
Sedentary Lifestyle Health Risks And How Much Walking Can Help Reduce Them
రోజంతా ఆఫీసులో కుర్చీకే పరిమితమవుతున్నారా? రోజుకు 8 గంటలు కూర్చోవడం వల్ల శరీరంలో కదలిక తగ్గుతుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యల ముప్పు పెరగొచ్చు.
రోజంతా ఆఫీసులో కుర్చీకే పరిమితమవుతున్నారా? రోజుకు 8 గంటలు కూర్చోవడం వల్ల శరీరంలో కదలిక తగ్గుతుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యల ముప్పు పెరగొచ్చు. అయితే రోజువారీ జీవితంలో నడక, చిన్న చిన్న కదలికలను పెంచడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.8 గంటలు కూర్చుంటే ఏం జరుగుతుంది?ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లలోని కండరాలు పెద్దగా పనిచేయవు. దీంతో శరీరం తక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అంతేకాదు.. రక్తంలో చక్కెర నియంత్రణ, రక్త ప్రసరణ, కొవ్వు జీవక్రియ వంటి ప్రక్రియలపై కూడా ప్రభావం పడొచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే రోజుకు 8 గంటలు కూర్చోవడం వల్ల వెంటనే వ్యాధి వస్తుందని కాదు. కదలిక తక్కువగా ఉండే జీవనశైలి ఎక్కువకాలం కొనసాగినప్పుడు ఆరోగ్య ముప్పు పెరుగుతుంది.రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?8 గంటలు కూర్చోవడం వల్ల కలిగే అన్ని ప్రభావాలను పూర్తిగా తొలగించే నిర్దిష్ట అడుగుల సంఖ్య ఏదీ లేదు. అయితే రోజుకు 30-40 నిమిషాల మోస్తరు స్థాయి వ్యాయామం, ముఖ్యంగా వేగంగా నడవడం ఉపయోగకరంగా ఉంటుంది. వ్యక్తి వయసు, ఫిట్నెస్, ఆరోగ్య పరిస్థితిని బట్టి రోజుకు 7,000-10,000 అడుగులు మంచి లక్ష్యంగా ఉండొచ్చు.ఒక పరిశోధనలో రోజుకు 8,000 అడుగులు వేసేవారిలో మరణ ప్రమాదం 4,000 అడుగులు వేసేవారితో పోలిస్తే దాదాపు సగం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే కావడంతో 8,000 అడుగులు వేస్తే మరణ ప్రమాదం సరిగ్గా సగానికి తగ్గుతుందని చెప్పలేం.30-40 నిమిషాలు నడిస్తే






