
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Dengue Symptoms: వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాధులు కూడా విపరీతంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా దోమల వల్ల మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఇటీవల నటి స్వర భాస్కర్ కూడా డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. వర్షాకాలంలో దోమల ప్రభావం పెరగడం వల్ల డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ క్రింది ఐదు లక్షణాలు కనిపిస్తే మీరు కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. గత ఐదేళ్లలో 968 కేసులు నమోదైనప్పటికీ, 2023లో రికార్డు స్థాయిలో 2,89,235 కేసులు నమోదై 485 మంది మరణించారు.
డెంగీ లక్షణాలు ప్రధానంగా జ్వరంతో మొదలవుతాయి. ఆ తర్వాత కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్ళ నొప్పి, వాంతులు వంటివి కనిపిస్తాయి. దీనితో పాటు ముక్కు లేదా చిగుళ్ల నుండి రక్తం రావడం, కడుపు నొప్పి, ప్రతి 24 గంటల్లో మూడు కంటే ఎక్కువసార్లు వాంతులు అవ్వడం, మలంలో రక్తం పడటం లేదా రక్త వాంతులు కావడం కూడా ముఖ్యమైన లక్షణాలే.
డెంగీ నివారణ మార్గాలు.. డెంగీ వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే నివారించుకోవడం మంచిది. ఇది నిల్వ ఉన్న నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి.
ప్రతి వారం చేయాల్సిన జాగ్రత్తలు.. ఇంటి బాల్కనీలలోని మొక్కల పాత్రలలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు వాటిని మార్చాలి. ఎయిర్ కూలర్ ట్యాంకులు, బకెట్లు, డ్రమ్ములలోని నీటిని ప్రతి వారం మార్చాలి. అలాగే వాటర్ బాటిల్స్, రెఫ్రిజిరేటర్ ట్రేలు, పాత టైర్లు, ఖాళీ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రూఫ్ గట్టర్లు, బాల్కనీ డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి డ్రమ్ములు, ట్యాంకులు, వాటర్ బాటిళ్లకు మూతలు గట్టిగా ఉండేలా చూసుకోండి. బకెట్లలో కూడా నీరు నిల్వ ఉండనివ్వకండి. డ్యామేజ్ అయిన మూతలు వెంటనే రిపేర్ చేయండి.
దోమలు రాకుండా ఉండటానికి ఇంటికి సరైన జాగ్రత్తలు తీసుకోండి. దోమల నుండి రక్షణ కోసం మస్కిటో రిపెల్లెంట్లు వాడండి. శరీరం అంతా కవర్ అయ్యేలా ఉండేలా చూసుకోండి. సాక్సులు, ఫుట్‌వేర్ వంటివి ఉపయోగించండి. కిటికీలకు మెష్ ఇన్స్టాల్ చేసుకోవడం, తలుపులకు గ్యాప్స్ లేకుండా చూడటం మంచిది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో ఉదయం సమయంలో నిద్రపోయే వారు తప్పనిసరిగా దోమతెరలు ఉపయోగించడం ద్వారా జాగ్రత్త వహించాలి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





