
Kesineni Sivanath On His Son Contesting In local body Elections: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుమారుడు వెంకట్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన మేయర్ రేసులో ఉన్నారంటూ కొంతమంది పోస్టులు పెట్టారు. ఈ ప్రచారంపై ఎంపీ చిన్ని స్పందించారు. తన కుమారుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. తన కుమారుడు ప్రస్తుతం వ్యాపార కార్యలకలాపాలలో ఉన్నట్లు తెలిపారు విజయవాడ ఎంపీ చిన్ని.





