© 2026 nimisham.in

Irumudi Movie Review: రవితేజ విశ్వరూపం.. బొమ్మ దద్దరిల్లింది! Irumudi Movie Review: వరస ప్లాపులతో కాస్త వెనుకబడ్డ మాస్ మహారాజ్ రవితేజ, ఈసారి తన రొటీన్ మాస్ ఆరాటాన్ని పక్కన పెట్టి, ఒక బలమైన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసిన 'ఇరుముడి' సినిమా థియేటర్లలో ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికొస్తే.. సీలేరు ప్రాంతంలోని ఒక చిన్న పల్లెటూర్లో అరటిపళ్ల వ్యాపారం చేసుకునే త్రినాథ్ అనే సగటు కుటుంబ పెద్దగా రవితేజ కనిపిస్తారు. ఆయనకు భార్య కావేరి, కూతురు మణికంఠ అంటే ఎనలేని ప్రాణం. తన వ్యాపారం చేసుకుంటూనే ప్రతి సంవత్సరం నియమంగా అయ్యప్ప మాల వేసుకుంటాడు త్రినాథ్. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి అనుకోకుండా ఒక పెద్ద సమస్య వచ్చిపడుతుంది. ఊరిలో అనుమానాస్పదంగా కొందరు అమ్మాయిలు వరసగా చనిపోతుంటారు. ప్రతీ అమ్మాయిలో తన కూతురినే చూసుకునే హీరో, ఈ మరణాల వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఎదురైన నిజాలు ఏంటి? ఈ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రేచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు.రవితేజ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ నటనతో సినిమాను తన భుజాలపై మోశారు. చిన్న పాప నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర బాగానే చేశారు. దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథ ఆకట్టుకునే విధంగా ఉంది. ఓ ఊరులో జరిగే సాధారణ కథను తెర మీద అద్భుతంగా చూపించారు. ఇక జీవీ ప్రకాష్ తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి. దర్శకుడు అనుకున్న పాయింట్‌ను చాలా బలంగా చెప్పగలిగారు. ముఖ్యంగా ద్వితీయార్థాన్ని నడిపించిన తీరు బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కథ మూడ్‌కి తగ్గట్టుగా కుదిరాయి
.
అందరు అనుకున్నట్టుగా ఇది దేవుడి కథకు సంబంధించిన కథ మాత్రమే కాదు..సస్పెన్స్, థ్రిల్లర్‌తో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేశాడు దర్శకుడు.ఈ సినిమాలో రవితేజ వన్ మెన్ షో చేశాడనే చెప్పాలి. రీసెంట్ టైమ్‌లో ఆయనకు బెస్ట్ కంబ్యాక్ మూవీ ఇది. అయ్యప్ప స్వామి పాటలు ప్రత్యేకించి మల్లెపూల పల్లకి పాట థియేటర్లో హైలైట్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఊహించని రేంజ్లో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి.
ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి సమయం పట్టింది. అక్కడక్కడా స్లో నేరేషన్ ఫీలింగ్ కలుగుతుంది.హీరోయిన్ పాత్ర పరిమితికి లోబడే ఉండటం
రవితేజ నుంచి ఇటీవలి కాలంలో వచ్చిన చిత్రాల్లో 'ఇరుముడి' నిశ్చయంగా ది బెస్ట్ అని చెప్పవచ్చు. మరీ భారీ అంచనాలు పెట్టుకోకుండా, ఒక పక్కా ఇంటెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్‌ను చూడాలనుకునే వారికి ఈ సినిమా థియేటర్లలో మంచి అనుభూతిని ఇస్తుంది.
2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్సైట్లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.