
జబర్దస్త్ కమెడియన్ నరేష్ అసలు వయస్సు ఇదే..!
jabardasthnaresh You will be shocked to know the age of Jabardasth comedian Potti Naresh!జబర్దస్త్ కమెడియన్ పొట్టి నరేష్ వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

jabardasthnaresh You will be shocked to know the age of Jabardasth comedian Potti Naresh!జబర్దస్త్ కమెడియన్ పొట్టి నరేష్ వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకాగా రానున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు కాకా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు కాకా సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలని ఎవరికీ ఉండదు చెప్పండి. కానీ ఓ కమెడియన్ మాత్రం మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేశారట. గతంలో రాజకీయాలతో సుమారు 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీనంబర్ 150. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చిరంజీవితో పాటు అలీ, బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ నటించారు. ముఖ్యంగా చిరంజీవి- అలీ కాంబినేషన్స్ లో వచ్చిన సీన్లన్నీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అయితే అలీ కంటే ముందు ఈ పాత్ర కోసం ఒక స్టార్ కమెడియన్ ను అడిగారట. కానీ ఆయన ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో తెలుసా.? గతంలో ఠాగూర్, స్టాలిన్, ఇంద్ర లాంటి సినిమాల్లో చిరంజీవితో కలిసి నటించిన సునీల్. ఇదే క్రమంలో చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ 150 కోసం కూడా సునీల్ ను ముందుగా సంప్రదించారట మేకర్స్. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే మహేష్ సినిమా సెట్లో ఎంత సరదాగా, జోవియల్‌గా ఉంటారో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. చాలా మంది సెలబ్రెటీలు ఆయన పనిచేసిన అనుభవాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు. అలాగే గతంలో పోడ్కాస్ట్లో పాల్గొన్న ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను, మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని అరుదైన, ఆహ్లాదకరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆగడు చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ బాబు చేసిన అల్లరి, తమపై వేసిన జోకులు గురించి ఆయన మాట్లాడారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. ప్రభాస్ శ్రీను తన ఇంటర్వ్యూలో మహేష్ బాబును చూస్తే చాలా కామ్‌గా, కంపోజ్డ్గా ఉంటారని చాలా మంది అనుకుంటారని, కానీ మేకింగ్ వీడియోలలో మాత్రం ఆయన చుట్టూ ఉన్నవాళ్లందరూ పడి పడి నవ్వుకుంటారని తెలిపారు. "ఆయన చాలా జోవియల్‌గా ఉంటారు. బయటికి వచ్చినప్పుడు తక్కువ కనిపిస్తారు, కనిపించేదే తక్కువ, దాంట్లో కూడా చురకలు పడతా ఉంటాయి" అని ప్రభాస్ శ్రీను అన్నారు. ఆగడు సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన వివరంగా వెల్లడించారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ బాంబేలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో షూటింగ్ జరుగుతోందని, ఆ వేడిమికి సెట్లో అందరూ అల్లాడిపోయారని శ్రీను పేర్కొన్నారు. బ్రహ్మానందం గారికి, ఇతర నటీనటులకు చెమటలు కారిపోయాయని, సినిమాటోగ్రాఫర్ గుహన్ గారు సెట్లో దాదాపు 25-26 డినో లైట్లు పెట్టారని, ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా మారిందని వివరించారు. ప్యాకప్ ఎప్పుడు అవుతుందా అని ఆర్టిస్టులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, స్కూల్ సెలవులు ఇస్తే పిల్లలు ఎంత

చాలా మంది సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఒకప్పుడు కలిసి చదువుకున్న వాళ్లే. ముఖ్యంగా సినీ, రాజకీయ సెలబ్రిటీలు చిన్నప్పట్నుంచి తెలిసినవాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు, కలిసి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు. తాజాగా కమెడియన్ రోలర్ రఘు సీఎం రేవంత్ నా క్లాస్ మెట్ అంటూ ఆసక్తికర విషయం తెలిపారు. సినిమాల్లో కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్న రఘు ఆ తర్వాత జబర్దస్త్ లో రోలర్ రఘుగా మంచి పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ తన సొంతూళ్లో బిజినెస్ చేసుకుంటున్నాడు. తాజాగా రోలర్ రఘు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను, సీఎం రేవంత్ రెడ్డి, జెట్టి కుసుమ కుమార్(కాంగ్రెస్ నేత) ముగ్గురం కాలేజ్ మేట్స్. ఒకే క్లాస్, ఒకే బెంచ్ కూడా మేము. 1989, 90 ఆ సమయంలో దోమలగూడ AV కాలేజీలో కలిసి చదువుకున్నాం. కుసుమ కుమార్ నాకు బావ అవుతాడు. అప్పుడే వాళ్లిద్దరూ పొలిటికల్ గా తిరిగేవాళ్లు. నేను మాత్రం వాళ్ళతో పొలిటికల్ గా తిరగలేదు అని తెలిపాడు

Brahmanandam Brother : తెలుగు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను నవ్వించారు. గత కొన్నాళ్లుగా ఆయన చాలా తక్కువగా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. తాజాగా బ్రహ్మానందం పై తన సొంత అన్న శ్రీవదన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బ్రహ్మానందం తల్లితండ్రులకు ఆరుగురు సంతానం. అందులో శ్రీవదన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ బ్రహ్మానందం తనను కనీసం పలకరించట్లేదని వాపోయారు. Also See : Thiruveer : భార్య, కొడుకుతో తిరుమలలో హీరో తిరువీర్.. ఫొటోలు.. బ్రహ్మానందం అన్నయ్య శ్రీవదన్ మాట్లాడుతూ.. మేము ఆరుగురు సంతానం. నలుగురు చనిపోయారు. ఉన్నది మేమిద్దరమే. ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది నేను ఒక్కడినే. నాకు కూతుళ్లు ఉన్నారు. వాళ్ళు నాకు ఫుడ్ పెడతారు. బ్రహ్మానందం ఎప్పుడైనా కనీసం పలకరిస్తాడేమో అని చూస్తున్నాను. ఆయనకు షూటింగ్ లేనప్పుడైనా రోజులో ఒక్క నిమిషం అయినా ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావు అని అడుగుతాడేమో అని ఆశగా చూస్తున్నాను. అలంటి గొప్పవాళ్ళు పలకరించినప్పుడు నాలాంటి చిన్నవాళ్లు సంతోషంగా ఉంటారు. నాకు అతని దగ్గరనుంచి డబ్బులేమీ వద్దు. కేవలం పలకరింపు చాలు. నాకు ఉన్నంతలో నేను బతుకుతున్నాను. ఇటీవల మా ఊరికి వచ్చాడంట. నేను వెళ్ళలేను. నేను చిన్నగా నడుస్తాను. కనీసం ఇటు వచ్చినప్పుడైనా పలకరించి వెళ్తే బాగుండేది అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో బ్రహ్మానందం తన సొంత అన్నని కనీసం పలకరించట్లేదు అంటూ శ్రీవదన్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. మరి ఇవి బ్రహ్మానందం వద్దకు వెళ్లి ఆయన ఇప్పటికైనా తన అన్నయ్యని పలకరిస్తారేమో చూడాలి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ లో కొట్టిన మాస్ హిట్లు మరే ఇతర హీరోకి సాధ్యం కాలేదు అంటే అతిశయోక్తి కాదు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది చిత్రాలు తారక్ కి క్రేజ్ తీసుకువచ్చాయి. ఆ తర్వాత వచ్చిన సింహాద్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క దెబ్బతో తారక్ టాలీవుడ్ టాప్ లీగ్ లోకి వెళ్లిపోయారు. టాలీవుడ్ అగ్ర హీరోలతో పోటీ పడే రేంజ్ సొంతం చేసుకున్నారు. సింహాద్రి రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సింహాద్రి తర్వాత తారక్ కి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. అప్పటి భారీ చిత్రాల దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో తారక్ నరసింహుడు అనే చిత్రంలో నటించారు. భారీ స్థాయిలో, కనీ వినీ ఎరుగని అంచనాలతో ఆ చిత్రం తెరకెక్కింది. బి గోపాల్ అంటే సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర లాంటి అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. దీనితో నరసింహుడు మూవీపై కూడా ఆ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. నరసింహుడు మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ గురించి కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తారక్ తో సన్నిహితంగా ఉండే వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. నరసింహుడు సినిమాపై ప్రతి ఒక్కరిలో భారీ అంచనాలు ఉండడంతో మేమంతా రిలీజ్ రోజు తారక్ ఇంట్లోనే ఉన్నాం. ఫస్ట్ షో రిపోర్ట్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం. నాకు ముందుగా ఖమ్మం నుంచి రిపోర్ట్ వచ్చింది. తారక్ గదిలోకి వెళ్ళా. ఈ విధంగా మన సినిమాకి బ్యాడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి అని చెప్పా. కాసేపటికి మరో ఆర్టిస్ట్ లోపలి వచ్చాడు. అతడి పేరు అనవసరం. అతడు వచ్చి.. బాబూ మన సినిమాకి థియేటర్లు బద్దలైపోతున్నాయ్.. మీరు విలన్ దగ్గరికి వెళ్లి పులిలాగా గాండ్రిస్తుంటే మామూలుగా లేదట అంటూ ఒక రేంజ్ లో చెప్పాడు. కానీ తారక్

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడుశాంతి స్వరూప్. బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడుశాంతి స్వరూప్ (Shanthi Swaroop). లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులకు నవ్వులు పంచే అతను, టీవీ స్క్రీన్‌పై ఎంత నవ్వుతూ కనిపిస్తారో.. అతను వ్యక్తిగత జీవితం వెనుక అంతటి కన్నీటి గాథ దాగి ఉంది. ఇటీవల ఒక పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న శాంతి స్వరూప్, తన జీవితంలో ఎదుర్కొన్న దుర్భరమైన పరిస్థితులు, ఎదురైన విమర్శల గురించి పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇండస్ట్రీకి రాకముందు తగిన నివాసం, కనీసం తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డానని తెలిపిన శాంతి స్వరూప్ గుడులు, చర్చిలలో ఇచ్చే ప్రసాదాలు తింటూ, షాపుల ముందున్న అరుగులపై నిద్రించిన రోజులు ఉన్నాయని గుర్తుచేసుకున్నాడు. 2007లో తండ్రి మరణించినప్పుడు కనీసం చివరి చూపు, అంత్యక్రియలు నిర్వహించడానికి ఐదుగురు అన్నదమ్ముల వద్ద రూ. 2000 కూడా లేవని, అప్పులు అడిగి ఆ కార్యక్రమాలు చేశానని కన్నీటిపర్యంతమయ్యాడు. కుటుంబ బాధ్యతలు, తల్లిని పోషించుకోవడం కోసమే తాను ఈ విగ్గు పెట్టుకుని, చీరలు కట్టుకుని లేడీ గెటప్స్ వేస్తున్నానని, దీనివల్ల ఎవరికీ హాని చేయడం లేదని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో సినీ పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై, కాస్టింగ్ కౌచ్‌పై కూడా అతను ఓపెన్‌గా మాట్లాడాడు. షార్ట్ టైమ్‌లోనే ఫేమ్, డబ్బులు సంపాదించాలని కొంతమంది ఆరాటపడుతున్నారని.. చాలామంది అమ్మాయిలు అవకాశం ఇస్తారా.. కావాలంటే పడుకుంటాం అని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడున్న అమ్మాయిలు చెడిపోయారు.. శని, ఆదివారాలు పార్కుల్లో చుస్తే పొదల్లో జంటలే కనిపిస్తాయి. అవకాశాల కోసం కాంప్రమైజ్ కావడం సరైన పద్ధతి కాదు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తనకు అనారోగ్యం వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లేవారు కూడా లేరని, స్వయంగా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లాల్సి వస్తోందని

ప్రముఖ హాస్యనటుడు చలాకి చంటి జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ లో తన కామెడీతో నవ్వులు పూయించాడు. ప్రస్తుతం తిగిరి టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు చంటి. గతంలో చంటి అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పుడు ఆయన కోలుకొని తిరిగి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యలు, పరిశ్రమలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుండెపోటుకు గురై కోలుకుంటున్న సమయంలో తాను అనుభవించిన వేదన, పరిశ్రమ నుండి లభించని మద్దతు గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గుండెపోటు వచ్చినప్పుడు పరిశ్రమ నుండి పలకరింపులు మాత్రమే లభించాయని, ఆర్థికంగా ఎవరూ సహాయం చేయలేదని చంటి పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ తోడు నిలబడరని, కేవలం మన దగ్గర డబ్బు ఉన్నంతవరకు, మనం బాగా ఉన్నంతవరకే అందరూ చుట్టూ ఉంటారని ఆయన స్పష్టం చేశారు. తన కెరీర్ ఆగిపోవడానికి గల కారణాలను వివరిస్తూ, తనపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని చలాకి చంటి ఆరోపించారు. “నాకు ఇగో ఉందని, నేను షూటింగ్‌కు వస్తే కొన్ని అడుగుతానని, నా గురించి బ్యాడ్ ప్రొపగండా చేశారు” అని ఆయన అన్నారు. దీని కారణంగా తాను కొన్ని సినిమా అవకాశాలు, ప్రాజెక్టులు కోల్పోయానని చెప్పారు. తన కెరీర్‌కు అడ్డుపడిన ప్రతి ఒక్కరూ నాశనం కావాలని, ఆ నాశనాన్ని తాను బ్రతికుండగానే చూడాలని ఆయన తీవ్రంగా శపించారు. ఈ శాపం తన కడుపు మంటతో వచ్చిందని ఆయన అన్నారు. “నేను బాగా లేనప్పుడు నువ్వు ఎందుకు బాగా ఉండాలి” అనేది తన పాలసీ అని చెప్పారు. సినిమా అవకాశాల కోసం కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎదురైన చేదు అనుభవాలను కూడా చంటి పంచుకున్నారు. ఒక దర్శకుడితో జరిగిన సంభాషణలో తాను ఆయన పేరుతో పిలవడం వల్ల పక్కన ఉన్న టీమ్ సభ్యులు హర్ట్ అయ్యారని, దాని కారణంగా ఆ పాత్రను

టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ గురించి పరిచయం అవసరం లేదు. బ్రహ్మానందం స్థాయిలో స్టార్ కమెడియన్ గా అలీ చాలా కాలం రాణించారు. చిన్ననాటి నుంచే అలీ నటుడిగా కెరీర్ ప్రారంభించారు. కమెడియన్ గా నటిస్తూనే హీరోగా కూడా అలీ సక్సెస్ లు సాధించడం విశేషం. ఇప్పుడు కాస్త హవా తగ్గింది కానీ గతంలో టాలీవుడ్ లో అలీ హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే కమెడియన్స్ లో ఒకరు. అలీకి రాజకీయాలతో కూడా టచ్ ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో అలీ కీలక నేతగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అలీకి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైసర్ గా పదవి కూడా లభించింది. కానీ తన కల మాత్రం నెరవేరలేదు. ఎంపీగానో, ఎమ్మెల్యే గానో పోటీ చేయాలనేది అలీ కల. అది ఇంత వరకు నెరవేరలేదు. తాజాగా ఇంటర్వ్యూలో అలీ రాజకీయాలపై నిరాశని, విరక్తిని వ్యక్తం చేశారు. రాకీయాల వల్ల తనకు ఒరిగింది ఏమీ లేదు అని అలీ అన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. కానీ అనుకోని పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్లి ఒక పార్టీ కండువా కప్పారు. అది 1999 లో అని అలీ తెలిపారు. అలీ చెప్పింది తెలుగుదేశం పార్టీ గురించే. అలీ రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగు దేశం పార్టీతోనే. ఆ పార్టీలో 20 ఏళ్ళ పాటు కొనసాగినట్లు అలీ తెలిపారు. నేను ఆ పార్టీ నుంచి ఏమీ ఆశించలేదు. కానీ నా కష్టాన్ని గుర్తించాలని మాత్రం కోరుకున్నా. అలా కాకుండా 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలకు మాత్రం నన్ను వాడుకుని, గొడ్డు చాకిరీ చేయించి వదిలేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది ? నన్ను కూరలో కరివేపాకు తీసినట్లు తీసి పక్కన పెట్టేశారు. నా సినిమాలు మానుకుని ఆ పార్టీ కోసం ప్రచారం చేశాను. 20 ఏళ్ళ పార్టీ అన్నీ భరిస్తూ ఆ పార్టీలోనే ఉన్నా. ఇక