. వీజీ-30, వీజీ-40 వంటి గ్రేడ్ల తారును ఉపయోగించడం వల్ల, 45 డిగ్రీల వేడిలో కూడా మన రోడ్లు స్థిరంగా ఉంటాయి. మన రోడ్లు వర్షాలకు, నిర్వహణ లోపం వల్ల పాడవుతాయే తప్ప, సాధారణంగా ఎండలకు కరిగిపోవు.క్లుప్తంగా చెప్పాలంటే, యూరప్ రోడ్లు చలిని, భారత రోడ్లు ఎండను తట్టుకునేలా నిర్మించబడ్డాయి. ఇది నాణ్యతకు సంబంధించిన విషయం