
Debjani Modak : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన మొదటి కంటెస్టెంట్.. ‘దేబ్జానీ మోదక్’ గురించి తెలుసా..
మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. (Debjani Modak)
© 2026 nimisham.in

మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. (Debjani Modak)
హాలీవుడ్ ప్రముఖ కథానాయిక, 'వండర్ వుమెన్' ఫేమ్ గాల్ గాడోట్ నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ది రన్నర్' (The Runner) ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా భారతీయ ప్రేక్షకుల కోసం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల డబ్బింగ్ వర్షన్లలో అందుబాటులో ఉండటం విశేషం. గాల్ గాడోట్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులోకి తేవడంతో టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. లండన్‌లోని ఓ ప్రముఖ లాయర్ పాత్రలో గాల్ గాడోట్ నటించారు. ఒక రోజు ఉదయం జాగింగ్‌కు వెళ్లిన ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు బెదిరిస్తూ, అతడు చెప్పిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని షరతు విధిస్తాడు. సమయం తక్కువగా ఉండటంతో తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? కిడ్నాపర్ల ప్లాన్‌ను ఎలా తిప్పికొట్టింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉన్న స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. గాల్ గాడోట్ గతంలో 'వండర్ వుమెన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'రెడ్ నోటీస్', 'హార్ట్ ఆఫ్ స్టోన్' వంటి బిగ్ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఒకవైపు తల్లిగా భావోద్వేగాలను పండిస్తూనే, మరోవైపు రేసింగ్ యాక్షన్ సీన్స్‌లో తన నటనతో మెప్పించారు. డెమియన్ లూయిస్, ఆల్ఫ్రెడ్ ఎనోచ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మంచి

విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చే ఏకైక పేరు.. శ్రీకృష్ణదేవరాయలు. ఆ గొప్ప విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కృష్ణదేవరాయ రాజసాన్ని ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేమికులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అదే 'దేవరాయ' (Devaraaya) సినిమా టైటిల్ అనౌన్స్మెంట్. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోతో పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిచ్చా సుదీప్ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించబోతున్నారు. దేవరాయ పాత్రలో సుదీప్ రాయల్ లుక్, ఈ టైటిల్ గ్లింప్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించారని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ విజువల్ స్పెక్టకిల్‌ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండ్‌నెస్.. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ పై ఒక పీరియాడిక్ ఎపిక్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి గౌరహరి అందిస్తున్న సంగీతం వింటేనే ఒక రేంజ్లో గూస్బంప్స్ వస్తున్నాయి. కిచ్చా సుదీప్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ 'దేవరాయ' విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్స్ పై చూడటానికి 2027 డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు. Panjaa Re Release: 3 గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ రిలీజ్ బాక్సాఫీస్ షేక్!

కన్నడ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక భారీ తీపి కబురు అందడంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ప్రత్యేకమైన వేడుకను పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్రం దేవరాయ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. చిత్రబృందం ఈ సర్ప్రైజ్ ప్రకటించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక దృశ్యమాధ్యమాల్లో ఈ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో కిచ్చా సుదీప్ కనిపించిన తీరు మరియు ఆయన గెటప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. సుదీప్ తనదైన ముద్రతో దేవరాయ పాత్రలో అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, పోస్టర్లో చూపించిన ప్రతి అంశం కూడా కథలోని తీవ్రతను, సినిమాలో ఉండబోయే భారీ యాక్షన్ ఘట్టాలను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ విజువల్స్ సినీ విమర్శకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ విడుదలై క్షణాల్లోనే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సుదీప్‌కు సామాజిక వేదికల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితంగా దేవరాయ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. చిత్రబృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన తదుపరి తాజా వివరాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముందుముందు ఈ చిత్రం నుంచి మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయని చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది. దేవరాయ చిత్రాన్ని అత్యంత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీప్ కెరీర్లోనే ఇది ఒక ప్రత్యేకమైన మరియు విభిన్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచిపోతుందని నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కథనంలో ఉన్న కొత్తదనం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో దేవరాయ సినిమాకు సంబంధించిన టీజర్ మరియు

టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. ఐదు శతాబ్దాల క్రితం దక్షిణాది ప్రాంతాన్ని తిరుగులేని చక్రవర్తిగా ఏలిన శ్రీ కృష్ణ దేవరాయలు (SRI KRISHNA DEVARAAYA) కథ నేపథ్యంలో దేవరాయ (Devaraaya) సినిమా తెరకెక్కుతోంది. శాండిల్ వుడ్ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ (KicchaSudeep) టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ రోజు (బుధవారం) సుదీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా (People Media Factory) బ్యానర్‌పై సుప్రియాన్వీ పిక్చర్ స్టూడియో (Supriyanvi Picture Studio)తో కలిసి టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), కృతి ప్రసాద్ (Krithi Prasad ) నిర్మిస్తున్నారు. గౌర హరి (Gowra Hari) సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ఎదుటకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రటించారు

సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్'.. సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ ఈ వార్తకు సంబంధించిన

టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ నయా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమయ్యాయి. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు, అధునాతన కెమెరా సెన్సార్లు, శక్తివంతమైన ప్రాసెసర్లతో 10కి పైగా సరికొత్త స్మార్ట్ఫోన్లు ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ యాపిల్ ‘ఐఫోన్ 18 ప్రో’. ప్రతిసారి డిజైన్, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే యాపిల్ ఈసారి ఏఐ ఏకీకరణ, అత్యంత నాణ్యమైన పెరిస్కోప్ లెన్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యాపిల్ వార్షిక మెగా ఈవెంట్లో సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ ఫోన్లు అధికారికంగా ఆవిష్కృతం కానున్నాయి. ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కొన్ని మోడళ్లు కింది విధంగా ఉన్నాయి. కంపెనీలు ఇప్పటికే వీటి ఫీచర్లను ప్రకటించాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro): నెక్స్ట్-జెన్ A20 బయోనిక్ చిప్సెట్, అధునాతన ఏఐ ఫీచర్లతో రానుంది. వీవో T5 (Vivo T5): భారత మిడ్-రేంజ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని అత్యుత్తమ డిజైన్, కెమెరా సామర్థ్యంతో బడ్జెట్ విభాగంలో పోటీకి దిగుతోంది. పోకో F9 (Poco F9): గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, తక్కువ ధరలో గరిష్ట పనితీరును అందించనుంది. శామ్సంగ్, వన్‌ప్లస్, రియల్మీ, షావోమీ సంస్థలు కూడా తమ సరికొత్త వేరియంట్లను ఈ సెప్టెంబర్‌లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మొత్తానికి, సెప్టెంబర్ 2026 స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు అత్యంత కీలకమైన నెలగా మారనుంది. మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో రాబోయే ఈ సరికొత్త
రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఇతర స్పెషల్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ పాన్ ఇండియా మూవీ విడుదల తేదీని ప్రకటించింది.'మైసా' చిత్రాన్ని 2026 నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రష్మికకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ పంచుకున్నారు. ''స్వతహాగా ఆమె దృఢమైనది. స్వచ్ఛందంగా నిర్భయమైనది. అచంచలమైన స్ఫూర్తి కలది. మునుపెన్నడూ లేని విధంగా రష్మికతో కలిసి 'మైసా' ప్రపంచాన్ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి'' అని పేర్కొన్నారు.''మైసా.. ఆవేశం! వేదన! హృదయ వేదన! శోకం! దృఢ సంకల్పం! ధైర్యం! ఊహించని శక్తి - అదే మైసా'' అని రష్మిక పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమాని డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు దానికి వారం రోజుల ముందుగా 'మైసా' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాక్సాఫీస్ దగ్గర 'ఫౌజీ' సందడి మొదలయ్యేలోపే 'మైసా' మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది.గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘మైసా’ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ లుక్ లో కనిపించనున్నారు. తొలిసారిగా యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ఇది ఆమె కెరీర్ లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.రష్మిక మందన్న ప్రస్తుతం 'మైసా'తో పాటుగా 'రణబాలి' సినిమా చేస్తున్నారు. తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న 'రణబాలి' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ లో

భారతీయ సినిమా ఎనీ టైం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శక మార్క్ ఎప్పుడూ ప్రత్యేకమే. సెన్సిటివ్ ఎమోషన్స్, విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టడంలో దిట్ట. ప్రెజెంట్ యుగంలో రావాల్సిన కధాంశంతో కూడిన చిత్రాలని ఇరవై ఏళ్ళ క్రితమే తెరకెక్కించాడు. ప్రస్తుతం వర్సటైల్ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాబోయే 2027 పొంగల్ (సంక్రాంతి) కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన లీక్డ్ పిక్చర్స్, వేగంగా జరుగుతున్న షూటింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రేక్షకులకి ఈ మూవీ ఒక మరపురాని అనుభూతిని అందించబోతోందని స్పష్టమవుతోంది. విజయ్ సేతుపతి యాక్టింగ్, సాయిపల్లవి సహజ నటన, మణిరత్నం టేకింగ్, రెహమాన్ సంగీతం కలగలిసిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్ర బృందం కోల్‌కతాలోని ప్రసిద్ధ హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకోగా అక్కడ విజయ్ సేతుపతి, సాయిపల్లవిలపై చిత్రీకరించిన లీక్డ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2018లో వచ్చిన విజయ్ సేతుపతి క్లాసిక్ హిట్ '96' వైబ్స్‌ను ఈ లీక్డ్ పిక్చర్స్ గుర్తుచేస్తున్నాయంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కోల్‌కతా షెడ్యూల్ తర్వాత తదుపరి చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుపుకోవడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. సాధారణంగా భారీ సినిమాల చిత్రీకరణకి నెలల తరబడి సమయం పడుతుంది, కానీ మణిరత్నం మాత్రం 40 రోజుల్లోనే పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువల తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ విజువల్ మ్యాజిక్కు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబినేషన్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై ‘మైసా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కతున్న ఈ సినిమా గ్లిమ్స్ కు అప్పట్లో మంచి స్పందన లభించింది. ఇటీవల రష్మికకు గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం గాయం నుండి కోలుకున్న రష్మిక త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టనుంది. రష్మిక సెట్స్ లో జాయిన్ అయ్యాక జెట్ స్పీడ్ లో షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 27న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రష్మిక నటన, గ్లామర్ మరియు ఆమె పాత్రలోని వైవిధ్యం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే

సుమన్ , ఆమని ప్రధాన పాత్రల్లో, రాజేష్ భూపతి హీరోగా, స్వప్నరాజ్, అబిత హీరోయిన్లుగా ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ సినిమా ఆరంభమైంది. రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకత్వంలో బి.వి.సి ఫిల్మ్స్‌పై బీఎన్ ఆర్ చౌదరి నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుత్తా క్లాప్ ఇచ్చారు. ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు) హైదరాబాద్ : బేగంపేట కంట్రీక్లబ్‌లో అందాల తునకలు (ఫొటోలు) డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి రిసెప్షన్.. టాలీవుడ్ తారల సందడి (ఫొటోలు) ‘నాగబంధం’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు) ఏపీ : శిల్ప కళా వైభవం.. చెక్కుచెదరని కట్టడం ఎక్కడో తెలుసా? (ఫొటోలు) పవన్ కళ్యాణ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు..? జర్నలిస్ట్ KVR అరెస్ట్ పై కవిత రియాక్షన్ మూడేళ్ల ముందే ఎలక్షన్ అజెండా ఫిక్స్.. జగన్ మాటల్లో టన్నుల్లో కాన్ఫిడెన్స్ కనిపించింది జర్నలిస్ట్ KVR ని చూపించండి అంటే... సీఐ తన సొంత ప్రాపర్టీలా ఫీల్ అయిపోతున్నాడు

Toxic Ladies and Ladies:యశ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుకుంది. కేజీఎఫ్-2 తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రతి అప్డేట్పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల చిత్రబృందం విడుదల చేసిన 'లేడీస్ అండ్ లేడీస్' టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ టీజర్ పేరు చూసి సినిమాలోని మహిళా పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చాలా మంది భావించారు. కానీ టీజర్ విడుదలైన తర్వాత మాత్రం చాలా మంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్లు ఉన్నప్పటికీ వారి పాత్రలను చాలా తక్కువగా చూపించారని, ఎక్కువ భాగం యశ్‌పైనే దృష్టి పెట్టారని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్రముఖ నటీమణులు నటిస్తున్నారు. ఇంత పెద్ద తారాగణం ఉన్నా టీజర్లో వారికి పెద్దగా ప్రాధాన్యం కనిపించలేదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు మహిళా పాత్రలకు ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకుండా టీజర్ ముగించడాన్ని విమర్శిస్తున్నారు. మరికొందరు టీజర్‌ను సరదాగా ట్రోల్ చేస్తూ ఇది సినిమా టీజర్ కంటే ఒక ప్రకటనలా అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు టీజర్ చివర్లో వినిపించిన ఒక డైలాగ్పై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పదాల వాడకం అవసరమా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్ చూసి చాలామంది ఈ సినిమాకి సెన్సార్ అయిన తర్వాత కనీసం 30 నిమిషాల సినిమా అయినా మిగులుతుందా అని అడుగుతున్నారు. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మహిళా దర్శకురాలు అయినప్పటికీ మహిళా పాత్రలను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే టీజర్ మాత్రమే చూసి

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ (Project Hail Mary). ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హాలీవుడ్ హీరో ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) వేదికగా జులై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ వీడియోను విడుదల చేసింది. మార్చిలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంది. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం ఏకంగా రూ.6000 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇండియాలోనూ రికార్డులు సృష్టించింది. గతంలో విడుదలైన ‘ఇంటర్స్టెల్లార్’, ‘డ్యూన్ 2’ కంటే ఎక్కువ వసూళ్ల రాబట్టింది. 2025లో వచ్చిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ తర్వాత ఇండియన్ ప్రేక్షకులను ఈ స్థాయిలో మెప్పించిన అంతర్జాతీయ చిత్రం ఇదే కావడం విశేషం. గతం మర్చిపోయిన ఒక వ్యోమగామి అంతరిక్షంలో ఒంటరిగా మానవాళిని రక్షించేందుకు ఎన్ని సాహసాలు చేశాడనే కథతో ఈ చిత్రం రూపొందింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

టాలీవుడ్లోనే కాదు ఏ ఇండస్ట్రీలోని ప్రేక్షకులకైనా కొన్ని కాంబినేషన్లలో సినిమాలు వస్తే చూడాలని ఉంటుంది. టాలీవుడ్లో ప్రస్తుతం అలాంటి కాంబినేషన్స్‌లోనే సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అవి వస్తే ఫ్యాన్స్‌కి పండగే. టాలీవుడ్లోనే కాదు ఏ ఇండస్ట్రీలోని ప్రేక్షకులకైనా కొన్ని కాంబినేషన్లలో సినిమాలు వస్తే చూడాలని ఉంటుంది. టాలీవుడ్లో ప్రస్తుతం అలాంటి కాంబినేషన్స్‌లోనే సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అవి వస్తే ఫ్యాన్స్‌కి పండగే. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. ఒక భారీ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ గురించి ఊహించుకుంటే.. అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ (Akshay Kumar), స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ (Rajkumar Hirani). ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్లో గనుక ఒక ఫుల్ లెంగ్త్ సినిమా మెటీరియలైజ్ అయితే మాత్రం.. అది బాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడం ఖాయమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ విశ్లేషకులు ఒక క్రేజీ డిస్కషన్ లేవనెత్తారు. ఈ ఇద్దరి కాంబోపై ఇంత భారీ అంచనాలు ఉండటానికి కారణం వారికున్న అద్భుతమైన ‘కామెడీ టైమింగ్’ అనే చెప్పుకోవాలి. ఒకరు కెమెరా వెనుక ఉండి తన డైరెక్షన్‌తో, హృదయానికి హత్తుకునే హ్యూమర్‌తో మ్యాజిక్ చేయగలరు.. మరొకరు కెమెరా ముందుకు వస్తే తనదైన ఆన్-స్క్రీన్ కామెడీ టైమింగ్‌తో థియేటర్లను నవ్వుల సముద్రంలో ముంచెత్తగలరు. ఈ ఇద్దరు క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్స్ గనుక కలిస్తే, హిరాణీ మార్క్ సోషల్ మెసేజ్.. ఇంకా అక్షయ్ మార్క్ ఎనర్జీ కలిసి ఒక అద్భుతమైన విజువల్ వండర్ క్రియేట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కోసం ఒక అవేర్నెస్ వీడియో యాడ్ కోసం మాత్రమే వీరిద్దరూ కలిసి పనిచేశారు. కానీ, ఇప్పటివరకు ఒక పూర్తి స్థాయి సినిమా కోసం ఈ క్రేజీ కాంబో పని చేయలేదు. అక్షయ్ కుమార్ ప్రస్తుత లైనప్ చూస్తే.. ఎన్నో విభిన్న చిత్రాలు ఉన్నాయి, అలాగే హిరాణీ కూడా తన

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు కథానాయకుడు మహేష్ బాబు కలయికలో ఒక సరికొత్త చారిత్రాత్మక అద్భుత చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మక చలనచిత్రానికి వారణాసి అనే ఆసక్తికరమైన పేరును చిత్ర బృందం ఖరారు చేసినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ భారీ చలనచిత్రంలో అత్యంత అద్భుతమైన యుద్ధ సన్నివేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించడానికి దర్శకుడు రాజమౌళి అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చాటిచెప్పేలా ఉండబోతోందని పరిశ్రమ వర్గాలు నమ్ముతున్నాయి. ఈ భారీ పోరాట సన్నివేశాల చిత్రీకరణను జూలై 7 వ తేదీ నుండి పునఃప్రారంభించనున్నట్లు నమ్మదగిన పరిశ్రమ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ ప్రత్యేకమైన చిత్రీకరణ సమయం కోసం చిత్ర యూనిట్ వారణాసి పరిసర ప్రాంతాలలో అత్యంత భారీ వేదికలను మరియు సెట్లను నిర్మించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సినీ జీవితంలోనే ఇది అత్యంత ఖరీదైన మరియు అద్భుతమైన పోరాట ఘట్టంగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి. చిత్రీకరణ పునఃప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా గతంలో సంచలనం సృష్టించిన బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ చిత్రాల పోరాట సన్నివేశాలను మించిపోయేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. రామాయణ గాథలోని అత్యంత కీలకమైన వానర సైన్య ఘట్టాన్ని ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా చూపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త విజువల్ అనుభూతిని అందించేలా ఈ భారీ స్థాయి పోరాట ఎపిసోడ్ ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలోని ప్రతి యాక్షన్ సీన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రంపై అటు సినీ అభిమానుల్లో మరియు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజమౌళి మార్క్

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్’కు ఆస్ట్రేలియాలో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రైమ్ వీడియో (Amazon Prime Video) స్ట్రీమింగ్ మధ్యలో వాణిజ్య ప్రకటనలను ప్రవేశపెట్టడం, ఇవి రాకుండా ఉండాలంటే వినియోగదారుల నుంచి అదనపు రుసుము వసూలు చేయడమే ఇందుకు కారణం. దీనిని ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ (ACCC) సీరియస్‌గా తీసుకుంది. ఫెడరల్ కోర్టులో అమెజాన్‌పై దావా వేసింది. వార్షిక ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఒప్పందాల్లో అమెజాన్ ఏకపక్ష నిబంధనలను పొందుపరిచిందని.. వినియోగదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సేవలలో భారీ మార్పులు చేసిందని కన్జ్యూమర్ కమిషన్ ఆరోపించింది. ఈ మార్పుల వల్ల నవంబర్ 2023 నుంచి ఆగస్టు 2025 మధ్య కాలంలో ఆ దేశంలో దాదాపు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ప్రభావితం అయ్యారని తెలిపింది. ఆస్ట్రేలియాలో 2024 నుంచి ప్రైమ్ వీడియోలో ఎలాంటి సమాచారం లేకుండా అమెజాన్ ప్రకటనలను ప్రారంభించింది. దీంతో అప్పటికే ఏడాది మొత్తానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్న 8.5 లక్షల మంది చందాదారులు ప్రకటనలతో కూడిన వీడియోలను చూడాల్సి వచ్చింది. ఒకవేళ ప్రకటనలు లేకుండా వీడియోలను చూడాలనుకుంటే, సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా చెల్లించాలని నిబంధన విధించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి రూల్స్ పెట్టడం ముందస్తుగా పూర్తి రుసుము చెల్లించిన వినియోగదారులను అన్యాయం చేయడమేనని ఏసీసీసీ కోర్టుకు వివరించింది. ఈ వ్యవహారంపై వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కమిషన్ న్యాయస్థానాన్ని కోరింది. కాగా, ఈ కేసును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, దర్యాప్తునకు సహకరిస్తామని అమెజాన్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారి లెనిన్ తో అఖిల్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. అచ్చం హాలీవుడ్ హీరోల ఉండే హ్యాండ్సమ్ హీరో.. అయినా కూడా అఖిల్‌కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదు. చేసిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్స్ గా నిలిచాయి. వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్లేదు అనిపించినా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజాయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్ కూడా దారుణంగా డిజాస్టర్ కావడం అఖిల్ అభిమానులను నిరాశకు గురి చేసింది. మొదటి సినిమా మొదలుకొని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోలేదు. దాంతో లెనిన్ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్ లెనిన్ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యం విష్ణు సినిమాకు దర్శకత్వం వహించాడు మురళీ. ఇక లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా లెనిన్ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. లెనిన్ సినిమాలో అఖిల్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే అఖిల్ యాక్టింగ్ కూడా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో శివాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. లెనిన్ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు

KGF సిరీస్ తర్వాత యశ్ తర్వాతి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యశ్ ప్రస్తుతం 'టాక్సిక్' మూవీ చేస్తున్నాడు. ఇది చిత్రీకరణ పూర్తయ్యింది. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో సమ్మర్లో రావాల్సిన ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియడం లేదు. యుద్ధం కారణంగా వాయిదా వేసినట్టు చిత్ర వర్గాలు చెప్పాయి. కానీ రిలీజ్ పై క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు యశ్ `టాక్సిక్`ని పక్కన పెట్టాడు. కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఈ మూవీ చేస్తున్నాడని సమాచారం. ఇందులో `యానిమల్` ఫేమ్ డిమ్రి తృప్తి హీరోయిన్గా నటిస్తుందట. ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా కథ ఒక మాజీ సైనికుడి చుట్టూ తిరుగుతుందట. హీరో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సైన్యాన్ని వదిలేసి, తన సొంత ప్రాంతంలో పోలీస్ ఫోర్స్‌లో చేరతాడు. ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ 'ధర్మ ప్రొడక్షన్స్' నిర్మిస్తోంది. కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా ఉన్నారు. 'సప్త సాగరదాచె ఎల్లో' ఫేమ్ హేమంత్ ఎం. రావు, యశ్ కలిసి ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. నర్తన్ పవర్ఫుల్ డైరెక్షన్, యశ్ మ్యానరిజం కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. డైరెక్టర్‌గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం
టాలీవుడ్ చిత్రసీమ పురోగతిని, వ్యాపార విస్తరణను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సరికొత్త ఉత్తర్వులను (GO) అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నూతన సినీ విధానంపై పరిశ్రమ వర్గాలు విశేష సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) దీనిని ఒక ప్రగతిశీల నిర్ణయంగా అభివర్ణిస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. నేడు మన తెలుగు చిత్రాలు ఐమాక్స్, డాల్బీ సినిమా, హెచ్డీఆర్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాన్-ఇండియా రేంజ్లో రూపొందుతున్నాయి. కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రాల నిర్మాణ వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి సరైన నమూనా అవసరం. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ ద్వారా అర్హత గల సినిమాలకు టికెట్ ధరల పెంపునకు నిబంధనలతో కూడిన దరఖాస్తు విధానం సులభతరమైంది. అయితే, ఈ జీవో కేవలం టికెట్ ధరల పెంపుతోనే ముగిసిపోలేదు. ప్రతి థియేటర్ లోనూ (మల్టీప్లెక్స్ సహా) కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీకి రిజర్వ్ చేయాలని స్పష్టం చేసింది. దీనివల్ల అన్ని వర్గాల ప్రేక్షకులకూ సినిమాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, రోజుకు 5 ప్రదర్శనలకు (5 Shows) ప్రభుత్వం అనుమతించడం పెద్ద సినిమాలకు ఎంతో ఉపకరిస్తుంది. మొదటి కొద్ది రోజుల్లోనే భారీ డిమాండ్ నెరవేరి, ఆ తర్వాత థియేటర్లు ఖాళీ అవుతాయి. దీనివల్ల చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు తగినన్ని స్క్రీన్లు దక్కే అవకాశం మెరుగవుతుంది. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, నిరంతరం శ్రమించే సినీ కార్మికుల సంక్షేమానికి ఈ కొత్త విధానం పెద్దపీట వేస్తోంది. ఈ నిర్ణయాల వల్ల చిత్రసీమలో పెట్టుబడులు పెరగడమే కాకుండా వేలాది మంది కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుందని నిర్మాతల గిల్డ్ అభిప్రాయపడింది. ఈ కొత్త నిర్ణయం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ డివైన్ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’). బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మైండ్ బ్లాకింగ్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. అమౌంట్ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని టాక్. 2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుందర్.సి దర్శకత్వంలో డాక్టర్ ఐసరి కె. గణేష్ తమ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారిగా పవర్ఫుల్ అండ్ డివైన్ రోల్లో మెరవనుండగా, విలక్షణ నటి రెజీనా కాసాండ్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించనుంది. వీరితో పాటు దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితర సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ప్రాజెక్ట్ గ్లామర్ అండ్ కామెడీ డోస్ మరింత పెరిగింది. ప్రస్తుతం గ్రాండ్ సెట్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సౌత్ లాంగ్వేజెస్ సహా హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు

Irumudi Movie Review: రవితేజ విశ్వరూపం.. బొమ్మ దద్దరిల్లింది! Irumudi Movie Review: వరస ప్లాపులతో కాస్త వెనుకబడ్డ మాస్ మహారాజ్ రవితేజ, ఈసారి తన రొటీన్ మాస్ ఆరాటాన్ని పక్కన పెట్టి, ఒక బలమైన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసిన 'ఇరుముడి' సినిమా థియేటర్లలో ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికొస్తే.. సీలేరు ప్రాంతంలోని ఒక చిన్న పల్లెటూర్లో అరటిపళ్ల వ్యాపారం చేసుకునే త్రినాథ్ అనే సగటు కుటుంబ పెద్దగా రవితేజ కనిపిస్తారు. ఆయనకు భార్య కావేరి, కూతురు మణికంఠ అంటే ఎనలేని ప్రాణం. తన వ్యాపారం చేసుకుంటూనే ప్రతి సంవత్సరం నియమంగా అయ్యప్ప మాల వేసుకుంటాడు త్రినాథ్. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి అనుకోకుండా ఒక పెద్ద సమస్య వచ్చిపడుతుంది. ఊరిలో అనుమానాస్పదంగా కొందరు అమ్మాయిలు వరసగా చనిపోతుంటారు. ప్రతీ అమ్మాయిలో తన కూతురినే చూసుకునే హీరో, ఈ మరణాల వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఎదురైన నిజాలు ఏంటి? ఈ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రేచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు.రవితేజ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ నటనతో సినిమాను తన భుజాలపై మోశారు. చిన్న పాప నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర బాగానే చేశారు. దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథ ఆకట్టుకునే విధంగా ఉంది. ఓ ఊరులో జరిగే సాధారణ కథను తెర మీద అద్భుతంగా చూపించారు. ఇక జీవీ ప్రకాష్ తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి. దర్శకుడు అనుకున్న పాయింట్‌ను చాలా బలంగా చెప్పగలిగారు. ముఖ్యంగా ద్వితీయార్థాన్ని నడిపించిన తీరు బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కథ మూడ్‌కి తగ్గట్టుగా కుదిరాయి

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. త్రివిక్రమ్ గారి రచనలో ఉండే బలం, మీ రచనలో కనిపిస్తుంది అనే ప్రశంసలు రావడం ఎలా ఉంది? నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నింపినది మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు. అలాంటిది త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నాను. దానిని
హృదయాన్ని హత్తుకునే ‘మనసా వాచా’.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ సాంగ్ చూశారా! 'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ‘మనసా వాచా’ అనే పాట విడుదలైంది. ప్రేమ, విరహం, అనురాగం వంటి సున్నితమైన భావోద్వేగాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించే ఈ గీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటను కె.ఎస్. చిత్ర, ఎస్.పి. చరణ్ కలిసి ఆలపించారు. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. ఈ పాటను మీరూ చూసేయండి. ఈ వార్తకు సంబంధించిన

మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ & సన్స్’లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది మమిత. నివిన్ పౌలి హీరోగా, మమిత కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’(Bethlehem Kudumba Unit). ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏ.డి. దర్శకత్వం వహించారు. ఈ నెల 21 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఏ నేపథ్యంలో విడుదల చేసిన చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వేగవంతంగా సాగుతున్నాయి. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో నటనలో తన మార్క్ చూపించిన మమితా బైజు ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? మమితా బైజు మ్యాజిక్ మళ్లీ పనిచేస్తుందా? ఆమెకున్న క్రేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’కు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో నడుస్తోంది. ఇటీవల వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించిన మమితా బైజు.. ఈ సినిమాతో కూడా అదే జోరు కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు నివిన్ పౌలీ కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి

'ఇరుముడి' .. ఫీల్ తో కూడిన టైటిల్. డివోషనల్ టచ్ ఇచ్చే టైటిల్. ఈ టైటిల్ ను చూడగానే ఈ సినిమా అయ్యప్పస్వామి నేపథ్యంలో నడుస్తునని అనుకుంటారు. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ .. ఆ స్వామి మహిమలను చూపిస్తారని అనుకోవడం సహజం. ప్రధానమైన కథ అదే అయితే ఈ సినిమాను కార్తీక మాసంలో రిలీజ్ చేసేవారు. అయ్యప్ప మాలతో ముడిపడిన ఈ కథలో కనిపించని మరో కోణం ఉంది. అదే ఈ సినిమాను కొత్తగా ప్రేక్షకుల ముంగిట నిలపనుంది. ఆ కోణం ఏమిటనేదే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా పోస్టర్స్ ను గమనిస్తే, రవితేజ .. అతని కూతురుగా ఒక పాపను ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు. నిజమే ఈ కథ అంతా హీరో ప్లస్ అతని కూతురు చుట్టూనే తిరుగుతుంది. హీరో ఎవరినీ లెక్కచేయడు .. ఎవరి మాటను వినిపించుకోడు .. తన కూతురు మాట తప్ప. అలాంటి హీరోను అతని కూతురు ఎలా ప్రభావితం చేస్తుంది? అతను అయ్యప్పమాల వేసుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? ఆ మాల వేసుకున్న తరువాత అతని జీవితం ఎలా మారిపోతుంది? అనే కథతో ఈ సినిమాను రూపొందించారు. నిజానికి 2022లో వచ్చిన 'ధమాకా' తరువాత రవితేజకి పెద్ద హిట్ లేదు. ఏడెనిమిది సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించినస్థాయి విజయాలను అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే 'ఇరుముడి' సిద్ధమైంది. ప్రియా భవాని శంకర్ .. బేబీ నక్షత్ర .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, రేపు ( ఆగస్టు 21) విడుదల

ఇంటర్నెట్ డెస్క్: ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, మధుబాల కీలక పాత్రల్లో రూపొందిన మ్యూజికల్ డ్రామా సిరీస్ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై దీన్ని నిర్మించారు. ఇప్పుడీ సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (Amazon Prime Video) సెప్టెంబర్ 4 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఈ సిరీస్‌లో సుమన్, సిజ్జు మేనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, రూప లక్ష్మి తదితరులు నటించారు. కర్ణాటక సంగీతపు కథతో ‘జగమే సంగీతం’ రాబోతోంది. తన తాత శాస్త్రి గారి ప్రఖ్యాత సంగీత వారసత్వానికి వారసుడైన బాలు.. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని తరతరాల వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడనేది ఈ సిరీస్ కథాంశం. ఈ కథకు సంగీతమే ప్రాణం. పాప్ స్టార్డమ్ ప్రపంచం నుంచి వచ్చిన ఒక గాయనికి, బాలుకు మధ్య ఏర్పడే బంధం చివరకు ఏవైపు వెళ్లిందనే కథాంశంతో దీన్ని రూపొందించారు. ఈ సందర్భంగా సుస్మిత కొణిదెల ఈ సిరీస్‌లోని పాత్రల గురించి మాట్లాడుతూ.. ‘‘సంగీతం కేవలం వారి ప్రపంచంలో ఒక భాగం మాత్రమే కాకుండా ఆ కుటుంబం మాటల్లో చెప్పలేని ప్రేమ, సంఘర్షణ, ఆరాటం, వంటి భావాలను వ్యక్తపరిచే భావోద్వేగ భాషగా మారే కథను చెప్పడం మా ఉద్దేశం. ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటీనటులు ఇందులో నటించడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఫౌజి, స్పిరిట్, కల్కి-2.. ఇలా ఆయన లైనప్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా సోషల్ మీడియాలో, అలాగే కొన్ని బాలీవుడ్ సైట్స్ లో ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. అదేంటంటే.. 'ఆదిపురుష్' లాంటి డిజాస్టర్ తీసిన డైరెక్టర్ ఓం రౌత్‌తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపధ్యంలో ఓం రౌత్ ఒక కథ చెప్పారని, ఆ లైన్ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫైనల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారని బాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరిగింది. నిజానికి ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత ఓం రౌత్ ఏ రేంజ్లో ట్రోల్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ నుంచి నటీనటుల లుక్స్ వరకు ప్రతి విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటి దర్శకుడికి ప్రభాస్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి రిలీఫ్ ఇచ్చే బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ ప్రచారంపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ఓం రౌత్‌తో ప్రభాస్ కొత్త సినిమా అంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీమ్ స్పష్టం చేసింది. లెజండ్రీ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ రొమాంటిక్ మూవీ.. బాక్స్ బద్దలే

రవితేజ ‘ఇరుముడి’పై సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇరుముడి’ (Irumudi) చిత్రానికి చాలా అవార్డులు వస్తాయని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ (GV Prakash Kumar) అన్నారు. ఎన్నో ప్రేమకథా చిత్రాలకు వినసొంపైన మెలోడీలు ఇచ్చి మ్యూజిక్ ప్రియులకు చేరువైన ఆయన, సంగీతం అందించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు జీవీ ప్రకాశ్‌కుమార్. ‘నేను ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ‘ఇరుముడి’ చాలా ప్రత్యేకం. ఇదో ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ ఈ కథ చెప్పినప్పుడే ఇందులో పూర్తిగా లీనమైపోయాను. తెలుగు ప్రేక్షకులకు కొత్తదనమిచ్చే చిత్రమిది. ప్రతీ క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులోని సంగీతానికి ఓ సైకలాజికల్ అప్రోచ్ ఉంటుంది. ‘మల్లెపూల పల్లకి’ పాటను రీక్రియేట్ చేసి అందరి అంచనాలను అందుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ నటించిన వాటిలో నా ఫేవరెట్ ‘ఇరుముడి’ చిత్రం. కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది’ అని చెప్పారు

ఇంటర్నెట్ డెస్క్: కన్నడ స్టార్ యశ్ (Yash)హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’(Toxic Movie). ఆగస్టు 26న భారీ స్థాయిలో 40కు పైగా భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళంలో రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం ‘టాక్సిక్’ ఇంగ్లీష్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది (Toxic English Trailer ). ఇందులో యశ్ పవర్ఫుల్ పాత్రలో యాక్షన్‌తో అదరగొట్టారు. ఈ చిత్రంలో యశ్‌తో పాటు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు

అరుదైన జన్యులోప వ్యాధితో ఇబ్బంది పడుతున్న తన అభిమాని పట్ల సినీ హీరో రామ్ పోతినేని పెద్ద మనసు చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన శశిభవ్యత (18) నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. మతిస్థిమితం సరిగా లేకపోయినా రామ్ పేరు చెబితే ఆమె ఉత్సాహం చూపుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు రామ్ చిత్రాలు, వీడియోలు చూపించి, ఆమెకు అన్నం తినిపించి మందులు వేయిస్తున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న రామ్.. వెంటనే స్పందించి బాలికతో వీడియో కాల్లో మాట్లాడారు. శశిభవ్యతకు అవసరమైన మందులు ఇతర ఖర్చులు అన్నీ తానే భరిస్తానని తెలిపారు. ఈ వార్త చదివారా: ఈడీ విచారణకు హాజరైన నిధి అగర్వాల్

నూతన నటీనటులతో 'దొరికిందా' సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, నిర్మాతలు అశోక్ కుమార్, పద్మినీ నాగులపల్లి పాల్గొన్నారు. వి.టి. ఎంటర్ ప్రైజెస్ పతాకంపై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న సినిమా 'దొరికిందా'. తాజాగా మొదలైన ఈ సినిమా ప్రారంభోత్సవంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పాల్గొని క్లాప్ కొట్టారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్ స్విచ్చాన్ చేశారు. టీమ్‌కు సినిమా స్క్రిప్ట్ ను మరో నిర్మాత పద్మినీ నాగులపల్లి అందించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సడ్లపల్లి వెంకటేష్ రెడ్డి మాట్లాడుతూ, 'మా చిత్రానికి ఫ్లాప్ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించిన మా అమ్మ శ్యామలాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా చిత్రం 'దొరికిందా' మంచి కమర్షియల్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో పాత కొత్త నటీనటులు నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను' అని అన్నారు. ఈ చిత్రానికి జాక్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సడ్లపల్లి వెంకటేశ్ రెడ్డితో పాటు అశ్వద్థ రాయల్ దీనిని నిర్మిస్తున్నారు. తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా

యంగ్ హీరో సంగీత్ శోభన్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం నుండి కీలకమైన టైటిల్ గ్లింప్స్‌ను ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రకటనతో సంగీత్ శోభన్ ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహం నెలకొంది. కెరీర్లో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సంగీత్ శోభన్, ప్రస్తుతం మారుతి అనే ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ మరియు యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ను అందించేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించబోతోంది. ఈ చిత్రానికి 'కుమారి 21ఎఫ్', '18 పేజెస్' వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని మరియు వల్లభనేని గిరిబాబు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్ ఎంపిక చేసుకునే కథలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఈ కొత్త కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేస్తుందని యూనిట్ నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. టైటిల్ గ్లింప్స్ విడుదల తర్వాత సినిమా ప్రమోషన్లను మరింత వేగవంతం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మొత్తంగా సంగీత్ శోభన్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 23న రాబోయే టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వనుంది. ఒక సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

సన్నీ డియోల్, రాజ్ కుమార్ సంతోషీ కాంబినేషన్ లో వచ్చిన 'బట్వారా 1947' చిత్రం కమర్షయల్ సక్సెస్ ను సాధించలేక పోయింది. అయినా ఈ యేడాది అక్టోబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాను ప్రకటించబోతున్నారట. సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్, ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ తాజా చిత్రం 'బట్వారా 1947' స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఆమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించిన 'బట్వారా 1947' కథ బాగున్నా... దానిని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని చాలామంది వ్యాఖ్యానించారు. పైగా ఇటీవల వచ్చిన 'మై వాసప్ ఆవూంగా' కథాంశం కూడా దాదాపు ఇలాంటిదే కావడంతో కొత్తదానాన్ని మిస్ అయి భావనను వ్యక్తం చేశారు. దేశ విభజన నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలూ తెరకెక్కాయి. 'మై వాపస్ ఆవూంగా'లో సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా కీలక పాత్ర పోషిస్తే, 'బట్వారా 1947'లో సీనియర్ నటీమణి షబానా ఆజ్మీ నటించారు. వీరిద్దరి పాత్రలకు మంచి పేరొచ్చింది. కానీ ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఘన విజయాన్ని మాత్రం సాధించలేకపోయాయి. గతంలో సన్నీ డియోల్ హీరోగా రాజ్ కుమార్ సంతోషీ తెరకెక్కించిన 'ఘాయల్, దామినీ, ఘాతక్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే మూడు దశాబ్దాల కాలం నాటి ఆ మ్యాజిక్ ను తాజా చిత్రం రీ క్రియేట్ చేయలేకపోయింది. 'బట్వారా' సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాకపోయినా తగ్గేదే లే అంటున్నారు సన్నీ డియోల్ అండ్ రాజ్ కుమార్ సంతోషీ. ఈ యేడాది అక్టోబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ కొత్త సినిమాను ప్రకటించే ఆస్కారం ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమ కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి యాక్షన్ మూవీని ఈ సారి వీరు చేయబోతున్నారట. మరి ఈ

చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం షూటింగ్ 40 రోజులు పూర్తైంది. ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ కాగా, ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. చిరంజీవి సపోర్ట్‌తో టీమ్ అంతా ఒకే స్పీడ్‌తో పని చేస్తుండడంతో 40 రోజుల షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ చెప్పారు. ఇప్పటివరకూ ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ అయిందని, చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ఇటీవల చిత్రీకరించిన ఇంటర్వెల్ ఫైట్ సినిమాలో ప్రధాన హైలైట్‌గా ఉంటుందని చిత్ర దర్శకుడు బాబీ చెప్పారు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనస్వర రాజన్ (Anaswara Rajan), నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. భాను-నందు మాటలు రాస్తున్నారు

నటుడు యష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic – A Fairy Tale for Grown-ups). ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విడుదల తేదీ సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ‘టాక్సిక్’ ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్ లాబీలతో పాటు పలు నగరాల్లోని మెట్రో రైళ్లపై సినిమా పోస్టర్లు, ప్రచార చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తున్నారు

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ NBK112. ఇప్పటికే పూజ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కారణాల వల్ల నిలిచిపోయిందంటూ ప్రచారం జరుగుతుండటంతో నందమూరి అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఉన్న రూమర్లపై చిత్ర యూనిట్ “Team NBKKoratalaSiva” పేరుతో క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించిన ప్రచారాలను, అసత్య వార్తలను ఎవరూ నమ్మవద్దు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుంది, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న ‘NBK111’ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే ఈ కొరటాల శివ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రాంభం అవుతుందని’స్పష్టం చేసారు. బాలయ్య ఇటీవల గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో గాయపడడంతో మొకాలుకి సర్జరీ చేయడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్స్ లో జాయిన్ అయ్యాక ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాడు కొరటాల

నటుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో దుమ్మురేపుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సూర్య, మమితా బైజు నటనకు మంచి మార్కులు పడ్డాయి. వారి కెమిస్ట్రీనే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 'కరుప్పు' తర్వాత సూర్యకు ఇది మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' సోమవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9.50 కోట్లు వసూలు చేసింది. ఇందులో కేవలం భారతదేశంలోనే రూ.7.50 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్లో రూ.2 కోట్ల కలెక్షన్లు సాధించింది. నిన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.3.85 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత తమిళనాడులో రూ.3.65 కోట్లు వసూలు చేసింది. అయితే, షోల పరంగా చూస్తే తెలుగులో 1924 షోలు, తమిళంలో 3038 షోలు ప్రదర్శించారు. ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే విశేష ఆదరణ పొందుతోంది

నాగచైతన్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మైలురాయి చిత్రం కోసం యువ దర్శకుడు వెంకీ అట్లూరిని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. గతంలో వెంకీ అట్లూరి పలు కథలను నాగచైతన్యకు వినిపించినట్లు ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ మరియు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి వరుస విజయాలతో వెంకీ అట్లూరి ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇతర భాషల హీరోలతో సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, ఇప్పుడు ఒక స్వచ్ఛమైన తెలుగు కథతో ముందుకు రానున్నారు. ఇందుకోసం నాగచైతన్య సరైన ఎంపిక అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా కథాంశం వైవిధ్యంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నట్లు సమాచారం. ఇటీవల అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాగవంశీ, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య 25వ సినిమా బాధ్యతలను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. అన్ని అంశాలు కుదిరిన తర్వాత త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కథ, కథనం మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా కొంత సమయం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం వేయించిన ప్రత్యేకమైన భారీ సెట్ వర్క్, దాని డీటైలింగ్ చూసి యూనిట్ సభ్యులంతా ఫిదా అయ్యారట. డ్రాగన్ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రశాంత్ నీల్ అంటేనే మనకు గుర్తొచ్చేది భారీ సెట్లు, హై-వోల్టేజ్ యాక్షన్, అలాగే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించిన ఒక ప్రత్యేకమైన భారీ సెట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలోని కీలకమైన సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ మైండ్ బ్లోయింగ్ ప్రాపర్టీస్, యూరోపియన్ స్టైల్ డిజైన్స్‌తో ఒక వింటేజ్ అట్మాస్ఫియర్‌ను క్రియేట్ చేశారు. షూటింగ్ సమయంలో సెట్లోకి అడుగుపెట్టిన నటీనటులు, టెక్నీషియన్లు ఆ ప్రొడక్షన్ డీటైలింగ్, ఆర్ట్ వర్క్ చూసి ఫిదా అయిపోయారట. ప్రశాంత్ నీల్ విజన్‌ను నిజం చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో పర్ఫెక్ట్గా రీ-క్రియేట్ చేసింది. సాధారణంగా కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలలో డార్క్ మోనోక్రోమటిక్ షేడ్స్‌ను ఎక్కువగా వాడిన ప్రశాంత్ నీల్, ఈసారి డ్రాగన్ కోసం పూర్తి డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంటున్నారు. ఈ భారీ సెట్లోనే ఎన్టీఆర్ పై తీసే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో రచ్చ లేపుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ రా అండ్ రగ్గడ్ లుక్, దానికి తోడు ఈ విజువల్ గ్రాండియర్ వెండితెరపై ఒక విజువల్ వండర్ కాబోతోంది. కాగా, ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. ఈలోపు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ లేని

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటిపోయాయి. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' సాంగ్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుని, ఇంటర్నెట్ను షేక్ చేసింది. ప్రతీ చోటా ఈ సాంగ్ మారుమోగిపోతోంది. రాబోయే వారంలో 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి మరొక స్పెషల్ తెలంగాణ ఫోక్ సాంగ్ అప్డేట్ రాబోతోంది. ఈ పాట ఊర మాస్ బీట్స్‌తో, తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించేలా, వింటేనే పూనకాలు వచ్చే విధంగా రూపుదిద్దుకుందట. ఈ పాట ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టే పొటెన్షియల్ ఉందని అంటున్నారు. తెలంగాణ ఫోక్ డ్రమ్స్, పక్కా లోకల్ లిరిక్స్, నాని ఎనర్జెటిక్ మాస్ డాన్స్ మూవ్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయట. 'దసరా' సినిమాలో 'చమ్కీల అంగీలేసి' పాట ఎలాగైతే అన్ని చోట్లా మారుమోగిపోయిందో.. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త ఫోక్ సాంగ్ కూడా అదే రేంజ్లో సంచలనం సృష్టిస్తుందని చెబుతున్నారట. ఈ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చే వారంలోనే ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్‌తో రాబోతోందని టాక్. నైజాంలో విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్స్ తుఫాన్

ప్రస్తుతం ఏఐ కాలం నడుస్తోంది. ఈ యుగంలో ఏది నిజమో, ఏది ఫేకో తెలుసుకోవడానికి చాలా తంటాలు పడాల్సి వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ పోస్టర్ చూస్తే.. భవిష్యత్‌ని తలుచుకుంటేనే భయమేస్తోంది. ప్రస్తుతం ఏఐ (AI) కాలం నడుస్తోంది. ఈ యుగంలో ఏది నిజమో, ఏది ఫేకో తెలుసుకోవడానికి చాలా తంటాలు పడాల్సి వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ పోస్టర్ చూస్తే.. భవిష్యత్‌ని తలుచుకుంటేనే భయమేస్తోంది. అవును, ఈ పోస్టర్లో మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఊర మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. గోపీచంద్ చేతిలో కత్తి పట్టుకుని, ఛైర్లో రాజసం ఉట్టిపడేలా కూర్చుని స్మోక్ చేస్తుంటే.. ఆయన వెనుకే రష్మిక మందన్నా గన్ పట్టుకుని.. ‘ఎవడొస్తాడో రండిరా’ అన్నట్లుగా ఉంది. నిజంగా ఈ పోస్టర్ చూసిన వారంతా.. ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతున్నారు. ఎందుకంటే.. వీళ్లద్దరూ కలిసి సినిమా ఎప్పుడు చేశారు. అసలు ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు కదా. డైరెక్ట్‌గా ఈ పోస్టరేంటి? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం రష్మిక రేంజ్ అలా ఉంది. పెళ్లి తర్వాత, చాలా సెలక్టివ్‌గా ఆమె సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌పై, పాన్ ఇండియా సినిమాలపైనే ఆమె చూపు ఉంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల లిస్ట్‌లో ఎక్కడా గోపీచంద్ పేరు రాలేదు. మరి ఇదెలా అంటే.. అదే ఏఐ మ్యాజిక్. అందరూ నిజం అనుకునే రేంజ్లో.. ఈ పోస్టర్ని క్రియేట్ చేసిన వాళ్లకి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఈ పోస్టర్ చూసిన వాళ్లంతా.. దీనికి ఒరిజినల్ స్టిల్ ఏమై ఉంటుందా? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అలా సెర్చింగ్‌లో ఇది లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj), వామికా గబ్బి (Wamiqa Gabbi) ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ‘డీసీ’ (DC) మూవీ స్టిల్ నుంచి క్రియేట్ చేసినట్లుగా కొందరు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాకా’. రీసెంట్‌గానే ఈ మూవీ టైటిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రష్మిక ఓ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాకా’ (Raaka). రీసెంట్‌గానే ఈ మూవీ టైటిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి, ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు. తాజాగా ఈ మూవీలో నటిస్తోన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పాత్రకు సంబంధించి నిర్మాత లగడపాటి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు.. మరోసారి ‘రాకా’ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. పాన్-ఇండియా సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రమైన ఇందులో రష్మిక నెగిటివ్ రోల్.. అందులోనూ క్రూరమైన రక్తపిశాచి పాత్ర చేస్తున్నట్లుగా మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లగడపాటి శ్రీధర్ (Lagadapati Sridhar) ఏం చెప్పారంటే.. ‘‘అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాలో రష్మిక రోల్ గురించి నాకు పూర్తి అవగాహన లేదు కానీ, ఒకవేళ ఆమె ఇలాంటి డార్క్ షేడ్ ఉన్న విలన్ పాత్రలో నటిస్తుంటే మాత్రం.. అది ఆమె కెరీర్‌కే ఒక సరికొత్త ఛాలెంజ్ అవుతుంది. ప్రేక్షకులు రష్మికను ఎప్పుడూ గ్లామరస్, ఎమోషనల్ పాత్రల్లోనే ఎక్కువగా ఇష్టపడ్డారు. ఒకవేళ ఇప్పుడు వినిపిస్తోన్న వార్తలు నిజమైతే, నటిగా ఆమె ఇమేజ్ను ఈ రోల్ పూర్తిగా మార్చేస్తుందని మాత్రం చెప్పగలను. చూడాలి ఆమె పాత్రను అట్లీ ఎలా డిజైన్ చేశారో...’’ అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. డైరెక్టర్ అట్లీ ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్‌ను ఎవరూ ఊహించని ట్విస్టులతో, చాలా డార్క్ అండ్ లేయర్డ్గా డిజైన్ చేశారనేలా వినిపిస్తోన్న వార్తలపై లగడపాటి అలా చెప్పి ఉంటారు

టాలీవుడ్ యువ నటి నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో కొత్త సినిమా ఆగస్టు 17న ఘనంగా ప్రారంభమైంది. వరహ ఫిలిమ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను లేడీ ఓరియెంటెడ్ మైథాలజీ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. చిత్రీకరణకు సంబంధించి తొలి పూజా కార్యక్రమాలు నేడు చిత్రబృందం సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి. పౌరాణిక నేపథ్యం ఉన్న కథ కావడంతో ప్రేక్షకుల్లో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని 'తంత్ర' ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్నారు. వరహ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెం 1గా వస్తున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో వైవిధ్యమైన పాత్రలు చేసిన నిధి, ఇందులో పూర్తిగా కొత్తగా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ నటి రూపాన్ని పవర్ ఫుల్ అవతార్‌లో చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. పి. అశోక్ మరియు పి. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మాత్ సర్నా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. దీంతో షూటింగ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా ముగిసింది. నిధి అగర్వాల్ ఇందులో అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ స్పష్టం చేశారు. మైథాలజీ మరియు థ్రిల్లర్ అంశాల కలయికతో ఈ సినిమా రాబోతోంది. ఇదిలా ఉండగా, నిధి అగర్వాల్ తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఇంటెన్స్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. వైవిధ్యమైన కంటెంట్‌కు ఆదరణ పెరుగుతున్న వేళ, ఈ ప్రయోగం కచ్చితంగా ఆకట్టుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి టైటిల్ మరియు పూర్తిస్థాయి తారాగణం వివరాలను గోప్యంగా ఉంచారు. రాబోయే రోజుల్లో ఒక్కో అప్డేట్తో ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచాలని

రాయల్ ఎన్ఫీల్డ్ ఫేమస్ కేఫ్ రేసర్ బైక్ కాంటినెంటల్ జీటీ 650 ఇప్పుడు కొన్ని మార్పులతో మార్కెట్లోకి వచ్చింది. బైక్ లుక్‌తో పాటు, వాడుకలోనూ కొన్ని కొత్త ఫీచర్లను జోడించారు. ఈ కొత్త కాంటినెంటల్ జీటీ 650 లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, యూఎస్బీ టైప్-సి చార్జింగ్ పోర్ట్ వంటివి కొత్తగా చేర్చిన ముఖ్యమైన ఫీచర్లు. అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చుట్టూ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడంతో బైక్ లుక్ మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా మారింది. రాకర్ రెడ్ కలర్ మోడల్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. దీని ఇంజిన్, ఎగ్జాస్ట్ పైపులకు పూర్తిగా బ్లాక్ కలర్ కోటింగ్ ఇచ్చారు. దీనికి తోడు అలాయ్ వీల్స్ కూడా నలుపు రంగులోనే ఉన్నాయి. దీంతో ఈ మోడల్ మొత్తం బ్లాక్-అవుట్ లుక్‌తో చాలా స్పోర్టీగా కనిపిస్తోంది. అపెక్స్ గ్రే మోడల్లో కూడా దాదాపు ఇలాంటి బ్లాక్-అవుట్ లుక్ ఇప్పటికే అందుబాటులో ఉంది. మరోవైపు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, మిస్టర్ క్లీన్ కలర్ మోడళ్లలో మాత్రం పాత పాలిష్డ్ ఇంజిన్ లుక్, స్పోక్ వీల్స్‌నే కొనసాగిస్తున్నారు. కొత్త కాంటినెంటల్ జీటీ 650 ఇంజిన్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. పాత మోడల్లో ఉన్న 648 సిసి, ట్విన్-సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్నే ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్ 7,150 rpm వద్ద 47 హార్స్పవర్, 5,250 rpm వద్ద 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్, హారిస్ పెర్ఫార్మెన్స్ కలిసి డెవలప్ చేసిన స్టీల్ ఫ్రేమ్‌నే కొనసాగించారు. కాబట్టి కొత్త మోడల్లో ప్రధానంగా లుక్, ఫీచర్లలోనే మార్పులు జరిగాయి. సస్పెన్షన్ విషయానికొస్తే ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. కాంటినెంటల్ జీటీ 650 ప్రత్యేకమైన ఫ్యూయల్ ట్యాంక్, లో-స్లంగ్ రైడింగ్ పొజిషన్, స్పోర్టీ కేఫ్ రేసర్ డిజైన్ వంటివి యథాతథంగా

టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం అలియాస్ రుక్మిణి నేటి నుంచి షూటింగ్ ప్రారంభం చేసుకుంది. ఆగస్టు 17న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణను చిత్రబృందం అధికారికంగా మొదలుపెట్టింది. బోల్డ్ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తుండటం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే సినీ వర్గాల్లో ఒక రకమైన ఉత్కంఠ మొదలైంది. గత ఆగస్టు 3న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. నాని తన సొంత బ్యానర్లో దీప్తి గంతతో కలిసి ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్స్‌లో కీలకమైన ఇండోర్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాని ఈ కథపై పూర్తి నమ్మకంతో ఉండటంతో, నితిన్ కోసం ఆయన నేరుగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫలితంగా నాని మరియు నితిన్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత, చిత్రబృందం ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. సినిమాలోని పాటలు మరియు కీలకమైన అవుట్డోర్ సన్నివేశాల కోసం లొకేషన్లను ఎంపిక చేస్తున్నారు. కంటెంట్ విషయంలో రాజీ పడకుండా నాని ఈ చిత్రాన్ని క్వాలిటీగా నిర్మిస్తున్నారని సమాచారం. నిర్మాతగా మారుతున్న నాని ఈ సినిమాను 2027 మొదటి భాగంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న అలియాస్ రుక్మిణి ప్రాజెక్టును

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా మంచి వినోదం అందించేందుకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఆగస్టు 17 నుంచి వివిధ ఓటీటీలపై ఏకంగా 5 వెబ్‌సిరీస్‌లు, 5 సినిమాలు విడుదల కానున్నాయి. హాలీవుడ్ సూపర్‌హీరో కథ నుంచి క్రైమ్ థ్రిల్లర్లు, కొరియన్ మెడికల్ డ్రామా, తెలుగు రొమాంటిక్ డ్రామా, తమిళ రొమాంటిక్ కామెడీ, డాక్యుమెంటరీల వరకు విభిన్న జానర్లలో ఈ కంటెంట్ అందుబాటులోకి రానుంది. డీసీ యూనివర్స్‌లో మూడో హెచ్‌బీఓ సిరీస్‌గా, జేమ్స్ గన్ షేర్డ్ యూనివర్స్‌లో ఐదో ఎంట్రీగా లాంతర్న్స్ తెరకెక్కింది. డీసీకి చెందిన ప్రముఖ పాత్రల్లో ఒకటైన గ్రీన్ లాంతర్న్ను కొత్త తరానికి పరిచయం చేసేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆగస్టు 17 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా సీజన్ 18 ప్రముఖ కామెడీ సిరీస్ ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా 18వ సీజన్‌తో తిరిగి రానుంది. ప్యాడీస్ పబ్ మరోసారి కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేయనుంది. కొత్త సీజన్ ఎపిసోడ్లు ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ. ప్రేమ, అనురాగం, సంబంధాల చుట్టూ సాగే ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన తర్వాత ఓటీటీలోకి వస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా ఫేసింగ్ ఎల్ చాపో. దొంగిలించిన కారును ఆపే క్రమంలో ఇద్దరు మెక్సికన్ పోలీసు అధికారులు అపఖ్యాతి చెందిన డ్రగ్ లార్డ్ ఎల్ చాపోను ఎదుర్కొంటారు. స్పానిష్ భాషలో రూపొందిన ఈ థ్రిల్లర్ ఆగస్టు 21 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది. ప్యార్ ప్రేమ కల్యాణం ఒక రొమాంటిక్ కామెడీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన పవి పెళ్లి తర్వాత కూడా తన కుటుంబ ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. సంప్రదాయానికి భిన్నంగా

రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే షూటింగ్‌కు కాస్తా గ్యాప్ దొరకడంతో మహేశ్ బాబు విదేశాలకు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లారు. తొలిసారి వీరిద్దరి వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకధీరుడు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందేమోనని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. బాహుబలిలా పార్ట్-2,3 కూడా ఉంటాయా? అని కొందరు అభిప్రాయపడుతున్నారు. వారణాసికి సీక్వెల్‌పై ఇప్పటి వరకు రాజమౌళి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్‌లోని ఆన్నెసీ అంతర్జాతీయ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాజమౌళి ఈ విషయంపై స్పందించారు. వారణాసి'కి సీక్వెల్స్ ఉంటాయా అని అడగ్గా.. ఇది కేవలం ఒక సినిమా మాత్రమేనని.. సీక్వెల్ ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఒక యూనిక్ మూవీగానే రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో సీక్వెల్ ఉంటుందన్న ఊహగానాలకు రాజమౌళి చెక్ పెట్టారు. కాగా.. వారణాసి మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్‌తో పాటు అడ్వెంచరస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ చిత్రసీమలో రీ ఎంట్రీ ఇస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు) రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు) #RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు) ఘట్కేసర్లో రెచ్చిపోయిన యువకులు.. వైరల్ వీడియో!

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. NTRVIKRAM:ఈసారి త్రివిక్రమ్ పూర్తిగా కొత్త తరహా కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా, భారతీయ పురాణాల స్ఫూర్తితో రూపొందే భారీ చిత్రంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, ఎమోషన్, దైవిక అంశాలు, అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్టర్లో కనిపించిన యుద్ధ వాతావరణం, దైవిక చిహ్నాలు, మిస్టరీ లుక్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటివరకు కనిపించని కొత్త పాత్రలో కనిపించే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్ కూడా తన ప్రత్యేక శైలిలో ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలకు, భావోద్వేగ క్షణాలకు ఆయన ఇచ్చే సంగీతం సినిమాను మరింత గొప్పగా నిలబెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో పెద్ద బలంగా మారే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ విలువల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం పైన, ఎన్టీఆర్ కెరీర్లో ఇది మరో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కూడా తన కెరీర్లో అత్యంత

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'రణబాలి'. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై 'రణబాలి' సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా 'రణబాలి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇదిలా ఉంటే ఈ రోజు (జూన్ 29) డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హీరో విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు విజయ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్పందిస్తూ - 'మనం టాక్సీవాలా సినిమా చేసి తొమ్మిదేళ్లవుతోంది. ఈ తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం. అర్థవంతమైన కథలు రాయాలనే తపన, వాటిని అందంగా తెరకెక్కించాలనే ఇష్టం నీలో ఏమాత్రం తగ్గలేదు. మనం కలిసి చేసింది రెండు చిత్రాలే అయినా ఎన్నో పోరాటాలు చేశాం. మొదటి చిత్రానికి ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ అందుకున్నాం. రణబాలితో మనం మరో విజయం సాధించాలి. నువ్వు చేసే పనుల్లో అంతా మంచే జరగాలి. రణబాలిగా నటించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నా. మన సినిమాను ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా అని వేచి చూస్తున్నా' అని రాసుకొచ్చారు రౌడీ బాయ్. కాగా తొమ్మిదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ- రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో 'ట్యాక్సీవాలా' అనే సినిమా వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడిదే కాంబోలో మరో సినిమా వస్తుండడంతో రణబాలి పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది