
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు. ⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెడతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. ⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకించి పిల్లలకు కూడా చేతులు చక్కగా శుభ్రం చేసుకునేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి అని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి

ప్రతీఒక్కరూ బ్యాంక్‌కు ఒక్కసారి అయినా వెళ్లి ఉంటారు. బ్యాంకులో డిపాజిట్ లేదా విత్ డ్రా ఫామ్ నింపి లావాదేవీలు నిర్వహించి ఉంటారు. ఈ ఫామ్స్ నింపేటప్పుడు అమౌంట్‌ను సంఖ్య రూపంలో రాయడమే కాకుండా పదాల రూపంలో కూడా వివరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.10 వేలు డిపాజిట్ చేస్తున్నా లేదా విత్ డ్రా చేస్తుంటే.. టెన్ తౌజెండ్ రూపీస్ ఓన్లీ అని రాస్తూ ఉంటాం. చివరిలో ఓన్లీ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి కానీ చివరిలో 'Only' అనేది రాయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.“Ten Thousand” అని రాసిన తర్వాత ఖాళీగా వదిలేస్తే వేరే పదాలు రాయడానికి అవకాశం ఉంటుంది. అదే చివరిలో ఓన్లీ అనేది రాయడం వల్ల అక్కడితో వాక్యం పూర్తయిందని ఎవరికైనా అర్థమవుతుంది. దీని వల్ల వేరే పదం చేర్చే అవకాశం ఉండదని చెప్పవచ్చు. దీని వల్ల ఎలాంటి మోసాలు జరగవు. అయితే ఓన్లీ అనేది చివరిలో రాయకపోతే మీ చెక్కు లేదా డిపాజిట్, విత్ డ్రా ఫామ్ చెల్లదని కాదు. మీరు రాయకపోయినా అది చెల్లుతుంది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి ప్రత్యేక నిబంధన విధించలేదు. కేవలం భద్రతాపరమైన కారణాల వల్ల చివరిలో ఓన్లీ అనేది రాయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మొత్తాన్ని స్పష్టంగా రాయడం, ఖాళీ స్థలం వదలకపోవడం అనేది భద్రత కోసమేనని చెప్పవచ్చు. బ్యాంక్ సిబ్బంది కూడా చివరిలో ఓన్లీ అనేది చేర్చాలని సూచిస్తూ ఉంటారు. కేవలం సాధారణంగానే దీనిని సూచిస్తూ ఉంటారు. ఇక బ్యాంక్ సిబ్బంది స్వీకరించిన తర్వాత అమౌంట్, పదాల్లో ఒకేలా ఉందా.. లేదా అనేది పరిశీలిస్తారు. అంకెల్లో అమౌంట్ ఒకలా.. పదాల్లో ఒకలా ఉంటే సులువుగా గుర్తు పడతారు. చెక్ ప్రాసెసింగ్ సమయంలో దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు చెక్కు జమ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు దీనిని పరిశీలించుకోవాలి. రెండు చోట్ల ఒకేలా ఉందా..లేదా అనేది చూసుకోవాలి. రెండు చోట్ల

మొబైల్ ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (IMEI) నంబర్‌ను ట్యాంపర్ చేయడం లేదా ఆ నంబర్ మార్పులు చేసిన ఫోన్లను వాడటంపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని సోమవారం స్పష్టం చేసింది.దేశంలో మొబైల్, డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెలికాం ఐడెంటిఫైయర్ల దుర్వినియోగం పౌరుల భద్రతకు, నెట్‌వర్క్‌ల సమగ్రతకు పెను సవాలుగా మారిందని టెలికాం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ చట్టంలోని సెక్షన్ 42(3)(c) ప్రకారం IMEI నంబర్లతో సహా ఎలాంటి టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్లను ట్యాంపర్ చేయడం నిషేధం.ఈ నిబంధనలను ఉల్లంఘించడం కాగ్నిజబుల్ (వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయదగిన), నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణిస్తామని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికే కాకుండా, దానికి సహకరించిన లేదా ప్రోత్సహించిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని సెక్షన్ 42(6) చెబుతోందని వివరించింది. మోసపూరిత మార్గాల్లో, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి సిమ్ కార్డులు పొందడం కూడా నేరమేనని పేర్కొంది.పౌరులకు పలు కీలక సూచనలు చేసింది. మార్పులు చేసిన IMEI నంబర్లు ఉన్న మోడెమ్‌లు, సిమ్ బాక్సులు వంటి పరికరాలను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ముఖ్యంగా, తమ పేరు మీద తీసుకున్న సిమ్ కార్డులను ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం

దోమల నివారించాలంటే ఇదే చాలా ముఖ్యమైన విషయం. నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టి సంతానాన్ని పెంచుకుంటాయి. ఇంటి చుట్టూ ఉన్న చిన్న నీటి గుంటలు, పూల కుండీల కింద ప్లేట్లు, పాత బకెట్లు, వాటర్ కూలర్లు, డ్రైనేజీలు, వర్షపు నీరు చేరే చోట తరచూ క్లీన్ చేసుకోవాలి. కొంచెం నీరు నిలిచినా దోమలు గుడ్లు పెట్టేస్తాయి. అందుకే కనీసం వారానికి రెండుసార్లు శుభ్రం చేయడం మంచిది. కొన్ని సువాసన వెదజల్లే మొక్కలను ఇంటి ముందు, కిటికీలు, బాల్కనీ దగ్గర ఉంచడం ద్వారా దోమలు రాకుండా చేయొచ్చు. తులసి, పుదీనా, లెమన్‌గ్రాస్, బంతి వంటి మొక్కలను ఇంటి చుట్టూ పెంచుకోవచ్చు. ఇంట్లో దోమలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకుని కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలిపి ఉంచండి. వాటిపై దోమలు పడితే మళ్లీ ఎగరలేవు. నిమ్మకాయను సగానికి కోసి అందులో కొన్ని లవంగాలను గుచ్చి కిటికీలు, టేబుల్స్ లేదా దోమలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో పెట్టండి. నిమ్మ, లవంగాల వాసనకు దోమలు పారిపోతాయి. ఫ్యాన్ గాలి ఎక్కువగా ఉంటే దోమలు మనుషులపై వాలలేవు. అందుకే దోమలు ఎక్కువగా ఉండే సమయంలో గదిలో సీలింగ్ లేదా టేబుల్ ఫ్యాన్‌ను ఉపయోగించడం కొంతవరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవాలి

ఒంటరితనం కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: గుండె ఆరోగ్యం అంటే కేవలం కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా రోజుకు ఎన్ని అడుగులు నడిచామన్నది మాత్రమే కాదు. మన మానసిక ఆరోగ్యం, ఇతరులతో మనకున్న సంబంధాలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఒంటరితనం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఒంటరితనం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒంటరితనం అంటే ఇంట్లో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. మనసుకు దగ్గరైన వారితో మాట్లాడే అవకాశం లేకపోవడం, ఇతరులతో అనుబంధం లేకపోవడం కూడా ఒంటరితనంలోకి వస్తాయి. ఎక్కువ కాలం ఇలా ఒంటరిగా ఉంటే ఒత్తిడి పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. పరిశోధనల్లోనూ దీర్ఘకాలిక ఒంటరితనం, సామాజికంగా ఇతరులకు దూరంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని తేలింది. గుండె ఆరోగ్యం కోసం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ఒంటరితనాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇతరులతో బంధాలు కొనసాగించాలి. దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒంటరితనం ఒక్కటే గుండె జబ్బులకు కారణమవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. గుండె జబ్బుల ముప్పుపై వయసు, వంశపారంపర్యం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం, ఆహారం, శారీరక శ్రమ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అయితే గుండె ఆరోగ్యం కేవలం ఆహారం, వ్యాయామంపైనే ఆధారపడదు. మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని నియంత్రించుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించడం కూడా మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమే. Note: ఇందులోని

రోజంతా ఆఫీసులో కుర్చీకే పరిమితమవుతున్నారా? రోజుకు 8 గంటలు కూర్చోవడం వల్ల శరీరంలో కదలిక తగ్గుతుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యల ముప్పు పెరగొచ్చు. అయితే రోజువారీ జీవితంలో నడక, చిన్న చిన్న కదలికలను పెంచడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.8 గంటలు కూర్చుంటే ఏం జరుగుతుంది?ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లలోని కండరాలు పెద్దగా పనిచేయవు. దీంతో శరీరం తక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అంతేకాదు.. రక్తంలో చక్కెర నియంత్రణ, రక్త ప్రసరణ, కొవ్వు జీవక్రియ వంటి ప్రక్రియలపై కూడా ప్రభావం పడొచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే రోజుకు 8 గంటలు కూర్చోవడం వల్ల వెంటనే వ్యాధి వస్తుందని కాదు. కదలిక తక్కువగా ఉండే జీవనశైలి ఎక్కువకాలం కొనసాగినప్పుడు ఆరోగ్య ముప్పు పెరుగుతుంది.రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?8 గంటలు కూర్చోవడం వల్ల కలిగే అన్ని ప్రభావాలను పూర్తిగా తొలగించే నిర్దిష్ట అడుగుల సంఖ్య ఏదీ లేదు. అయితే రోజుకు 30-40 నిమిషాల మోస్తరు స్థాయి వ్యాయామం, ముఖ్యంగా వేగంగా నడవడం ఉపయోగకరంగా ఉంటుంది. వ్యక్తి వయసు, ఫిట్నెస్, ఆరోగ్య పరిస్థితిని బట్టి రోజుకు 7,000-10,000 అడుగులు మంచి లక్ష్యంగా ఉండొచ్చు.ఒక పరిశోధనలో రోజుకు 8,000 అడుగులు వేసేవారిలో మరణ ప్రమాదం 4,000 అడుగులు వేసేవారితో పోలిస్తే దాదాపు సగం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే కావడంతో 8,000 అడుగులు వేస్తే మరణ ప్రమాదం సరిగ్గా సగానికి తగ్గుతుందని చెప్పలేం.30-40 నిమిషాలు నడిస్తే

కేవలం రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ఉద్యోగులపై ఉన్న నేరారోపణలను కొట్టివేస్తూ.. వారిని పూర్తి నిర్దోషులుగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేనప్పుడు కేవలం రికవరీని ప్రాతిపదికగా తీసుకుని శిక్ష విధించడం చట్టరీత్యా చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.పంచదారపై కేంద్రం కొత్త రూల్స్, ఇకపై 15 రోజులే ఛాన్స్.. 1996 నాటి ఘటనఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 1996లో గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బెచారి గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఓ విద్యార్థి ఆదాయ ధ్రువీకరణ పత్రం(ఇన్కమ్ సర్టిఫికేట్) కోసం వెళ్లాడు. సర్టిఫికేట్ ఇచ్చేందుకు క్లర్క్ రూ.120 లంచం డిమాండ్ చేశాడని(అందులో క్లర్క్‌కు రూ.100, అటెండర్‌కు రూ.20) ఆరోపిస్తూ సదరు విద్యార్థి అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. అధికారులు రంగంలోకి దిగి గుర్తులు ఉన్న రూ.120 నోట్లను ఇచ్చి ఏసీబీ ట్రాఫ్ నిర్వహించారు.విచారణలో తేలిన విషయాలు ఏసీబీ సోదాల సమయంలో విద్యార్థి వద్ద ఉన్న రూ.20 నోటును అటెండర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే క్లర్క్ వద్ద నుంచి ఎలాంటి సొమ్ము లభించలేదు. విచారణ క్రమంలో సదరు విద్యార్థి ఇచ్చిన వాంగ్మూలంలో తీవ్ర వైరుధ్యాలు వెలుగు చూశాయి. క్లర్క్ పక్కనే ఉన్నప్పటికీ మొత్తం రూ.120 ఇవ్వకుండా కేవలం రూ.20 మాత్రమే ఎందుకు ఇచ్చాడనే దానికి స్పష్టత లేదు. అంతేకాకుండా అటెండర్ తనను నేరుగా ఎలాంటి లంచం డిమాండ్ చేయలేదని విద్యార్థి క్రాస్ ఎగ్జామినేషన్‌లో అంగీకరించాడు. మరుసటి రోజు ఈద్ పండుగ ఉన్నందున విద్యార్థి సంతోషంతో ఇచ్చి ఉండవచ్చన్న అటెండర్ వివరణను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.కుప్పకూలిన హెలికాప్టర్: ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం! దిగువ కోర్టుల తీర్పులు రద్దు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 20 ప్రకారం

వర్షాకాలం వచ్చిందంటే చాలు... చినుకులు, తేమ వాతావరణం తెచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. బురద, ఆరని దుస్తుల గోల ఒకెత్తయితే, ఈ సీజన్ లో పెరిగే పాముల బెడద మరో పెద్ద తలనొప్పి. ఊళ్లలోనే కాదు, నగరాల్లోని అపార్ట్మెంట్లు, విల్లాల్లోకి కూడా పాములు వచ్చేస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, వారు బయట ఆడుకునేటప్పుడు ఎంత భయంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, రసాయనాలు వాడకుండా మన పెరట్లో నాటే కొన్ని సహజసిద్ధమైన మొక్కల ద్వారా పాములను దూరంగా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కలేంటో, అవి ఎలా పనిచేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. పాములకు వాసనను పసిగట్టే శక్తి చాలా ఎక్కువ. అందుకే తీవ్రమైన లేదా ఘాటైన సువాసనలు వచ్చే మొక్కల పరిసరాల్లోకి రావడానికి ఇవి ఇష్టపడవు. • సర్పగంధ: దీనికే పాతాళ గరుడ, పాతాళ గంధి అనే పేర్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడే ఈ మొక్క వేర్లు, ఆకుల నుంచి వచ్చే ఘాటైన వాసన పాములకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. • వెల్లుల్లి, ఉల్లి: మన వంటగదిలో వాడే వెల్లుల్లి, ఉల్లి మొక్కల్లో ఉండే సల్ఫర్, అల్లిసిన్ రసాయనాలు సహజ సిద్ధమైన స్నేక్ రిపల్లెంట్ లా పనిచేస్తాయి. వెల్లుల్లి రెబ్బలను నీటిలో కలిపి ఇంటి చుట్టూ చల్లడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. • దవనం, నిమ్మగడ్డి: పూలల్లో కలిపే దవనం తెచ్చే తాజా సువాసన మనుషులకు నచ్చినా పాములకు శత్రువే. అలాగే నిమ్మగడ్డిలో ఉండే సిట్రోనెల్లా వాసన పాములతో పాటు దోమలను కూడా తరిమికొడుతుంది. మన ఇంట్లో ఎంతో అందంగా పూసే ముద్ద బంతి, కారబ్బంతి పూల మొక్కలు కేవలం తోటకు అందాన్ని ఇవ్వడమే కాదు, పాముల నివారణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. బంతి పూల వేర్లు, ఆకుల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన, రసాయనాలు పాములను, ఇతర చిన్న కీటకాలను దూరంగా

తెలంగాణలో ఆహార, ఔషధాల కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)’ తొలి కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు, ఆహార పదార్థాలు, నిత్యావసర ఔషధాల నాణ్యత, భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ నూతన వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.రాష్ట్రంలో ఫుడ్ లైసెన్సులు పొందిన వ్యాపార సంస్థలు, ఫార్మా కంపెనీల సంఖ్య గణనీయంగా పెరగడంతో పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే, ఇప్పటివరకు వేర్వేరుగా కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ‘టీజీ సేఫ్’ను రూపొందించారు. నాణ్యత లేని, కల్తీ ఆహార ఉత్పత్తులతో పాటు నకిలీ ఔషధాల తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ నూతన అథారిటీ ప్రధాన ఉద్దేశ్యం.ఈ రెండు విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి, తనిఖీలను ముమ్మరం చేయడం ద్వారా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా, ఫుడ్, ఫార్మా వ్యాపారాలు అధికంగా కేంద్రీకృతమై ఉన్న హైదరాబాద్‌లోని క్యూర్ ఏరియాలో ఈ ఏకీకృత వ్యవస్థను అమలు చేయనున్నారు

ఆసుపత్రులు, క్లినిక్‌లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నిరంతరం శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రదేశాలు, వస్తువులు సూక్ష్మక్రిములకు నిలయాలుగా మారే ప్రమాదం ఉంది. రోగులు, వారి సహాయకులు, సిబ్బంది తరచూ తాకడం వల్ల ఈ వస్తువులపై కంటికి కనిపించని క్రిములు పేరుకుపోతాయి. అందుకే.. వైద్యశాలలకు వెళ్లినప్పుడు కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.హాస్పిటల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మనం ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం. ముఖ్యంగా గదుల డోర్ హ్యాండిల్స్, లోపలికి నెట్టే ప్లేట్లను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. అలాగే, వెయిటింగ్ రూమ్‌లోని కుర్చీలు, వాటి హ్యాండిల్స్‌ను ఎంతోమంది పట్టుకుంటారు. కూర్చోవడానికి, లేవడానికి వాటిపై చేతులు ఆనించడం సర్వసాధారణం. రిసెప్షన్ కౌంటర్ల వద్ద చేతులు, ఫోన్లు, పర్సులు, డాక్యుమెంట్లు వంటివి పదేపదే తాకుతూ ఉంటారు. ఇవన్నీ సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడానికి కారణమవుతాయి.రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద అందరూ పంచుకునే పెన్నులు కూడా ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి ఒక ముఖ్య కారణం. అదేవిధంగా, లిఫ్ట్లలోని బటన్లను వందల మంది వేర్వేరు వ్యక్తులు నొక్కుతారు. వాటిని ఎప్పుడు శుభ్రం చేశారో కూడా తెలియదు. మంచినీటి కోసం ఉపయోగించే వాటర్ కూలర్ ట్యాపులు లేదా డిస్పెన్సర్ బటన్లు కూడా క్రిములకు నిలయాలుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్, ఫీడ్‌బ్యాక్ కోసం ఉపయోగిస్తున్న ట్యాబ్లెట్ స్క్రీన్లు, డిజిటల్ పరికరాలను కూడా చాలామంది తాకడం వల్ల ముప్పు పొంచి ఉంది.వీటన్నిటితో పాటు బాత్రూమ్ డోర్ హ్యాండిల్స్, ట్యాపుల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. అయితే, ఈ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి
సినీ హీరోల అభిమానులంటే వారి సినిమాల సందర్భాల్లో థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు కట్టడం, పుట్టినరోజున కేకులు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. అయితే తాము అందరి హీరోల ఫ్యాన్స్‌లా కాదంటూ తాజాగా నిరూపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు. సినిమా వేడుకలు, ఫ్లెక్సీలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ లక్ష్యానికి మద్దతుగా, ‘ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ’ ( AAFA ) దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం చేపట్టిన అవగాహన ఉద్యమం విశేష స్పందనను రాబడుతోంది. ముఖ్యంగా ప్రాణాంతక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ( సర్వైకల్ క్యాన్సర్ ) నివారణకు దోహదపడే హెచ్‌పీవీ (HPV) టీకా ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.* ‘బల్లగుద్ది చెప్తున్నా.. సినిమా అందరికీ నచ్చుతుంది’: ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ ధీమా7 రాష్ట్రాలు.. 400కి పైగా సదస్సులు ‘ఒక లక్ష మంది బాలికలు.. ఒక ఉజ్వల భవిష్యత్తు’ అనే ప్రధాన ఆశయంతో AAFA ఈ మహా యజ్ఞాన్ని ముందుకు నడిపిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 7 రాష్ట్రాల్లో 400కి పైగా అవగాహన సదస్సులను విజయవంతంగా పూర్తి చేసి, సుమారు లక్ష మందికి పైగా యువతులకు, పాఠశాల-కళాశాల విద్యార్థినులకు ప్రత్యక్షంగా చేరువయ్యారు. సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్లను సకాలంలో టీకా తీసుకోవడం ద్వారా ఎలా నిరోధించవచ్చో వైద్య నిపుణుల సమక్షంలో వివరించారు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు వయసున్న బాలికలు, యువతులకు ఈ వ్యాక్సిన్ అత్యంత కీలకమని తెలియజేస్తూ, చిన్న వయసులోనే టీకా తీసుకోవడం వల్ల కలిగే రక్షణను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుబాటులో ఉన్న ఉచిత టీకా సదుపాయాల గురించి సాధారణ ప్రజలకు సులభంగా
మద్యం తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే చాలామందికి ఓ పెద్ద సందేహం ఉంటుంది. డ్రింక్స్‌లో నీళ్లు కలపాలా లేక సోడానా? ఐస్ క్యూబ్స్ ఎందుకు వేసుకోవాలి? ఈ విషయంలో ఉన్న అపోహలపై ప్రముఖ ఆరోగ్య నిపుణుడు డాక్టర్ రాజు సైంటిఫిక్‌గా సమాధానాలు ఇచ్చారు. డాక్టర్ రాజు చెబుతున్న ప్రకారం మన శరీరంలోని కణాలు, గుండె, లేదా లివర్ ఎప్పుడూ కూడా ఆల్కహాల్ లాంటి పానీయం కావాలని కోరుకోవు. అసలు అది శరీరానికి అవసరమే లేదు. కేవలం మానసిక సంతృప్తి కోసం ఆల్కహాల్ తాగుతూ ఉంటారు. మద్యంలో వేర్వేరు ద్రవాలు కలిపినప్పుడు శరీరంపై కలిగే ప్రభావాలు కూడా తేడాగా ఉంటాయి. చాలామంది డ్రింక్స్‌లో ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగడం చూసే ఉంటారు. ఐస్ వల్ల నోటిలోని నరాలు మొద్దుబారిపోతాయి. అందుకే మద్యం చేదుగా అనిపించదని డాక్టర్ రాజు వివరిస్తున్నారు. మద్యంలో సోడా కలిపినప్పుడు, అందులోని గ్యాస్ కడుపులో ఉన్న ఆల్కహాల్‌ను వేగంగా చిన్న ప్రేగులోకి నెడుతుంది. దీనివల్ల ఆల్కహాల్ రక్తంలోకి చాలా స్పీడ్‌గా కలిసిపోయి 'కిక్' తొందరగా వస్తుంది. శరీరంపై వేగంగా ప్రభావం చూపే పద్ధతి ఇది. స్ప్రైట్ లేదా ఇతర కూల్ డ్రింక్స్ కలిపినప్పుడు, వాటిలో ఉండే అధిక గ్లూకోజ్ (చక్కెర) శరీరంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుతుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అందుకే మరుసటి రోజు తీవ్రమైన హ్యాంగోవర్, తలనొప్పి వస్తాయని డాక్టర్ రాజు హెచ్చరించారు. జ్యూస్‌లు, పండ్లు, రకరకాల ఫ్లేవర్లతో కలిపి చేసే కాక్టెయిళ్లలో చక్కెర, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ రాజు ప్రకారం, ఒక గ్లాస్ కాక్టెయిల్ తాగితే, ఒక పూట భోజనం చేసినన్ని క్యాలరీలు శరీరానికి అందుతాయి. మద్యపానం ఆరోగ్యానికి ఎప్పటికీ మంచిది కాదు. ఒకవేళ ఈ అలవాటును మానుకోలేకపోతే, వీలైనంత తక్కువ మోతాదులో తీసుకోవాలి. శరీరానికి హాని జరగకుండా జాగ్రత్తపడటం చాలా ముఖ్యం అని డాక్టర్ రాజు సూచించారు
.webp)
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజల్లో దేశభక్తి రగిలించిన జాతీయ గేయం వందేమాతరం చుట్టూ మళ్లీ రాజకీయ దుమారం చెలరేగింది. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయమైన ఇందిరా భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.పంద్రాగస్టు వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ గేయం పాడుతున్న సమయంలో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. కాంగ్రెస్ వర్గాలు ఆ ఆరోపణలను, విమర్శలను ఖండించాయి. ఈ వివాదం కేవలం ఒక రోజు కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకుండా, వందేమాతరం గేయానికి ఉన్న చారిత్రక నేపథ్యం, మతపరమైన భిన్నాభిప్రాయాలు, ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్టం నిబంధనలపై కూడా పునరాలోచనకు దారితీసింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15న జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వందేమాతరం గేయాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడం ప్రారంభించారు. గేయం ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సంజ్ఞలు చేయడం, అనంతరం రాహుల్ గాంధీ కూడా ఆ సంజ్ఞలను అనుసరించడం కేమెరాలలో కనిపించింది. ఇందేరే సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బీజేపీ.. కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గేయాన్ని పూర్తిగా పాడటానికి ఇష్టపడలేదని, అందుకే దానిని మధ్యలోనే నిలిపివేయడానికి ప్రయత్నించిందని ఆరోపణలు చేసింది. అయితే కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. మల్లికార్జున్ ఖర్గే వయోభారం వల్ల చాలా సేపు నిలబడలేకపోయారని, ఆయనకు కుర్చీ తీసుకురావాల్సిందిగా మాత్రమే సోనియా గాంధీ సూచించారని, వందేమాతరాన్ని ఆపడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ ఘటన చోటుచేసుకున్న సమయానికి కొన్ని రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఒక కీలకమైన చట్టపరమైన నిర్ణయం తీసుకున్నాయి. జాతీయ గౌరవానికి భంగం కలిగించే నిరోధక సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 1971 నాటి పాత చట్టానికి చేసిన ఈ సవరణ ద్వారా వందేమాతరం ఆలపించే సమయంలో

మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ముప్పు పొంచి ఉన్న భారతీయులు ముందస్తు జాగ్రత్త తీసుకునేందుకు వీలుగా గూగుల్ ఓ హెల్త్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ముప్పు పొంచి ఉన్న భారతీయులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా గూగుల్ ఓ హెల్త్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మధుమేహం బారిన పడకముందు శరీరంలో పెరిగే ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ను గుర్తించే ఫీచర్‌ను పిక్సెల్ వాచ్ 5లో జోడించింది. రక్త పరీక్ష అవసరం లేకుండా పిక్సెల్ వాచ్ సాయంతో ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ను అంచనా వేసేలా ఈ ఫీచర్‌ను ప్రత్యేక ఆల్గొరిథమ్తో తీర్చిదిద్దింది. ఆరోగ్యంపై కన్నేసి ఉంచేందుకు ఉద్దేశించిన హెల్త్ గార్డియన్ సూట్ ఉత్పత్తుల్లో భాగంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ఈ ఫీచర్ పిక్సెల్ వాచ్ 3 మొదలు ఆ తరువాత మోడల్స్ అన్నిటిలోనూ ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్ నాటికి దశలవారీగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. రక్తంలోని చక్కెరలను శరీరంలోని కణాల్లోకి చేర్చి వాటికి తగినంత శక్తి అందేలా చేసే హార్మోన్ ఇన్సులీన్. అయితే, శరీరంపై ఈ హార్మోన్ ప్రభావం తగ్గడాన్ని ఇన్సులీన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఈ రెసిస్టెన్స్ పెరుగుతున్నప్పుడు రక్తంలోని చక్కెరను కణాల్లోకి చేర్చేందుకు శరీరం అదనంగా ఇన్సులీన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. మరోలా చెప్పాలంటే, రక్తంలోని చక్కెర నిల్వలను అదుపులో పెట్టేందుకు శరీరం మరింత శ్రమపడాల్సి వస్తుంది. దీర్ఘకాలం పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యక్తులు క్రమంగా బరువు పెరుగుతారు. అంతిమంగా టైప్-2 మధుమేహం బారినపడతారు. పైకి ఎలాంటి సూచనలూ లేకుండానే శరీరంలో ఇన్సులీన్ రెసిస్టెన్స్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. తమకు ఈ సమస్య ఉన్న విషయాన్ని చాలా మంది గుర్తించలేరని కూడా అంటున్నారు. గూగుల్ అంచనా ప్రకారం, దాదాపు 40 శాతం మంది వయోజనులకు

One Cigarette a Day: కొందరు ఎప్పుడు చూసినా సిగరెట్ తాగుతూనే కనిపిస్తారు.. ఇంకా కొంతమంది గతంలో కంటే.. చాలా తగ్గించానని చెబుతారు.. మరికొందరు.. రోజుకు ఒక్కటి మాత్రమే తాగుతున్నానని చెప్పుకొస్తారు.. అయితే, రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే తాగుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక్క సిగరెట్ తాగడం ఒత్తిడి తగ్గించుకునే అలవాటుగా భావిస్తారు. కానీ, న్యూరాలజిస్టుల ప్రకారం.. రోజుకు ఒక్క సిగరెట్ కూడా పూర్తిగా సురక్షితం కాదు. తక్కువ స్థాయిలో ధూమపానం చేసినా గుండె, రక్తనాళాలు, మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించి స్ట్రోక్ ముప్పును పెంచవచ్చు. ఒక్క సిగరెట్ మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది? సిగరెట్ పొగలో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ శరీరంలోని హృదయ, రక్తనాళ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. నికోటిన్ కొంతకాలం రక్తపోటు, గుండె వేగాన్ని పెంచుతుంది. కార్బన్ మోనాక్సైడ్ రక్తం ఆక్సిజన్‌ను సమర్థంగా తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ధూమపానం రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీయడంతో పాటు వాటిలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. కాలక్రమంలో రక్తనాళాలు ఇరుకుగా మారి, రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో రక్తం గడ్డకట్టి మెదడుకు రక్తప్రవాహం అడ్డుపడే ప్రమాదం పెరుగుతుంది. నిద్రకు ముందు సిగరెట్ తాగితే ప్రమాదం తగ్గుతుందా? సిగరెట్ తాగే సమయం మారినంత మాత్రాన దాని హానికర ప్రభావాలు తగ్గవు. నిద్రకు ముందు తాగే ఒక్క సిగరెట్ ద్వారా కూడా నికోటిన్, ఇతర విషపూరిత పదార్థాలు శరీరంలోకి చేరుతాయి. ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం మరింత ఆందోళనకరంగా ఉంటుంది. ధూమపానం వల్ల వచ్చే స్ట్రోక్ ప్రమాదం కేవలం రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతున్నారనే దానిపైనే ఆధారపడదు. తక్కువ స్థాయిలో ధూమపానం చేసినా హృదయ, రక్తనాళ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలి?

మారుతున్న కాలంతో పాటు నేరాల స్వరూపం, స్వభావం పూర్తిగా మారిపోయాయని, అందుకు అనుగుణంగా పోలీసింగ్ విధానాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరం జరిగిన వెంటనే తొలి గంట (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని, ఆ సమయంలో కీలక ఆధారాలు చేజారిపోకుండా చూడటమే నేర నియంత్రణలో మొదటి విజయమని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం నాడు సచివాలయం నుంచి రాష్ట్ర డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వరకు సుమారు 1,650 మంది అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ నుంచి ఎస్హెచ్ఓ స్థాయి వరకు ఒకేసారి ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి దేశవ్యాప్తంగా మార్మోగాలని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, గౌరవంప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా శాంతిభద్రతలు అత్యంత కీలకమని చంద్రబాబు అన్నారు. "రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు విభాగం ఒక గర్వకారణం. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా మీరంతా వ్యవహరించాలి. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలి" అని ఆయన సూచించారు. 2019-24 మధ్య పాలకులు గంజాయి, కల్తీ మద్యాన్ని రాష్ట్రానికి పెను సమస్యగా మార్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని, వారి గౌరవం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 14,770 ప్రభుత్వ సీసీ కెమెరాలతో పాటు, ప్రైవేటు వ్యక్తుల

ఇప్పటివరకు మలేరియా నియంత్రణలో ప్రధానంగా దోమలను చంపడంపైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ ఆలోచనకు భిన్నమైన మార్గాన్ని పరీక్షించారు. దోమను చంపకుండా.. దాని శరీరంలోకి వెళ్లిన మలేరియా పరాన్నజీవిని అడ్డుకునే రసాయనాలతో దోమతెరలను తయారు చేసే అవకాశాన్ని పరిశీలించారు.పాత పద్ధతికి సవాల్మలేరియా నియంత్రణలో ఇన్సెక్టిసైడ్ ట్రీటెడ్ బెడ్ నెట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. దోమతెరను తాకిన దోమలను క్రిమిసంహారకాలు చంపడం లేదా నిర్వీర్యం చేయడం ద్వారా మనుషులకు మలేరియా సోకకుండా అడ్డుకుంటాయి. అయితే కాలక్రమేణా కొన్ని ప్రాంతాల్లో దోమలు ఈ క్రిమిసంహారకాలకు నిరోధకతను పెంచుకుంటున్నాయి. దీంతో పాత పద్ధతి ప్రభావం తగ్గుతోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కారణంగా 26.3 కోట్ల కేసులు, 5.97 లక్షల మరణాలు నమోదైనట్లు అధ్యయనం పేర్కొంది.పరాన్నజీవిని టార్గెట్ చేస్తే?ఇక్కడే కొత్త పరిశోధన ఆసక్తికరంగా మారింది. హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు అనుబంధ పరిశోధకుల నేతృత్వంలోని 2025 అధ్యయనంలో దోమను చంపడం కాకుండా.. దోమలో పెరిగే ‘ప్లాస్మోడియం ఫాల్సిపేరం’ పరాన్నజీవిని లక్ష్యంగా చేసుకున్నారు.మలేరియా సోకిన రక్తాన్ని పీల్చిన తర్వాత పరాన్నజీవి కొంతకాలం దోమ శరీరంలోనే అభివృద్ధి చెందుతుంది. చివరకు దోమ లాలాజల గ్రంథులకు చేరిన తర్వాత మరో మనిషిని కుట్టినప్పుడు మలేరియా వ్యాప్తి చెందుతుంది. ఈ మధ్యంతర దశనే పరిశోధకులు లక్ష్యంగా చేసుకున్నారు.81 సమ్మేళనాల పరీక్షపరిశోధకులు మలేరియాపై ఇప్పటికే తెలిసిన 81 సమ్మేళనాలను పరీక్షించారు. ఇవి 28 రకాల విధానాల్లో పరాన్నజీవిపై పనిచేసే రసాయనాలు. వీటిలో 22 సమ్మేళనాలు మలేరియా పరాన్నజీవి అభివృద్ధిని గణనీయంగా అడ్డుకున్నాయి.వాటిలో ELQ-453

భారత జాతీయ గీతం 'జన గణ మన' తరహాలోనే 'వందేమాతరం'కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు'కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: భారత జాతీయ గీతం 'జన గణ మన' తరహాలోనే 'వందేమాతరం'కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు'కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది (Vande Mataram Bill 2026). 1971 నాటి బిల్లులోని సెక్షన్ 3ను సవరించడం ద్వారా 'వందేమాతరం'ను కూడా చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. జాతీయ గీతాన్ని అడ్డుకోవడం లేదా దాని గౌరవాన్ని భంగపరిచేలా వ్యవహరించడంపై చట్టపరమైన చర్యలకు అవకాశం ఉంటుంది. అయితే అదే స్థాయిలో వందేమాతరానికి ఇప్పటివరకు ప్రత్యేక రక్షణ లేదు. తాజా సవరణ వందేమాతరానికి కూడా చట్ట పరమైన రక్షణ కల్పించింది (Vande Mataram legal protection). కొత్త చట్టం ప్రకారం 'వందేమాతరం' గానం జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా ఆ గానం చేస్తున్న సమూహానికి అంతరాయం కలిగించడం శిక్షార్హమైన నేరం (Vande Mataram Act). దీనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించే సవరణ బిల్లును పార్లమెంట్ గత నెలలో ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. రాష్ట్రపతి ముర్ము సంతకం చేయడంతో బిల్లు ఇప్పుడు అధికారిక చట్టంగా అమల్లోకి వచ్చింది. దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్.. అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు

స్వాతంత్ర్య సమరంలో కోట్ల మంది భారతీయుల్లో దేశభక్తి ఆవేశాన్ని నింపిన వందేమాతరం గేయానికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత చట్టపరమైన రక్షణ కల్పించింది. జాతీయ గీతం జనగణమనకు ఏ స్థాయిలో గౌరవం, చట్టపరమైన రక్షణ ఉందో.. ఇకపై జాతీయ గేయం వందేమాతరంకి కూడా అదే స్థాయి చట్టభద్రత లభించనుంది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణ) బిల్లు-2026కి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ కొత్త సవరణ చట్టంగా మారి అమల్లోకి వచ్చింది. ఇకపై వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా, అది పాడుతున్నప్పుడు అడ్డంకులు సృష్టించినా తీవ్రమైన శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.రాష్ట్రపతి ముద్రతో రూపుదిద్దుకున్న చట్టం1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టానికి కేంద్రం ఈ నూతన సవరణలు చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనల నడుమ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదం లభించడంతో వందేమాతరం గేయానికి ఇకపై సంపూర్ణ చట్టపరమైన రక్షణ లభించింది. గతం నుంచి జాతీయ గీతానికి అందుతున్న గౌరవాన్ని, నిబంధనలను ఇకపై వందేమాతరానికి కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రతిష్ఠను, జాతీయ చిహ్నాలను కాపాడుకోవడంలో ఇది మరో చారిత్రాత్మక ఘట్టమని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎర్రకోటపై మార్మోగనున్న వందేమాతరం! 150 ఏళ్ల పండగ వేళ దేశ చరిత్రలో తొలిసారిపార్లమెంట్ వేదికగా రాజకీయ కాకఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే క్రమంలో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. శశి థరూర్, కనిమొళి వంటి ప్రతిపక్ష నాయకులు సభలో, సామాజిక మాధ్యమాల్లో తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం సమాఖ్య వ్యవస్థకు, లౌకికత్వానికి విరుద్ధంగా ఉందంటూ డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. గతంలో రాజ్యాంగ పరిషత్ కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే అధికారికంగా గుర్తించిందని, కానీ ఇప్పుడు ప్రభుత్వం

హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు రేపు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్, ఆగస్టు 11: హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు రేపు(బుధవారం) భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. హెచ్ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ నియంత్రణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు చెప్పారు. ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగనుందని మంత్రి తెలిపారు. సుమారు 1500 మంది ర్యాలీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. హెచ్ఐవీ బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి తెలిపారు. హెచ్ఐవీ ఇతరులకు, ముఖ్యంగా పుట్టబోయే శిశువులకు సంక్రమించకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ నిర్మూలన ప్రచారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘బి పాజిటివ్ టు స్టాప్ హెచ్ఐవీ పాజిటివ్’ నినాదంతో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణను హెచ్ఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కాగా.. రేపు ఈ ర్యాలీలో మంత్రులు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించనున్నారు. కాలేజీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ర్యాలీలో పాల్గొననున్నారు. పేద పిల్లల కలలకు చిరునామాగా.. యంగ్ ఇండియా స్కూల్స్: సీఎం రేవంత్ రెడ్డి పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలి... ప్రధానికి వీహెచ్ లేఖ

ఎంతో ఇష్టపడి హీల్స్, శాండిల్స్, జూతీస్.. వంటివి కొంటుంటాం. అయితే వాటి స్ట్రాప్స్ వల్ల పాదాల చర్మం రాపిడికి గురై.. అక్కడి చర్మం ఎరుపెక్కడం, చిన్నపాటి గాయమవడం.. చాలామందికి అనుభవమే.... ఎంతో ఇష్టపడి హీల్స్, శాండిల్స్, జూతీస్.. వంటివి కొంటుంటాం. అయితే వాటి స్ట్రాప్స్ వల్ల పాదాల చర్మం రాపిడికి గురై.. అక్కడి చర్మం ఎరుపెక్కడం, చిన్నపాటి గాయమవడం.. చాలామందికి అనుభవమే. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి.. ఇవి ప్రయత్నించండి! ⚛ కొత్త చెప్పులు వేసుకునే ముందే పాదాలకు కొద్దిగా పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె.. వంటివి రాసుకుంటే.. వాటి స్ట్రాప్స్ వల్ల చర్మం రాపిడికి గురి కాదు.. తద్వారా గాయాలవకుండా జాగ్రత్తపడచ్చు. ⚛ ప్రత్యేకమైన యాంటీ షూ బైట్ జెల్స్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని చెప్పులు, షూస్ బిగుతుగా అనిపించిన చోట చర్మంపై అప్లై చేసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ⚛ పొడిగా ఉన్న సబ్బును షూ స్ట్రాప్స్, పట్టీల లోపలి వైపు రుద్దాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఒక మృదువైన పొరలాగా ఏర్పడుతుంది. తద్వారా షూ వేసుకున్న తర్వాత చర్మంపై రాపిడి జరగకుండా జాగ్రత్తపడచ్చు. ⚛ సిలికాన్ జెల్ ప్యాడ్స్, హీల్ గ్రిప్స్, యాంటీ-ఫ్రిక్షన్ స్ట్రిప్స్.. వంటివి మార్కెట్లో దొరుకుతున్నాయి. షూ బిగుతుగా ఉన్న చోట వీటిని అమర్చుకోవడం, ధరించడం చేస్తే చెప్పులు కరవకుండా, సౌకర్యంగా ఉండచ్చు. ⚛ కొన్న కొత్తలో చెప్పులు బిగుతుగా ఉండడం వల్లే ఇలా పాదాలపై గాయాలవుతుంటాయి. కాబట్టి అవి కాస్త వదులుగా అయ్యేంత వరకు.. ముందుగా మందంగా ఉన్న సాక్సులు ధరించి, ఆపై చెప్పులు వేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు. ⚛ కొన్ని చెప్పుల స్ట్రాప్స్, పట్టీలు బిగుతుగా, గరుకుగా ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిపై కొద్దిగా లెదర్ కండిషనర్, మాయిశ్చరైజర్.. వంటివి పూస్తే అవి త్వరగా మెత్తబడతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా

ఒక కప్పు కాఫీ.. ఆ క్యాన్సర్‌ను మాయం చేస్తోందని తెలుసా?ఒక కప్పు కాఫీ.. ఆ క్యాన్సర్‌ను మాయం చేస్తోందని తెలుసా? Samatha 10 August 2026 కాఫీ అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఉదయం లేచిందంటే చాలు కప్పు కాఫీ తాగుతుంటారు. కానీ కొంత మందికి కాఫీ తాగడం అస్సలే ఇష్టం ఉండదు. కానీ ప్రతి రోజూ స్త్రీలు ఒక కప్పు కాఫీ తాగడ ం వలన క్యాన్సర్ నుంచి బయటపడవచ్చునంట. కాఫీ క్యాన్సర్‌ను తగ్గించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమై సమాచారం. కాఫీ తాగడం వలన రొమ్ము క్యాన్సర్ తగ్గుతుందం ట. ఈ మధ్య కాలంలో చాలా మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 694,000 మంది మహిళలు రొమ్ముక్యాన్సర్‌తో మరణించడం జరుగుతుందంట. అయితే దీనిని నుంచి బయటపడాలి అంటే తీసుకునే ఆహారం, జీవనశైలి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ బి, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన దాని ప్రకారం.. యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు ప్రసిద్ధి చెందిన పాలీఫెనాల్ అనే సహజ మొక్కల సమ్మేళనం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా తగ్గిస్తుందంట. దీనిని తీసుకోవడం వలన చాలా మంది ఈ క్యాన్సర్ నుంచి బయటపడ్డారంట. అయితే ఈ సమ్మేళనం ఎక్కువగా కాఫీలో ఉంటుందంట. అంతే కాకుండా కోకూ, బెర్రీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, చిక్కుళ్ల వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాఫీలో పుష్కలంగా ఉంటుందంట. మరిన్ని వెబ్ స్టోరీస్ రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా? పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా? మీ ఇంటిలో నెమలి

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Dengue Symptoms: వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాధులు కూడా విపరీతంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా దోమల వల్ల మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఇటీవల నటి స్వర భాస్కర్ కూడా డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. వర్షాకాలంలో దోమల ప్రభావం పెరగడం వల్ల డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ క్రింది ఐదు లక్షణాలు కనిపిస్తే మీరు కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. గత ఐదేళ్లలో 968 కేసులు నమోదైనప్పటికీ, 2023లో రికార్డు స్థాయిలో 2,89,235 కేసులు నమోదై 485 మంది మరణించారు. డెంగీ లక్షణాలు ప్రధానంగా జ్వరంతో మొదలవుతాయి. ఆ తర్వాత కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్ళ నొప్పి, వాంతులు వంటివి కనిపిస్తాయి. దీనితో పాటు ముక్కు లేదా చిగుళ్ల నుండి రక్తం రావడం, కడుపు నొప్పి, ప్రతి 24 గంటల్లో మూడు కంటే ఎక్కువసార్లు వాంతులు అవ్వడం, మలంలో రక్తం పడటం లేదా రక్త వాంతులు కావడం కూడా ముఖ్యమైన లక్షణాలే. డెంగీ నివారణ మార్గాలు.. డెంగీ వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే నివారించుకోవడం మంచిది. ఇది నిల్వ ఉన్న నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి వారం చేయాల్సిన జాగ్రత్తలు.. ఇంటి బాల్కనీలలోని మొక్కల పాత్రలలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు వాటిని మార్చాలి. ఎయిర్ కూలర్ ట్యాంకులు, బకెట్లు, డ్రమ్ములలోని నీటిని ప్రతి వారం మార్చాలి. అలాగే