© 2026 nimisham.in
రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఇతర స్పెషల్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ పాన్ ఇండియా మూవీ విడుదల తేదీని ప్రకటించింది.'మైసా' చిత్రాన్ని 2026 నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రష్మికకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ పంచుకున్నారు. ''స్వతహాగా ఆమె దృఢమైనది. స్వచ్ఛందంగా నిర్భయమైనది. అచంచలమైన స్ఫూర్తి కలది. మునుపెన్నడూ లేని విధంగా రష్మికతో కలిసి 'మైసా' ప్రపంచాన్ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి'' అని పేర్కొన్నారు.''మైసా.. ఆవేశం! వేదన! హృదయ వేదన! శోకం! దృఢ సంకల్పం! ధైర్యం! ఊహించని శక్తి - అదే మైసా'' అని రష్మిక పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమాని డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు దానికి వారం రోజుల ముందుగా 'మైసా' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాక్సాఫీస్ దగ్గర 'ఫౌజీ' సందడి మొదలయ్యేలోపే 'మైసా' మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది.గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘మైసా’ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ లుక్ లో కనిపించనున్నారు. తొలిసారిగా యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ఇది ఆమె కెరీర్ లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.రష్మిక మందన్న ప్రస్తుతం 'మైసా'తో పాటుగా 'రణబాలి' సినిమా చేస్తున్నారు. తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న 'రణబాలి' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ లో
విడుదల చెయ్యాలని ప్లాన్ చేసారు కానీ, కొని అనివార్య కారణాలతో వాయిదా వేశారు. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు. ఇదే క్రమంలో 'మైసా' మూవీని నవంబర్ నెలాఖరున రిలీజ్ చేయనున్నారు.