
సర్వేపల్లి (ఈటీవీ): మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారుకు ఎదురుగా అకస్మాత్తుగా లారీ రావడంతో.. లారీని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పింది. రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టి కారు బోల్తా పడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులోని సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

.webp)


