
జబర్దస్త్ కమెడియన్ నరేష్ అసలు వయస్సు ఇదే..!
jabardasthnaresh You will be shocked to know the age of Jabardasth comedian Potti Naresh!జబర్దస్త్ కమెడియన్ పొట్టి నరేష్ వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

jabardasthnaresh You will be shocked to know the age of Jabardasth comedian Potti Naresh!జబర్దస్త్ కమెడియన్ పొట్టి నరేష్ వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

ఆత్మకూరు ఈటీవీ: ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడి పింఛను డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నాగులపాడు గ్రామానికి చెందిన నారయ్య అనే వృద్ధుడు ఒంటరిగా ఆత్మకూరులో నివసిస్తున్నాడు. మంగళవారం పింఛను డబ్బులు రావడంతో ఆ డబ్బులు, అతని వద్ద అదనంగా ఉన్న మరో రూ. వెయ్యి మొత్తం రూ.4,500 నగదును అతని వద్ద ఉంచుకుని నిద్రించాడు. ఇలా ఉండగా కొందరు యువకులు ఇతనిపై దాడికి పాల్పడి మొత్తం నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మకూరులో ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు చిల్లర దొంగతనాలకు, ఇటువంటి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఆకతాయిలా ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

బుచ్చిరెడ్డిపాలెం: పేదల సంక్షేమానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో మంగళవారం ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 62 లక్షల మందికి ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత రెండేళ్లలో పంచేడు పంచాయతీ పరిధిలో రూ.4.44 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్, 108 ఇళ్లకు సోలార్ కనెక్షన్లు కల్పించడంతో పాటు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, నుడా నిధులతో రూ.7.98 కోట్ల విలువైన సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వివరించారు. అర్హులైన పేదలకు సొంతింటి స్థలాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచేడు-బుచ్చిరెడ్డిపాలెం రహదారి నిర్మాణానికి రూ. కోటి మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభించి మిగిలిన సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సర్వేపల్లి(ఈటీవీ): కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ పోటాపోటీగా జరుగుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీలోని కామాక్షినగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి పార్లమెంటు తెదేపా అధ్యక్షురాలు పనబాక లక్ష్మితో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. తన సొంతూరుతో సమానమైన తోటపల్లి పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో తోటపల్లి పంచాయతీలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తోటపల్లి పంచాయతీలో ప్రతి నెలా రూ.7.50 లక్షల మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. మూడు జిల్లాల ప్రజల 30 ఏళ్ల కలను నెరవేరుస్తూ వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి నీటిని విడుదల చేశామని, త్వరలో పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందించబోతున్నామని తెలిపారు. వైకాపా పాలనలో నిర్వీర్యమైన నీటిపారుదల శాఖకు పూర్వవైభవం తీసుకొస్తున్నామన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పొదలకూరు: పొదలకూరు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో మూడు రోజులపాటు జాతర నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామ పెద్దలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు సంప్రదాయబద్ధంగా తొలి చద్ది కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. తొలి చద్ది కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

నెల్లూరు (నగర పాలక సంస్థ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ మొత్తాన్ని అందజేస్తున్నామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పి. నారాయణ తెలిపారు. మంగళవారం నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ ఉడ్‌హౌస్ సంఘంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి అందుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకటో తేదీ రాగానే రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు. గత ప్రభుత్వంలా వాయిదాల పద్ధతిలో కాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారుల పింఛన్లను ఒకేసారి రూ.4 వేలకు పెంచి అందిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల కోసం రూ.73,594.44 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలు, బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

నెల్లూరు (నగర పాలక సంస్థ): దేశవిదేశాల నుంచి ఆంధ్రులు వచ్చి ఓట్లు వేసి కూటమిని గెలిపించారు. కూటమి ప్రభుత్వ ఘనవిజయం ఒకచరిత్ర.. వైకాపా ఘోర పరాజయం కూడా చారిత్రక ఘట్టంమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైకాపా ఐదేళ్లు ప్రజావ్యతిరేక పాలన సాగించిందన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైకాపా కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ వికృత రాజకీయం చేస్తుందన్నారు. హిందు మతానికి ఘోర అన్యాయం జరిగిందని ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఆలయాల్లో రథాలు తగులపడినప్పుడు, విగ్రహాలు తలలు తెగగొట్టినప్పుడు, సింహాలు చోరీకి గురైనప్పుడు మీ నోళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏపీని అస్థిరం చేయాలని ఓ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలు, పెట్టుబడులు రాకూడదని ఫేక్ వీడియోలతో ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైకాపా క్రెడిట్ చోరీ చూస్తుంటే నాగార్జునసాగర్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టులు కట్టింది జగన్ అని చెప్పేట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మెగాస్టార్ చిరంజీవి అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్నారు. ఎదిగిన తర్వాత తన కష్టాన్ని, మూలాలను మరచిపోలేదు. అందుకే కష్టంలో ఎవరున్నా ఆదుకునేందుకు చిరంజీవి ముందుకొస్తుంటారు. బ్లడ్ బ్యాంక్ లాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. లెక్కకు మించి ఆర్థిక సహాయాలు చేశారు. గుప్తదానాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేడు ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. సినీ కళాకారులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి వస్తే చిరు వెంటనే స్పందిస్తారు. నటుడు శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంఘటనని గుర్తు చేసుకున్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఎవ్వరికీ తెలియని, మాకు మాత్రమే తెలిసిన గుప్తదానాలు, సహాయాలు ఎన్నో చేశారు. చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటారు. అన్ని విషయాలు ఆయన దృష్టివరకు వెళ్లడం కష్టం. అన్నింటినీ ఆయన పట్టించుకోలేరు. కానీ ఆయన దృష్టికి వస్తే మాత్రం వదిలిపెట్టారు. పొట్టి వీరయ్య, గుండు హనుమంత రావు లాంటి నటులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని చిరంజీవి మాచేత డబ్బులు ఇచ్చి పంపారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నట్లు చిరంజీవి గారికి సురేఖ గారి ద్వారా తెలిసింది. పొట్టి వీరయ్య, గుండు హనుమంత రావు కష్టాల్లో ఉన్నట్లు సురేఖ గారు టీవీలో చూసి చిరంజీవికి చెప్పారు. చిరంజీవి గారు నన్ను వెంటనే ఇంటికి పిలిచి.. శివాజీ రాజా ఇదిగో ఈ 2 లక్షలు పొట్టి వీరయ్యకి ఇవ్వు.. ఈ 2 లక్షలు గుండు హనుమంతరావుకు ఇవ్వు అని నాకు డబ్బులు ఇచ్చి వాళ్లకు అందేలా చేశారు. ఒక వేళ దృష్టికి వచ్చినా సైలెంట్ గా ఉండిపోవచ్చు. కానీ చిరంజీకి గారు అలా చేయరు. 24 క్రాఫ్ట్స్ లో ఎవరు కష్టాల్లో ఉన్నా గమనిస్తూనే ఉంటారు. సాయం చేస్తూనే ఉంటారు అని శివాజీ రాజా తెలిపారు

బాగా చదువుకుని కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న కొడుకు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. తిరుపతి జిల్లా డక్కిలి మండలానికి చెందిన హైమావతికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడిని బాగా చదివించాలని 16 ఏళ్ల కిందట నెల్లూరుకు వచ్చారు. హైమావతి భర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుమారుడు వెంకటాద్రి ఇంటర్ చదువుతున్నాడు. ఏడాది క్రితం వెంకటాద్రికి కామెర్లు సోకాయి. పేదరికంతో వైద్య పరీక్షలతోపాటు, సరైన చికిత్స చేయించలేక వ్యాధి తీవ్రత తెలియరాలేదు. ఇటీవల కడుపు ఉబ్బడంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వారి సూచనతో చెన్నైకి తీసుకెళ్లగా వైద్యులు కాలేయం మార్పిడి చేయాలని కనీసం రూ.60 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. లివర్ ఇవ్వడానికి అతని సోదరి ముందుకు వచ్చినా.. వైద్యానికి అవసరమైన డబ్బు ఆ కుటుంబం దగ్గర లేదు. దీంతో తన కుమారుడిని బతికించాలని హైమావతి వేడుకుంటున్నారు. ఈ వార్త చదివారా: 34 శాతం రిజర్వేషన్లు.. బీసీల జీవితాల్లో మార్పు తెచ్చే అతిపెద్ద నిర్ణయం: చంద్రబాబు

సర్వేపల్లి (ఈటీవీ): మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారుకు ఎదురుగా అకస్మాత్తుగా లారీ రావడంతో.. లారీని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పింది. రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టి కారు బోల్తా పడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులోని సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

నెల్లూరు (నగరపాలక సంస్థ): స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నాలెడ్జ్ పార్టనర్ అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (ఏఐఐఎల్ఎస్జీ) సహకారంతో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ బాటిల్స్ కలెక్షన్ బిన్స్‌ను ప్రారంభించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నగర పాలక సంస్థ కమిషనర్ వైవో నందన్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దినేష్ గురువారం ప్రారంభించారు. స్థానిక నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ ప్రాంతాల్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత నగర ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని, బిన్స్ ఉపయోగించాలని తెలిపారు. నగరంలో ఈ బిన్స్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు ఏఐఐఎల్ఎస్జీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి పొట్టి మామ గురించి తెలిసే ఉంటుంది. సినిమా పాటలకు కవర్ సాంగ్స్ చేస్తూ ఆయన యూట్యూబ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పాటలకు అచ్చుగుద్దినట్టు ఆయన వేసే స్టెప్పులు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. చిరుకి వీరాభిమాని అయిన పొట్టి మామ.. ఎప్పటికైనా తన ఫేవరేట్ హీరోని కలవాలని కోరుకున్నారు. ఇన్నాళ్లకు ఆయన కోరిక నెరవేరింది. ఆయన ఇప్పుడు చిరంజీవిని కలిశారు.మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో పొట్టి మామ నటించారు. మంగళవారం హైదరాబాద్ లో ఈ మూవీ మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ జరిగింది. దీనికి చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న పొట్టి మామ.. మెగాస్టార్ ని చూసి బోరున ఏడ్చేశారు. మోకాళ్ల మీద కూర్చొని తన అభిమాన నటుడుకి రెండు చేతులెత్తి నమష్కారం చేశారు. పొట్టి మామ కింద కూర్చోడానికి ప్రయత్నించగా.. చిరు ఆయన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, ఓదార్చారు. తన పక్కన కూర్చోబెట్టుకుని ఫొటో దిగారు. దీంతో పొట్టిమామ ఎమోషనల్ అయ్యారు

నెల్లూరు (నగరపాలక సంస్థ): నిరుద్యోగుల పేరిట వైకాపా నేతలు ఆడుతున్న రాజకీయ నాటకాలను, వారి దొంగ దీక్షలను డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ తీవ్రంగా ఎండగట్టారు. ఆదివారం నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీ ద్వారా అత్యంత పారదర్శకంగా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేసినందుకు ఓర్వలేక వైకాపా తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ఎంపిక విధానంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చినప్పటికీ పార్టీ దుష్ప్రచారం కొనసాగిస్తోందని ఆరోపించారు. వీఆర్ కాలేజీ సెంటర్ వద్ద చేపట్టిన నిరసనల్లో డీఎస్సీ అభ్యర్థుల పేరిట జెన్‌జీ విద్యార్థులను కూర్చోబెట్టి దొంగ దీక్షలు చేయించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పవిత్రమైన వేంకటేశ్వరస్వామి గోవిందనామాలను అపహాస్యం చేస్తూ పాటలు పాడి హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కష్టపడుతుంటే వైకాపా అడ్డుపడుతోందని ఆయన అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు