
ఉత్తరాంధ్రపై జగన్ బిగ్‌ప్లాన్, కీలక నేతకు బాధ్యతలు- అక్కడే మకాం..!!
YS Jagan made key directions for North Andhra party leaders for local body Elections amid key developments. ఉత్తరాంధ్ర నేతలకు జగన్ కీలక నిర్దేశం చేసారు.

YS Jagan made key directions for North Andhra party leaders for local body Elections amid key developments. ఉత్తరాంధ్ర నేతలకు జగన్ కీలక నిర్దేశం చేసారు.
Kancharla Srikanth As Local Body Elections Kuppam In Charge: ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం నియోకవర్గ బాధ్యతల్ని మళ్లీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు అప్పగించారు. చంద్రబాబును కలిసిన తర్వాత శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నెలలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తప్పించారు. ఆ స్థానంలో అనంతపురంకు చెందిన యంగ్ ప్రొఫెషనల్ శ్రీకాంత్‌ను నియమించారు. తాజాగా చంద్రబాబు శ్రీకాంత్‌కు కుప్పం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.

Janasena Chief Pawan Kalyan discussions with part leaders over local body elections and seat sharing. స్థానిక ఎన్నికల పై పవన్ కసరత్తు మొదలు పెట్టారు.
Kesineni Sivanath On His Son Contesting In Local Body Elections: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుమారుడు వెంకట్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన మేయర్ రేసులో ఉన్నారంటూ కొంతమంది పోస్టులు పెట్టారు. ఈ ప్రచారంపై ఎంపీ చిన్ని స్పందించారు. తన కుమారుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. తన కుమారుడు ప్రస్తుతం వ్యాపార కార్యలకలాపాలలో ఉన్నట్లు తెలిపారు విజయవాడ ఎంపీ చిన్ని.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. కర్నూలు, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. వైసీపీ ఏ రోజు ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారు.. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సంక్షేమం కోసం ఏమి చేశారో చెప్పే దమ్ము ఉందా అని బీసీ జనార్దన్ రెడ్డి నిలదీశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారని తెలిపారు. పులివెందులకు కూడా నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. 36 నీటి ప్రాధాన్య ప్రాజెక్టులకు నీరు ఇస్తున్నామని వెల్లడించారు. ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డినే అని విమర్శించారు. వైసీపీ దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరు.. వైసీపీ నేతలు దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు. ప్రజలకు, రైతులకు ఏ విధంగా నీరు ఇవ్వాలో అధికారులతో తాము సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలకిందులు చేసిన కూడా గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీ కెనాల్‌కు నీరు ఎప్పుడు విడుదల

పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ‘‘వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలి. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలి. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల మధ్యే ఉండాలి... వారి సమస్యలపై పోరాడాలి... వైఎస్సార్సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తుచేయాలి. అలా చేస్తే స్థానిక

వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కోర్టుల్లో కేసులు వేసినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరుతాయని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నిబంధనలు, న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఇప్పటికే రూ. 3,300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని చూసి తట్టుకోలేక ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు కోర్టులను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని దయనీయ స్థితిలో ఆ పార్టీ ఉందన్న ఆయన... అందుకే రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదని జగన్ తన నేతలకు హుకుం జారీ చేశారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, వెలిగొండ ప్రాజెక్టుల క్రెడిట్ తమదేనని వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తోందని వివరించారు. నెల్లూరు నగరంలో కాలువల కట్టలపై ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలు మంజూరు చేసే అంశంపై త్వరలోనే ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని హామీ ఇచ్చారు

బీసీ రిజర్వేషన్లు (BC reservations), ఓటర్ల జాబితాపై కేసులు వేస్తుండటంపై మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ( Jagan) ఎన్ని కుట్రుల పన్నినా స్థానిక సంస్థల ఎన్నికలు (local body Elections) ఆగవన్నారు. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు. ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికల విషయంలో జగన్‌ది ద్వంద్వ వైఖరి అని దుయ్యబట్టారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని కుట్రలు చేసినా తమను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి ప్రజలకు అంకింతం చేస్తామన్నారు

బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు సెప్టెంబర్ 30 వరకు సమయం పెంపు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు అత్యంత కీలకం BC Dedicated Commission: ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై కీలక అధ్యయనం చేస్తున్న బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కమిషన్ (BC Dedicated Commission)పరిమితి గడువును పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు ద్వారా కమిషన్ తన సమగ్ర విచారణను, నివేదిక తయారీ ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు మరింత సమయం లభించినట్లయింది. Cheyutha Pension: ‘చేయూత పెన్షన్ల’ లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్.. దరఖాస్తు గడువు పెంపు రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం: బీసీ సంక్షేమ శాఖ ఈ గడువు పెంపునకు సంబంధించి అధికారికంగా 'జీవో ఎంఎస్ నంబర్ -11'ను విడుదల చేసింది. నూతన ఉత్తర్వుల ప్రకారం కమిషన్ కాలపరిమితిని ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కొనసాగుతున్న ఈ కమిషన్, రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లలో బీసీల ప్రాతినిధ్యంపై క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం జరుపుతోంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు ఈ నివేదికే కీలకం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం, సమగ్ర రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఈ కమిషన్ అందించే సిఫార్సులే అత్యంత కీలకం కానున్నాయి. వివిధ ప్రాంతాల్లో సేకరించిన సమాచారం, రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా కమిషన్ సమర్పించే నివేదికను బట్టే ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన, రాజకీయ నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకున్న గడువు పొడిగింపు నిర్ణయం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటును పరిశీలించాలని, డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా అవసరమైన ఫారాలను సమర్పించి వారి ఓట్లను కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశారు. 44 లక్షల నోటీసుల అంశంపైనా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాలని సజ్జల పార్టీ నేతలకు సూచించారు. అర్హులైన ఓటర్లకు సంబంధించిన అంశాల్లో అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని, చిరునామా మార్పులు, ఇతర ఓటరు వివరాల సవరణలకు అవసరమైన ఫారాలను కూడా దాఖలు చేయాలని చెప్పారు.. అభ్యంతరాలు లేదా దరఖాస్తులు సమర్పించిన ప్రతిసారీ సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సజ్జల సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రసీదులు, సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలకు సంబంధించిన ప్రధాన ప్రక్రియను ఆగస్టు 27, 28 తేదీల నాటికి పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రాంతానికి బయట ఉన్న ఓటర్ల వివరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యవహారంలో

Minister Narayana: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాతావరణం వచ్చినట్టే కనిపిస్తోంది.. ఎన్నికల ప్రక్రియకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. మరోవైపు.. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ.. స్థానిక సంస్థల్లో వాటిని అమలు చేసేలా కూడా నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, ఈ సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోర్టు తీర్పుపై ఆధారపడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలపై కోర్టు తీర్పు రావాల్సి ఉందని, తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నీటి సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలపై కూడా మంత్రి నారాయణ స్పందించారు. డేటా సెంటర్ల కారణంగా విశాఖలో నీటి సమస్యలు రావని స్పష్టం చేశారు. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఇక, భోగాపురం వెళ్లే రహదారి మరమ్మతులకు గురైనట్టు తన దృష్టికి రాలేదని మంత్రి నారాయణ అన్నారు. అయితే రహదారి పరిస్థితిపై పరిశీలన చేస్తామని చెప్పారు

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అమరావతి, ఆగస్టు 22: 2024 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. హత్యలు, దాడులనే నమ్ముకుని పాలిటిక్స్ చేస్తోందని వినిపిస్తోంది

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 నియోజకవర్గాలకే పరిమితమైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును నిలుపుకోవడం, అదే స్థాయిలో స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అదే స్థాయిలో పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.ఇందులో భాగంగా.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన ఓ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 175 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు, కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.చిక్కుల్లో పడ్డ నెతన్యాహు: రెడ్ నోటీస్స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ శ్రేణులను కిందిస్థాయి నుంచి సిద్ధం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ ఇన్ఛార్జ్లకు స్పష్టత ఇవ్వనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ధీటుగా స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్ లో జగన్ కు గ్రాండ్ వెల్కమ్: అదే హైలైట్ఈ కీలక భేటీలో నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా పనిచేసేలా క్యాడర్లో భరోసా నింపనున్నారు. అధికార కూటమి ప్రజావ్యతిరేక విధానాలపై

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు పార్టీలు సమన్వయంతో సీట్ల పంపకాల పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇదే సమయంలో అటు వైసీపీ సైతం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. సీట్ల సర్దుబాటు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ స్థానిక ఎన్నికల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.ఏపీలో ఇప్పుడు స్థానిక ఎన్నికల రాజకీయం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పైన జనసేన నుంచి ఈ సారి వాయిస్ బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల ఫార్ములా ఇప్పుడు ఈ ఎన్నికలకు వర్తించదని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. తమకు బలం ఉన్న చోట్ల పోటీ చేసి తీరుతామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో, కూటమి లోని మూడు పార్టీల అధినేత లు కలిసి కూర్చొని సీట్ల పంపకాల పైన మాట్లాడుకుందామని చంద్రబాబు సూచించారు. కాగా.. ఇక, ఇప్పుడు జనసేన నుంచి సీట్ల పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ అసెంబ్లీలోని జనసేన కార్యాలయ ప్రాగణంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికల పైన చర్చించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ఇదే సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!పవన్ సంకేతాల వెనుకసమావేశం తరువాత పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో..జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం.. అని పవన్ స్పష్టం చేసారు. ఇందులో ప్రత్యేకంగా జనసైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా అని చెప్పటం ద్వారా సీట్ల

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. విశాఖపట్నం, ఆగస్టు 20: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. ఈరోజు(గురువారం) విశాఖ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో మంచి ప్రతిపక్షం లేదని... ప్రతిపక్షంలో ఉన్నవారికి వారి పాత్ర అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఎల్‌నినో వలన నీటి సమస్య తలెత్తుతోందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని డేటా సెంటర్ల వలన నీటి సమస్య వస్తోందని కొన్ని శక్తులు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. డేటా సెంటర్లు రావడానికి ఇంకా రెండు సంవత్సరాలు సమయం పడుతుందని తెలిపారు. వర్షాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. పోలవరం నీటిని విశాఖకు తీసుకువస్తున్నారని, నదులన్నీ అనుసంధానం అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో నీటి సమస్య తగ్గుతుందని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. ఏపీలో మిలాద్-ఉన్-నబి సెలవు తేదీ మార్పు.. ఎస్సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని 100 పురపాలక సంఘాలలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీలు) 33.33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పురపాలక శాఖ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలలో.. 100 చోట్ల త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.87 పురపాలక సంఘాల పదవీకాలం ఇప్పటికే పూర్తికాగా.. మరో 13 పురపాలక సంఘాల పదవీకాలం నవంబర్ నాటికి ముగియనుంది. కోర్టు కేసులు ఇతరత్రా న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా 23 పురపాలక సంఘాలలో ఎన్నికలు సాధ్యపడేలా కనిపించడం లేదు. మిగతా వంద చోట్లా త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి బీసీలకు మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ వంటి ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.మరోవైపు ఎన్నికల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా బుధవారం రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కీలక వివరాలు వెల్లడించారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించామని, ఒక్కో ప్రక్రియ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో పూర్తిచేసి.. 16వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో

ఏపీ మున్సిపల్ ఎన్నికల కసరత్తు బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు 123 స్థానిక సంస్థల్లో ఎన్నికలు Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ దిశగా సన్నాహక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు పరిపాలనాపరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పారదర్శకమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయడానికి అవసరమైన ముందస్తు చర్యలు, నిబంధనలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. CNG Cylinder Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. పేలిన సీఎన్జీ సిలిండర్.. ముగ్గురు దుర్మరణం! రిజర్వేషన్లు, స్థానిక సంస్థల గడువు: రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల్లో ఇప్పటికే పాలకవర్గాల పదవీకాలం పూర్తి కాగా, మరికొన్ని పట్టణ స్థానిక సంస్థల(Local Body Elections) గడువు కూడా త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కీలకమైన ఘట్టంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల సమాచారం కోసం అధికారిక వనరులు: ఎన్నికల నిర్వహణ, ముసాయిదా ఓటర్ల జాబితా, నోటిఫికేషన్లు, ఇతర అధికారిక మార్గదర్శకాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని తెలుసుకోవడానికి ఓటర్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను లేదా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ పోర్టల్‌ను పరిశీలించవచ్చు. ఎన్నికల షెడ్యూల్, ఓటరు నమోదు సంబంధిత సేవల వివరాలను సంబంధిత అధికారిక వనరుల ద్వారా నేరుగా సరిచూసుకోవచ్చు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Padayatra: మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర జరిగిన తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే (వైఎస్సార్సీపీ) విజయం అని పూర్తి విశ్వాసం ప్రకటించారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. 'అన్నింట్లో చంద్రబాబు విఫలమవడంతో వైఎస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి వైఎస్సార్సీపీ పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కండి. గెలుపే లక్ష్యంగా పని చేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదు' అని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనిపించకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి' అని పార్టీ శ్రేణులకు సూచించారు. మనకు అత్యంత ప్రజాదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఇసుక

స్థానిక ఎన్నికలకు పార్టీ సన్నద్ధం కూటమి పాలనపై జగన్ విమర్శలు ఏడాదిలో జగన్ పాదయాత్ర ప్రారంభం YS Jagan: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యాధికారులతో జరిగిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన జగన్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎంతటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించాలని స్పష్టం చేశారు. Konda Sushmitha: పరకాల బరిలో దిగేది నేనే.. కళ్ళు నెత్తికెక్కినయా.. సీఎం రేవంత్ కి కొండా సుస్మిత మాస్ కౌంటర్? కూటమి పాలనపై విమర్శలు, లా అండ్ ఆర్డర్ వైఫల్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానిని నిలబెట్టుకోలేకపోయిందని, రెండేళ్ల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మద్యం, ఇసుక, మట్టి మాఫియాలు విజృంభిస్తున్నాయని దుయ్యబట్టారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక దారుణ హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, కేసును తొక్కిపెట్టేందుకు అధికార పార్టీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. ప్రభుత్వ విఫల విధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల కుట్రలు పన్నుతున్నారని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వైఎస్సార్సీపీ నేతలు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలు, పాదయాత్రపై జగన్ ధీమా: గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనకు, ప్రస్తుత కూటమి రౌడీయిజానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రతి ఇంట్లోనూ ప్రజలు పోల్చి చూస్తున్నారని జగన్ పేర్కొన్నారు. నిత్యం జనంలో ఉంటూ ప్రజ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపుగా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా విడుదలకు లైన్ క్లియర్ కావడంతో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబర్‌లో ఎన్నికల నిర్వహించాల్సి వస్తోంది. గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సి నిధులు కోల్పోయే పరిస్థితి ఉంది. ఏపీ కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అక్టోబరులో ఎట్టిపరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని.. ఒకవేళ నిర్వహించలేకపోతే కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.కేంద్రం నుంచి రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది.. నిధులు ఐదేళ్లలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు 16వ ఆర్థిక సంఘం సుమారు రూ.16,600 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.12,150 కోట్లు రావాలి. ఈ నిధులు రావాలంటే కచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందేనని చంద్రబాబు మంత్రులతో చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీకి ఎన్నికలు జరగాల్సిందేనని.. కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబందించి 2021లో గ్రామాల విలీనం చేశారు. కానీ ఈ అంశం కోర్టుకు చేరడంతో 23 చోట్ల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి ఆ 23 చోట్ల కూడా నిర్వహించాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీని కోసం పిటిషన్లు దాఖలు చేసిన వారితో మాట్లాడి ఉపసంహరించుకునేలా చేయాలని సూచించారు. ఒకవేళ కుదరని పక్షంలో విలీన గ్రామాలనున పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పోలింగ్ బూతులు, ఓటర్ లిస్టులు, వార్డులకు రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్‌లో కచ్చితంగా ఎన్నికల నిర్వహించాల్సి రావడంతో ఈ కసరత్తును వేగవంతం చేశారు. మున్సిపల్ ఎన్నికలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిని విడివడిగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.. కాబట్టి సమయం కూడా తక్కువగా ఉంది. కేవలం రెండు

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ఏకపక్షంగా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. అటు వైసీసీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ ఏం చేయబోతుందనేది కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం అధికారికంగా ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయించింది. అర్బన్ - రూరల్ ప్రాంతాల్లో ఏ మేర అమలు చేయాలో డిసైడ్ అయింది. అదే విధంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను రాబట్టేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాలని తీర్మానించింది.చట్టంలోని నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్‌తోనే ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదించింది. తిరుమల వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన - టార్గెట్ ఫిక్స్..!!ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలుఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రస్తుతం వారి రిజర్వేషన్లు యథతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోంది. కాగా.. ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా పెంచడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కానుంది. మూడు పార్టీలు స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాల పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, అటు వైసీపీ సైతం ఈ ఎన్నికల్లో గట్టి పోటీ

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయానికి వస్తే.. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను రాబట్టేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాలని తీర్మానించింది. చట్టంలోని నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్‌తోనే ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రస్తుతం వారి రిజర్వేషన్లు యథతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెట్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని మంత్రి మండలికి అధికారులు వివరించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని, ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా పెంచడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. సకాలంలో ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులను భారీగా

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) రిజర్వేషన్ల నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీలు ఎక్కువ ఉన్న చోట బీసీలకు తగ్గిన కోటా అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) రిజర్వేషన్ల నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసింది. నెల్లూరు, తిరుపతి తదితర జిల్లాల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్ మాత్రమే కేటాయించాలని పేర్కొంది. ఆయా జిల్లాల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల జనాభా మరింత ఎక్కువ ఉండటంతో బీసీలకు తక్కువ ప్రకటించాలని తెలిపింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండాల్సి రావడం, ఆయా జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సి రావడంతో ఈ సమస్య ఏర్పడింది. బీసీ జనాభా తక్కువగా ఉన్న చోట.. రిజర్వేషన్లు తక్కువగా ప్రకటించినా ఇబ్బంది ఉండదని, ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉన్నప్పటికీ వారికి తగిన రిజర్వేషన్లు కల్పించలేకపోతే బీసీ వర్గాల్లో ఆందోళన పెరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ వ్యత్యాసాలను తగ్గించేందుకు మండలాలకు రిజర్వేషన్లను రాష్ట్రం యూనిట్‌గా తీసుకోవచ్చని అడ్వొకేట్ జనరల్ సలహా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 660 మండల పరిషత్‌ల అధ్యక్షులకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు చేసింది. వీటి ప్రకారం కొన్ని జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు దక్కే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోవడం ద్వారా ఈ వ్యత్యాసాన్ని తగ్గించే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. 55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బీసీల (BCs) రాజకీయ, సామాజిక హక్కుల అంశంపై మరోసారి చర్చ మొదలైంది. గత ప్రభుత్వ పాలనలో బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. తెలుగుదేశం పార్టీ (TDP) మొదటి నుంచీ బీసీలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రి ప్రస్తావించారు. బీసీలకు రాజకీయంగా అవకాశాలు పెరగాలంటే రిజర్వేషన్లు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వెనుకబడిన వర్గాలకు పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో బీసీలకు 34 శాతం కోటా అమలు చేసే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అయితే గత పాలనలో వారి హక్కులకు నష్టం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై టీడీపీ నిరంతరం పోరాడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి వంటి రంగాల్లో కూడా వెనుకబడిన వర్గాలు ముందుకు రావడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో వారికి ఉపయోగపడేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల ఓటు బ్యాంకు కీలకంగా ఉంది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో బీసీ వర్గాలకు గణనీయమైన జనాభా ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే కేవలం ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం కాకుండా, అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధికి స్పష్టమైన విధానాలు అమలు చేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి

AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. చరిత్రలో మరిచిపోలేని రోజు! AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. ఈ నిర్ణయం బీసీలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతుందని ఆమె పేర్కొన్నారు. బీసీలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. బీసీల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఆయన స్ఫూర్తితో సీఎం చంద్రబాబు బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. 1994లోనే స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం పెరుగుతుందని అన్నారు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ టీడీపీ అని సవిత పేర్కొన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు వంటి పలువురు బీసీ నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగారని తెలిపారు. బీసీలకు రాజకీయ గుర్తింపు, ప్రాతినిధ్యం కల్పించడంలో టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత విధించిందని మంత్రి సవిత ఆరోపించారు. 34 శాతం నుంచి 24 శాతానికి రిజర్వేషన్లు తగ్గించడం వల్ల 16,800కు పైగా పదవులకు బీసీలు దూరమయ్యారని విమర్శించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని మంత్రి నారా లోకేశ్ తన పాదయాత్రలో గుర్తించి, అధికారంలోకి వస్తే 34

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భాగస్వాములతో కలిసే బరిలోకి దిగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల కీలక సమావేశంలో మాట్లాడిన ఆయన, స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే వార్డు స్థాయి నుంచి ప్రతి గ్రామంలోనూ కమలం జెండా ఎగిరేలా, స్థానిక పదవులను దక్కించుకునేలా ప్రణాళికలతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి ఫలాలను, మన్ కీ బాత్ వేదికగా వ్యక్తమయ్యే సందేశాలను ప్రతి ఇంటా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే విశాఖ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ... దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధనతో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నామని, ప్రస్తుతం అది లాభాల దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు. పోలవరం నీటిని విశాఖ ప్రాంతానికి అందించే పనులు కూడా వేగవంతమయ్యాయని వివరించారు

బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక బలహీనవర్గాలను అసెంబ్లీకి పంపారని.. స్థానిక సంస్థలలో 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. అమరావతి, ఆగస్టు 18: బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు(మంగళవారం) ఏపీ అసెంబ్లీలో బీసీ సాధికారత రిజర్వేషన్లపై మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక బలహీనవర్గాలను అసెంబ్లీకి పంపారని.. స్థానిక సంస్థలలో 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 34 శాతం రిజర్వేషన్లను కల్పించారని గుర్తుచేశారు. గతంలో ఉన్న చట్టంలో మార్పు చేయాలంటే .. సవరణ చేయాలన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక బలహీనవర్గాలపై దాడులు చేశారని, దమనకాండ చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీకి అండగా ఉన్న వర్గం బీసీలు అని అన్నారు. అందుకే బీసీలపై వైసీపీ కక్ష కట్టిందని విమర్శించారు. బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పి రిజర్వేషన్లను పెంచారని, అయితే చట్టాన్ని మార్పు చేయాల్సి ఉండగా అలా చేయకుండా కొత్త జీవో ఇచ్చారని గత ప్రభుత్వంపై మంత్రి మండిపడ్డారు. ఆ రిజర్వేషన్లు వద్దు అని చెప్పి వైసీపీ సానుభూతిపరుడితోనే కోర్టులో కేసులు పెట్టించారన్నారు. కోర్టులో ఎదురుదెబ్బ తగిలితే సుప్రీంకోర్టుకు వెళ్లలేదని... తద్వారా బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. నేడు కేబినెట్ సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ల కల్పనపై చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: మంత్రి సవిత

ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం అంజెడా అంశాలు ముగిశాక వివిధ పరిణామాలపై సీఎం చర్చించారు. అమరావతి, ఆగస్టు 18: ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం అంజెడా అంశాలు ముగిశాక వివిధ పరిణామాలపై సీఎం చర్చించారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లపై ధీటుగా స్పందించాలని మంత్రులకు సూచించారు. అక్టోబర్‌లోగా స్థానిక ఎన్నికలు జరగకుంటే రూ.12150 కోట్లు అర్బన్ లోకల్ బాడీ నిధులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. న్యాయ పరిధిలో 23 మున్సిపాలిటీల విలీన ప్రక్రియను తర్వాత చూసుకుందామని.. ముందైతే అన్నింటిలోనూ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మద్యం బ్రాండ్లు పిచ్చి పిచ్చి పేర్లతో రాకుండా కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అక్రమార్కులు కంటైనర్లలో ఇసుక తరలింపుకు యత్నిస్తుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ఉద్యోగాల్లో జోనల్ విధానం లేదు.. మెరిట్‌కే ప్రాధాన్యం: మంత్రి ఆనం రామనారాయణ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఏపీ మంత్రివర్గ భేటీలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లు కు ఆమోదం తెలపనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్ల పైన కేబినెట్ భేటీ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా బీసీ రక్షణ చట్టం.. అమరావతిలో భూ సమీకరణ వంటి అంశాల పైన చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ పైనా నిర్ణయం తీసుకోనున్నారు.అసెంబ్లీ సమావేశాల వేళ ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలుకు సిద్దం అవుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంతులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ముందుకు వెళ్లే అంశంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. స్థానిక ఎన్నికలకు ఈవీఎంలా.. బ్యాలెట్ బాక్సులా- ప్రభుత్వం తాజా ఆదేశాలతో..!?దాదాపు 55కు పైగా అజెండా అంశాలతో మంత్రులు సమావేశం కానున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలపై క్యాబినెట్లో చర్చించనున్నారు. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.కాగా, తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. ఇంధన రంగంలో హైబ్రిడ్, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపైన చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి రైల్వేలైన్ కోసం ల్యాండ్ పూలింగ్‌పై మత్రులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలకు చట్ట సవరణ ప్రతిపాదనలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి- ఉత్తర్వులు జారీ..!!10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటనపై నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ విద్యార్థులకు IIT-JEE, NEET కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుపై క్యాబినెట్లో మాట్లాడనున్నారు

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత... జీవో జారీ చేసి, దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్... రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6 శాతం ఉన్నట్లు లెక్కతేల్చింది. బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే.. స్పష్టంచేసిన సీఎం పంచాయతీరాజ్‌లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో మూడో వంతు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సకాలంలో స్థానిక ఎన్నికలు అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత... జీవో జారీ చేసి, దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్... రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6 శాతం ఉన్నట్లు లెక్కతేల్చింది. అలాగే... స్థానిక ఎన్నికల్లో బీసీలకు 27శాతం వాటా ఇవ్వాలని సిఫారసు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించితే న్యాయపరంగా చెల్లుబాటు కాదు. దీనిని దృష్టిలో పెట్టుకునే 27 శాతానికి పరిమితం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కోటాతో పోల్చితే ఇది ఎక్కువే. అయినప్పటికీ... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ, మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో 34 శాతం బీసీలకు కేటాయించి తీరాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని తన చాంబర్లో... రాత్రి మరోసారి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలురకాల ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. చివరికి... 34 శాతంపై ముందుకే వెళ్లాలని తీర్మానించారు. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పినప్పటికీ... బీసీలకు 34 శాతానికి మించకుండా రిజర్వేషన్ కల్పించవచ్చునని పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది. అందువల్ల ప్రత్యేకంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా పైన క్లారిటీ ఇచ్చింది. 2025 నాటికి ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాల ఆధారంగానే ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితా కోసం ఎదురు చూడకుండానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది.తాజా సర్ తుది జాబితాతో సంబంధం లేకుండా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇటీవల కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితాలు అక్టోబర్ 3వ తేదీన ప్రచురితమవుతాయి. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలు తయారు చేస్తే ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.2025 నాటి జాబితాతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయంఈ క్రమంలోనే సమయం తక్కువగా ఉన్న కారణంగా 2025 నాటి జాబితాలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అక్టోబర్‌లో ఎన్నికలను నిర్వహించాలని ఆలోచిస్తున్న క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా పురపాలక, నగర పంచాయతీలలో, నగరపాలక సంస్థ ఫోటో గుర్తింపు ఓటర్ల జాబితాలో ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి.రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ల పైన ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలు దగ్గర పడినట్లేనని అర్థం చేసుకోవచ్చు.జాబితాల ప్రచురణకు ఎన్నికల సంఘం ఆదేశం ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం మునిసిపాలిటీల్లో వచ్చే నెల 3వ తేదీలోగా, ఇప్పటివరకు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం - ఎన్నికల సంఘం ఈ ఎన్నికల పైన కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు పైనా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ బీసీలకు రిజర్వేషన్ల పైన నివేదిక సమర్పించింది. దీంతో... బీసీలకు సీట్ల కేటాయింపు పైన పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా నిర్ణయం ప్రకటించనున్నారు.ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగంగా కొనసాగుతోంది. సర్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. 2025 ఎన్నికల జాబితా మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశం పైన ప్రభుత్వానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను రేపు (సోమవారం) ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. రిజర్వేషన్ల అమలు పైన బిల్లు- తీర్మానం దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇదే సమయంలో బీసీలకు సీట్ల కేటాయింపు పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి..!!చంద్రబాబు కీలక నిర్ణయంసీఎం చంద్రబాబు కూటమి పార్టీల నేతలతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసులను అమలు చేస్తే బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించగలమని చెప్పారు. కానీ, ఎన్నికల సమయంలో 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. దీని అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ పరమైన చిక్కులు ఎదురయ్యేపక్షంలో బీసీలకు పార్టీపరంగా న్యాయం చేద్దామని పేర్కొన్నారు. వారికి రాజకీయంగా సముచితస్థానం కల్పిద్దామని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. అక్టోబర్‌లో ఈ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే, ఇటీవల నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తుది ఓటర్ల జాబితాలతో కాకుండా.. 2025 నాటి ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ఓటర్ల జాబితాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 3న సర్ తుది ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలు ప్రచురిస్తే ఎన్నికల నిర్వహణ జాప్యమవుతోందని భావిస్తున్నారు. ఈ కారణంతో 2025 నాటి జాబితాలతోనే ఎలక్షన్స్‌కి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఈ మేరకు ముందుగా పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఫొటో గుర్తింపు ఓటరల్ జాబితాల ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పుర, నగరపాలక,నగర పంచాయతీల్లో.. ఆ తర్వాత గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆశావాహులంతా సన్నద్ధమవుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి.ఇక స్థానాల రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందంటేనే ఎన్నికలు సమీపించాయని అర్థం అంటూ అధికారులు చెబుతున్నారు. దాంతో ఓటర్ల జాబితా ప్రచురణపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.మున్సిపాలిటీల్లో వచ్చే నెల 3లోగా, ఇప్పటి వరకు ఓటర్ల జాబితా సిద్ధం చేయని సుమారు 50 పంచాయతీల్లో ఈ నెల 17వ తేదీలోగా ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను ఎన్నికల సంఘం ఆదేశించింది. పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటికి సంబంధించిన పబ్లికేషన్ ప్రక్రియ కూడా ఈ నెల 21 నుంచి 31లోగా పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు ఏర్పాట్లు కూడా

ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కీలకంగా మారుతోంది. ఇప్పటికే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల పైన కీలక సిఫారసులతో నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో బీసీలు 50.26 శాతం ఉన్నట్లు తేల్చిన కమిషన్.. దీని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ధారిస్తూ సిఫారసులు చేసింది. ఈ లెక్కన ఎక్కడ బీసీలకు ఎన్ని స్థానాలు దక్కుతాయనే అంచనాలు మొదలయ్యాయి.ఏపీలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పైన రాజీవ్ రంజన్ మిశ్రా ప్రభుత్వానికి అందించిన నివేదిక లో కీలక అంశాలను ప్రస్తావన చేసింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 50.26 శాతం ఉన్నట్లు కమిషన్ తేల్చింది. దీని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. దీంతో.. నోటిఫై చేసిన షెడ్యూలు ఏరియాల్లో మొత్తం సీట్లను ఎస్టీలకు మాత్రమే కేటాయించాల్సి ఉంది. మిగిలిన నాన్-షెడ్యూల్ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల స్థానాల్లో మాత్రమే బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీని ప్రకారం.. పంచాయతీ వార్డులు కాకుండా.. ఇతర స్థానిక సంస్థల స్థానాల్లో బీసీలకు 27.66 శాతం స్థానాలు లభిస్తున్నాయి. 2021లో ఇది 23.84 శాతం మాత్రమే. అంటే... గతంలో కంటే ఇప్పుడు 3.82 శాతం కోటా పెరిగినట్లు. పంచాయతీ వార్డులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మారే అవకాశం ఉంటుంది. వారి ట్రాప్ లో పడొద్దు, పరిధి దాటొద్దు..!!తాజా ప్రతిపాదనలు.. లెక్కలుకాగా.. నాన్ షెడ్యూల్ ఏరియాలో మొత్తం 11,190 సర్పంచ్ స్థానాలున్నాయి. వీటిలో 27.95 శాతం బీసీలకు కేటాయించాలని కమిషన్ సూచన చేసింది. ఇక, ఎంపీపీలు 24.6 శాతం, ఎంపీటీసీలు 25.55 శాతం, జడ్పీటీసీలు 24.6 శాతం, జడ్పీ చైర్పర్సన్లు 23.08 శాతం బీసీలకు కేటాయించాలని కమిషన్ సిఫారసు చేసింది. కార్పొరేషన్ల మేయర్లలో 35.29
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటర్ల జాబితాల ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయితీల్లో సెప్టెంబర్ 3న ఫొటో ఎలక్ట్రోరల్ రోల్స్ ప్రచురించాలని ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. అలాగు ఈ నెల 17న గతంలో ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించని 20 గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించినా సన్నద్ధంగా ఉండేలా అధికారులు, జిల్లాల యంత్రాంగాలను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఇప్పటికే మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.. అందుకే తొలి అడుగుగా ఓటర్ల జాబితాల ప్రకటన చేయనున్నారు. ఈనెల 21నుంచి 31 వరకు గ్రామ పంచాయతీల్లోనూ పోలింగ్ స్టేషన్లు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని 13వేలకుపైగా గ్రామపంచాయతీలు, వందకుపైగా మున్సిపాలిటీలకు సంబంధించి ఫొటో ఓటర్ల జాబితాల ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 4,033 డివిజన్లు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించాలి. వీటిలో 17 కార్పొరేషన్లు, 88 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలు ఉన్నాయి. 2021లో కోర్టు కేసుల కారణంగా 00 చోట్లే ఎన్నికలు జరిగాయి.. కానీ ఈసారి అన్నిచోట్లా ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈనెల 21 నుంచి 31లోగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల జాబితాలు ప్రచురిస్తారు.. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఖరారు చేస్తారు. 2026 జనవరి ఒకటికి ఓటు అర్హత పొందిన వారితో ఉన్న ఓటర్ల జాబితాల నుంచి జాబితాలను ప్రకటిస్తారు. అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మేయర్లు, ఛైర్మన్లు, డివిజన్ కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలకమైన నోటిఫికేషన్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ముందుగా మున్సిపల్ తరువాత జిల్లా పరిషత్ ఎన్నికలకు వీలుగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ ల సంఖ్య పెంపు దిశగా కసరత్తు జరుగుతోంది. కొత్తగా 15 జెడ్పీలు ఏర్పడనున్నాయి. దీంతో.. ఈ నిర్ణయం రాజకీయంగా పార్టీల పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో స్థానిక ఎన్నికల దిశగా వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ కేడర్ కు ఈ ఎన్నికల పైన దిశా నిర్దేశం చేస్తున్నాయి. ముందుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల కు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం ఖరారు తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అక్టోబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త జిల్లాలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మరో 15 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాకో జడ్పీ ఏర్పాటుకు ప్రస్తుతమున్న 13 జిల్లా పరిషత్‌ల పునర్విభజన చేపట్టనున్నారు. దీంతో.. మొత్తం 28 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబరు 24వ తేదీతో అన్ని జిల్లాల జడ్పీ చైర్పర్సన్లు, జడ్పీటీసీల పదవీకాలం, అంతకుముందు రోజే ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం ముగియనుండటంతో.. ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్..!!తాజా కసరత్తు.. కీలక నిర్ణయాలుకాగా.. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే లోగా జిల్లా పరిషత్‌ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత కసరత్తులో భాగంగా పంచాయతీరాజ్ కమిషనరేట్ ఆ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటిని ప్రభుత్వానికి పంపి క్యాబినెట్ ఆమోదం తీసుకోవల సి