
India vs Sri Lanka, Women's Asia Cup Final Live: 8వ టైటిల్‌పై కన్నేసిన భారత్.. లంకతో ఫైనల్ పోరుకు రెడీ..!
India vs Sri Lanka, Women's Asia Cup Final Live: 8వ టైటిల్‌పై కన్నేసిన భారత్.

India vs Sri Lanka, Women's Asia Cup Final Live: 8వ టైటిల్‌పై కన్నేసిన భారత్.

మహిళల క్రికెట్లో తొలిసారి నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారత్‌కు ఆతిథ్య హక్కులను జారీ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, వడోదర వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో టాప్-6 టీమ్స్ తలపడనున్నాయి. అయితే తొలుత మహిళల తొలి చాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సింది. కానీ ప్రస్తుతం శ్రీలంక పాలనా పరమైన సమస్యలతో సతమతమవుతున్న వేళ ఐసీసీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి భారత్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో టోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో లంకకు బదులుగా టోర్నీని బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, భారత్ రూపంలో మూడు ప్రతిపాదనలు చేసింది. తాజాగా ఐసీసీ బుధవారం భారత్‌కు ఆతిథ్య హక్కులు కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకుంది. జూలై 6 అర్హత కటాఫ్ తేదీ నాటికి ఐసీసీ మహిళల టీ20ఐ టీమ్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాల ప్రకారం అర్హత సాధించిన ఆ ఆరు జట్లు రౌండ్-రాబిన్ లీగ్‌లో పోటీపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌కు చేరుకుంటాయి. కటాఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలు తొలి చాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాయి. Read: ఆసీస్‌తో సిరీస్‌కు పక్కనబెట్టారు.. కట్‌చేస్తే ట్రిపుల్ సెంచరీ కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ-2027 ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి భారత్‌కు బదిలీ చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)లో ప్రభుత్వ జోక్యం, కొనసాగుతున్న పరిపాలన సంక్షోభం కారణంగా ఈ మార్పు చేసినట్లు ఐసీసీ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ), వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు మ్యాచ్‌లకు వేదికలుగా నిలవనున్నాయి. ఆసక్తికరంగా, 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకున్న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.లంక బోర్డులో సంక్షోభమే కారణం వాస్తవానికి ఈ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డులో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుని, రాజ్యాంగ, పరిపాలన సంస్కరణల కోసం ఓ తాత్కాలిక 'ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ'ని ఏర్పాటు చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డుల వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ నియమిత కమిటీలను గుర్తించబోమని స్పష్టం చేసిన ఐసీసీ, ఆ కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఎస్ఎల్సీ ప్రతినిధులను బోర్డు సమావేశాలకు దూరంగా ఉంచుతోంది. ఈ సంస్కరణలు పూర్తికాని నేపథ్యంలోనే టోర్నీని తరలించాలని నిర్ణయించినట్లు ఐసీసీ పేర్కొంది.శ్రీలంకకు ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశం కోసం బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల నుంచి కూడా ప్రతిపాదనలు రాగా, అన్నింటినీ పరిశీలించిన అనంతరం ఐసీసీ బోర్డు భారత్‌ను ఎంపిక చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది.మహిళల

మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ ప్రకటించింది. స్పోర్ట్స్ డెస్క్: మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ(బుధవారం)ప్రకటించింది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంగా ఆతిథ్య హక్కులను కోల్పోయింది. ఈక్రమంలో ఈ టోర్నీ నిర్వహించేందుకు భారత్‌కు అవకాశం లభించింది. వాస్తవానికి టోర్నమెంట్ నిర్వహణకు బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికాలను ఐసీసీ ఆప్షన్లుగా పెట్టుకుంది. అయితే చివరకు ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశంగా భారత్‌ను ఐసీసీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని ఇవాళ(సెప్టెంబర్ 2) ఐసీసీ బోర్డు ఆమోదించింది. ఇక టోర్నీ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగనుంది. మ్యాచ్‌లు ముంబై, వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఇక టోర్నీలో పాల్గొనే జట్ల అర్హతలను కూడా ఐసీసీ వెల్లడించింది. కటాఫ్ డేట్ అయిన జులై 6 నాటికి మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడనున్నాయి. ఆ విధంగా చూస్తే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ ఈ టోర్నీకి దూరమైంది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్లో తలపడతాయి. నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం: తిలక్ వర్మ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ .. పడిపోయిన గిల్, బుమ్రా స్థానాలు!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. మరోవైపు, యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన శుభ్‌మన్ గిల్.. తాజాగా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఏడో స్థానంతో భారత్ తరఫున బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలతో బాదిన దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానానికి చేరుకున్నాడు. లంక గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానాన్ని కోల్పోయి.. మూడో స్థానానికి పడిపోయాడు. మోకాలి గాయం కారణంగా బుమ్రా జూలై మధ్య నుంచి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ మధ్యలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బుమ్రా ఎంపికైనప్పటికీ, అతడి ఫిట్నెస్ ఆధారంగానే తుది జట్టులో ఆడటం ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్ లో రిలీజ్ అయ్యే అతడి ఐసీసీ

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. IND vs SL 2nd Test Predicted Playing 11: శ్రీలంకపై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా రెడీ అవుతోంది. తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్.. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కొలంబోలోని ఎస్ఎస్సీ స్టేడియం వేదికగా రేపటి (ఆగస్టు 23) నుంచి రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకోవాలని గిల్ సేన చూస్తోంది. మరోవైపు సిరీస్ సమం చేయాలంటే ఆతిథ్య శ్రీలంక తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ (167), కేఎల్ రాహుల్ (82) అద్భుతంగా రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య, కేశర నువాంత రాణించి భారత్ 193 పరుగులకు పరిమితమైంది. 445 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 206 రన్స్‌కు ఆలౌట్ అయింది. రెండో టెస్టులో భారత బౌలింగ్ విభాగంలో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలంతో లంకను దెబ్బకొట్టగా.. కుల్దీప్ యాదవ్ మాత్రం లయ అందుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం ఒకే వికెట్ తీశాడు. కుల్దీప్ను గిల్ కేవలం మూడో స్పిన్నర్‌గా చూస్తున్నట్లు అర్థమవుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుల్దీప్కు సపోర్ట్‌గా ఉన్నా.. ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యం ఉండటంతో అతనికి విశ్రాంతినిచ్చి ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌ను

శ్రీలంకతో తొలి టెస్టులో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సేవలను సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. గాలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కుల్దీప్ మొత్తంగా 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. సారాంశ్ జైన్ అరంగేట్రం! మొత్తంగా 103 పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొలంబోలో జరిగే నిర్ణయాత్మక రెండో టెస్టు నుంచి అతడిని తప్పిస్తాడనే ప్రచారం జరుగుతోంది. కుల్దీప్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ అరంగేట్రం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కుల్దీప్ గురించి స్పందించాడు. ‘‘టెస్టు మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లను ఆడించినపుడు ఎవరో ఒకరికి తక్కువ ఓవర్లు వస్తాయి. దీనర్థం ఆ బౌలర్ సరిగ్గా ఆడటం లేదని కాదు. కుల్దీప్ను హెచ్చరించాను ఎవరిని ఎప్పుడు పంపాలనేది కెప్టెన్, మేనేజ్మెంట్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక సమయంలో ఈ బౌలర్ వద్దు అని అనుకుంటే.. అతడిని పక్కనపెట్టి వేరే వాళ్లతో బౌలింగ్ చేయిస్తారు. నేను కుల్దీప్తో మాట్లాడాను. వికెట్లు తీయాలనే తొందరతో కాకుండా.. పొదుపుగా బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టమని, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వమని చెప్పాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు. ఐదుగురు ఉంటే మంచిదే అదే విధంగా.. ఐదుగురు బౌలర్లను ఆడించడంపై స్పందిస్తూ.. ‘‘టస్టు మ్యాచ్‌లో వెయ్యి పరుగులు చేసినా.. ఆ స్కోరుతో గెలుస్తామనే గ్యారెంటీ ఉండదు. అయితే, అదే మ్యాచ్‌లో మనం 20 వికెట్లు కూల్చినట్లయితే గెలుస్తామనే నమ్మకమైనా వస్తుంది. ఫ్లాట్ పిచ్‌లపై మాత్రం బౌలర్లు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మా జట్టులో ఐదుగురు ప్రాపర్ బౌలర్లు ఉండటం సానుకూలాంశం. కాబట్టి పిచ్ పరిస్థితిని బట్టి పేసర్లు, స్పిన్నర్లను మారుస్తూ ఉంటాము. ఐదుగురు బౌలర్లు ఉన్నపుడు రక్షణాత్మక ధోరణిలో కాకుండా.. ప్రభావం చూపే విధంగా ఆడటం సాధ్యమవుతుంది’’

India vs Sri Lanka 2nd Test: భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని రెండవ, చివరి మ్యాచ్ ఆగస్టు 23, అంటే ఈ ఆదివారం, కొలంబో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిస్తే, సిరీస్ సొంతమవుతుంది. మరోవైపు, శ్రీలంక గెలిస్తే, సిరీస్ 1-1 డ్రాగా ముగుస్తుంది. అందువల్ల, ఇరు జట్లు గెలవాలనే ఉద్దేశంతోనే మైదానంలోకి దిగుతాయి. అయితే, ఈ మ్యాచ్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉండగా, శ్రీలంక జట్టులో రెండు ముఖ్యమైన మార్పులు జరిగాయి. రెండో టెస్టుకు శ్రీలంక జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లు దూరమైతే, వారి స్థానంలో ఇద్దరు ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా కుసల్ మెండిస్ చివరి టెస్టుకు దూరమైతే, ఐసీసీ నిబంధనల వల్ల దినేష్ చండిమాల్ కూడా చివరి టెస్టు ఆడలేడు. అందువల్ల, అతని స్థానంలో కమీల్ మిశ్రా, ఆల్‌రౌండర్ సహాన్ అరాచీలను జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన పతుమ్ నిస్సంక కూడా రెండో టెస్టులో ఆడతాడో లేదో సందేహాస్పదంగా ఉంది. ఎక్కువమంది చదివినది: ఏడాది పాటు నిషేధం.. కట్‌చేస్తే.. 11 ఫోర్లు, 11 సిక్సర్లు.. 72 బంతుల్లో రికార్డుల ఊచకోత..! వాస్తవానికి, కుసల్ మెండిస్ తొడ కండరాల గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమయ్యాడు. అయితే, అతను రెండో టెస్టు మ్యాచ్‌కు ఫిట్‌గా ఉంటాడని భావించారు, కానీ అలా జరగలేదు. అందుకే, అతన్ని జట్టు నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా, గాలే టెస్టు మ్యాచ్ సందర్భంగా దినేష్ చండిమాల్ గాయపడ్డాడు. అందుకే, కంకషన్ రీప్లేస్‌మెంట్‌గా పసిందు సూర్యబందరను జట్టులోకి తీసుకున్నారు. ఐసీసీ కంకషన్ నిబంధనల ప్రకారం, దినేష్ రెండో మ్యాచ్‌లో ఆడలేడు. ఎందుకంటే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాడు కనీసం ఏడు రోజుల పాటు జట్టులో ఆడలేడు. అందువల్ల

ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. కుల్దీప్ యాదవ్‌ను పూర్తిగా నమ్మడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాడు. ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తొలి టెస్టులో కుల్దీప్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న గాలే పిచ్‌పై కూడా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే కుల్దీప్కు తగినంత బౌలింగ్ అవకాశాలు ఇవ్వకపోవడమే అతడి వైఫల్యానికి కారణమని అశ్విన్ పేర్కొన్నాడు. ‘జడేజా ఒక వైపు, సుతార్ మరోవైపు వికెట్లు తీస్తున్నారని అందరూ ప్రశ్నిస్తారు. కానీ కుల్దీప్ మూడో స్పిన్నర్. నేను, జడేజా ఆడుతున్నప్పుడు కూడా అతడు మూడో స్పిన్నర్‌గానే ఉండేవాడు. ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదు. 11 మంది ఉన్న జట్టులో మూడో లేదా నాలుగో స్పిన్నర్‌గా ఉండటం అంత సులభం కాదు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ‘కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు కుల్దీప్ యాదవ్ ప్రాధాన్యత కలిగిన బౌలర్ కాకపోవచ్చు. కుల్దీప్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతడు తన నైపుణ్యాన్ని కోల్పోయాడా? అంటే అస్సలు కాదు. చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా అతడిని సరిగ్గా ఉపయోగించలేదు. ఇది ఆటగాడి తప్పు కాదు. ఇది ప్లేయర్‌పై మేనేజ్మెంట్కు నమ్మకం లేదనడానికి ఒక సంకేతం. అతడికి

శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో గిల్ రెండుసార్లు ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభం కానుంది. ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో బంతి లైన్‌ను పూర్తిగా కవర్ చేయడంలో గిల్ ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ను లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఏకంగా 11 సార్లు ఔట్ చేశారు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ నెట్స్‌లో గిల్ ప్రత్యేకంగా లెఫ్టార్మ్ స్పిన్‌ను ఎదుర్కొన్నాడు. మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక బౌలర్ల బంతులను కూడా చాలాసేపు ఆడాడు. గిల్ సాధనపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే స్పందిస్తూ.. పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునేందుకు గిల్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. ‘అతని ఆటలో సహజంగానే పరుగుల ప్రవాహం ఉంటుంది. పిచ్ పరిస్థితులు, బంతి వేగం, ఎలాంటి షాట్లు ఆడాలి, ఎలా డిఫెన్స్ చేయాలనే విషయాలను గమనిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ తన సహజ ఆటతీరునే

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు కొలంబోలో ఘనమైన ఆతిథ్యం లభించింది. పర్యటనలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు ముందు, శ్రీలంకలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా ఇరు దేశాల జట్లకు విందు ఏర్పాటు చేశారు. కొలంబోలోని ఇండియా హౌస్‌లో నిన్న రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. రెండో టెస్టుకు సన్నద్ధమవుతున్న భారత, శ్రీలంక ఆటగాళ్లు ఈ విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం గురించి బీసీసీఐ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. "కొలంబోలో ఇదొక చిరస్మరణీయ సాయంత్రం! రెండో టెస్టుకు ముందు శ్రీలంకలో భారత హైకమిషనర్ సంతోష్ ఝా, టీమిండియాకు ఇండియా హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు" అని పేర్కొంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకుంది.భారత హైకమిషనర్ సంతోష్ ఝా కూడా ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు. "టీమిండియాకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్న టీమిండియా, శ్రీలంక జట్లకు ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇరు దేశాలను కలిపి ఉంచే క్రికెట్, భారత్-శ్రీలంక మధ్య ఉన్న చిరకాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉంది" అని ఆయన తన 'ఎక్స్' పోస్టులో తెలిపారు.సిరీస్‌లో భారత్ ఆధిక్యంప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై 165 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టెస్టు

Shubman Gill Comments on India Test Victory: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బౌలింగ్‌లో స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని 284 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో లభించిన 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైనా శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో లంక జట్టు 206 పరుగులకే కుప్పకూలడంతో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పడిక్కల్ క్లాస్.. మానవ్ సుతార్ స్పిన్ మ్యాజిక్.. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ గిల్ మాట్లాడుతూ జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బతీశాడని, అతనికి భారత జట్టులో గొప్ప భవిష్యత్తు ఉందని కొనియాడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రత్యర్థి స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించిన పడిక్కల్ ఆటతీరు అమోఘమని గిల్ పేర్కొన్నాడు. పడిక్కల్ ఇలాంటి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తే జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడం సులువవుతుందని వివరించాడు. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? రెండో ఇన్నింగ్స్ వికెట్ల పతనంపై క్లారిటీ.. 600వ టెస్టు సంబరం.. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ వ్యూహాత్మక వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని కారణంగా ప్రత్యర్థి ముందు వీలైనంత వేగంగా 400 పైచిలుకు లక్ష్యం ఉంచాలనే ఆలోచనతోనే బ్యాటర్లు దూకుడుగా ఆడారని స్పష్టం చేశాడు. అప్పటికే మ్యాచ్ భారత్ నియంత్రణలోనే

SL vs IND 2nd Test: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. గాలే టెస్టులో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించడంతో టీమ్ మేనేజ్మెంట్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మరో అవకాశం దక్కనుంది. అలాగే మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ సొంతమవుతుంది కాబట్టి అదే జట్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంచ్‌కే పరిమితం కానున్న నలుగురు ఆటగాళ్లు.. విన్నింగ్ టీమ్‌ను యథాతథంగా కొనసాగిస్తే జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు రెండో టెస్టులోనూ రిజర్వ్‌గా మిగిలిపోనున్నారు. బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో వీరికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? తొలి టెస్టులో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తమ స్పిన్ మ్యాజిక్‌తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ వేగంతో రాణించనున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

గాలే క్రికెట్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం పడే సూచనలు స్పష్టంగా కనిపించాయి. దీంతో మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, అప్పుడు శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు భారత యంగ్ ప్లేయర్. అద్భుతమైన బౌలంగ్ తో భారత యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాచ్ ను ముగించాడు. వర్షం పడటానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు, సుతార్ భారత్ టీమ్ కు అద్భుతమైన సెలబ్రేషన్స్ అందించాడు. విదేశీ గడ్డపై తనకు తొలి 6 వికెట్ల హాల్ అందించిన మ్యాచ్ విన్నింగ్ బంతిని తీసుకున్నాడు. కేషర నువాంతను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు 165 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు బ్యాటర్ల ముందు కొన్ని కఠినమైన ప్రశ్నలు ఉంటాయి. ఎంతసేపు క్రీజులో నిలబడగలరు? అవుట్‌సైడ్ ఎడ్జ్ కాకుండా బంతిని ఎలా మిస్ చేయాలి? డిఫెన్సివ్ మైండ్‌సెట్‌తో రోజంతా బ్యాటింగ్ చేయడం సాధ్యమేనా? ఇవన్నీ ఆలోచిస్తేనే ఏ బ్యాటర్‌కైనా ఒత్తిడి పెరుగుతుంది. పాజిటివ్ నోట్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ధనంజయ డిసిల్వా, సోనాల్ దినూష మొదట్లో బాగానే నిలబడ్డారు. పిచ్‌పై స్పిన్‌కు పెద్దగా తిరుగుడు లేకపోవడంతో బ్యాటింగ్ చేయడం కాస్త ఈజీగానే అనిపించింది. రోజు ప్రారంభమయ్యే సమయానికి బంతి 34 ఓవర్ల పాతదిగా, కాస్త సాఫ్ట్‌గా మారింది. లంకకు ఇది కాస్త హోప్స్ ఇచ్చింది. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో పాత బంతితోనే కోలుకున్నారు. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తే భారత్‌ను ఇబ్బంది పెట్టవచ్చని అనుకున్నారు. మొదటి గంటన్నర పాటు శ్రీలంక ప్లాన్ ప్రకారమే ముందుకు సాగింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా స్పిన్‌ను సరిగ్గా ఆడలేక రెండుసార్లు మాత్రమే పొరపాటు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తప్పు

శ్రీలంకపై తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అదరగొట్టాడు. తన రెండో టెస్టులోనే ఏకంగా 10 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ అద్భుత ప్రదర్శన వెనుక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. శ్రీలంక పరిస్థితులకు త్వరగా అలవాటు పడేందుకు ఇంట్లోనే కూకాబుర్రా బంతితో సాధన చేసినట్లు సుతార్ వెల్లడించాడు.గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయానికి సుతార్ బౌలింగ్ ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో సుతార్ 55 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌లో మొత్తంగా 101 పరుగులకు 10 వికెట్లు సాధించాడు. రెండో టెస్టు ఆడుతున్న 22 ఏళ్ల సుతార్‌కు ఇది అద్భుతమైన ప్రదర్శన.ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత తన దృష్టంతా కూకాబుర్రా బంతికి అలవాటు పడటంపైనే పెట్టినట్లు సుతార్ తెలిపాడు. నెట్స్‌లోనే కాకుండా ఇంట్లో కూడా ఆ బంతితో సాధన చేశానని చెప్పాడు.‘‘క్రికెట్‌ను నేను చాలా సీరియస్‌గా తీసుకుంటా. రోజురోజుకూ మెరుగుపడటమే నా లక్ష్యం. శ్రీలంక సిరీస్‌కు ముందు వీలైనంత ఎక్కువగా కూకాబుర్రా బంతితో ప్రాక్టీస్ చేశా. ఇంట్లో, నెట్స్‌లో సాధన చేశా. ఇన్‌హౌస్ గేమ్స్‌పైనా దృష్టి పెట్టా’’ అని సుతార్ చెప్పాడు.టెస్టుకు 10 రోజుల ముందే భారత జట్టు శ్రీలంకకు చేరుకోవడం తనకు బాగా ఉపయోగపడిందని సుతార్ తెలిపాడు. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఆ సమయం ఎంతో

టీమిండియా డ్రెసింగ్ రూమ్ వాతావరణంపై తాజాగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకునే విషయంలో ఆటగాళ్లకు సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు. స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు సాధించిన యువ స్పిన్నర్ మానవ్ సుతర్ టీమిండియా విజయంలో కీలక పాత్ర షోపించాడు. అతడి పాటు బ్యాటింగ్ విభాగంలో దేవదత్ పటిక్కల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి.. భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెసింగ్ రూమ్ పరిస్థితులపై తాజాగా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకోవడంలో సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు. మీడియాతో రాహుల్ మాట్లాడుతూ...'దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్ వంటి యువ ఆటగాళ్లు తక్కువ సమయంలో అద్భుత ప్రదర్శన చేసి.. మంచి గుర్తింపు సంపాదించడం చూసి ఒక సీనియర్ ఆటగాడిగా నేను ఎంతో సంతోషించాను. భారత డ్రెస్సింగ్ రూమ్ ఒక స్వేచ్ఛా యుతమైన వాతావరణంగా ఉంటుంది. ఇక్కడ ఆటగాళ్లను స్వేచ్ఛగా మాట్లాడటానికి, వారి అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి అవకాశం ఉంటుంది. వయస్సుతో ఆడిన మ్యాచులతో సంబంధం లేకుండా తోటి ఆటగాళ్లకు సహాయం చేయడం ప్రతి ప్లేయర్ బాధ్యత అని నేను భావిస్తున్నాను' అని రాహుల్ అన్నాడు. 'కొన్ని సందర్భాల్లో మా జట్టులో సీనియర్ ప్లేయర్లు, తక్కువ మ్యాచులు ఆడిన జూనియర్ ఆటగాళ్లు ఉంటారు. ఆ సమయంలో 'నేను నీ దగ్గర ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు' అని సీనియర్ ఆటగాళ్లు , 'అతను చాలా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు కాబట్టి నేను వెళ్లి అతనితో మాట్లాడలేను' అని యువ ఆటగాళ్లు ఏదైనా చెప్పేందుకు సంకోచించరు. మా ఆటగాళ్ల మధ్య ఎటువంటి సిగ్గు లేదా అహంభావం

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. అయితే, ఈ గెలుపు ఉత్సాహంలో ఉన్నప్పటికీ, జట్టు కూర్పుపై యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్.. కొలంబోలో జరగబోయే రెండో టెస్టుకు జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో కుల్దీప్ యాదవ్ తేలిపోయాడు. 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ వంటి ఇతర లెఫ్టార్మ్ స్పిన్నర్లు అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో, కుల్దీప్ను పక్కనపెట్టి, అతడి స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సరాన్ష్ జైన్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం.తొలి టెస్టులో భారత్ ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లతో (జడేజా, సుతార్, కుల్దీప్) బరిలోకి దిగింది. అయితే శ్రీలంక జట్టులో ఉన్న ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడానికి ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఉంటే జట్టుకు వైవిధ్యం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే సరాన్ష్ జైన్‌ను సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇప్పుడు అతడిని తుది జట్టులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.అయితే, ఈ మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ దీనిపై స్పందిస్తూ

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోలేకపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో పట్టికలో భారత్ పరిస్థితి ఏమిటంటే... స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి రోజు ఆటలో 206 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6/55తో చెలరేగిన సుతార్, మ్యాచ్ మొత్తంలో 10/131 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ భారీ విజయం సాధించినప్పటికీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకోలేకపోయింది. గత వారం డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో, వారు నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుత డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇంకా 8 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టుతో పాటు, నవంబర్‌లో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, తదుపరి స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆడిన 10 టెస్టుల్లో నాలుగింటిలో ఓటమి చవిచూసిన టీమిండియాకు ఇకపై ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. ఎలాంటి పెనాల్టీ పాయింట్లు లేకుంటే, భారత్ తన మిగిలిన 8 టెస్టుల్లో 7 గెలిస్తే 68.52 శాతంతో (PCT) మెరుగవుతుంది. ఒకవేళ 6 విజయాలు, 2 ఓటములు నమోదైతే ఆ శాతం 62.96కి పడిపోతుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూకట్పల్లి రైతుబజార్లో నేటి ధరల వివరాలివే.. ఇరాన్‌కి సహాయం చేస్తే.. ఆర్థిక మూల్యం తప్పదు: ట్రంప్

IND vs SL: గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ఈ విభాగాన్ని నడిపించారు. యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఏకంగా 10 వికెట్లు తీసి మ్యాచ్ విజేతగా నిలిచాడు. జడేజా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. తిరుగులేని స్పిన్ పిచ్‌పై కూడా కుల్దీప్ యాదవ్ మాత్రం పూర్తిగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 25 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ 103 పరుగులిచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు. ఇండియా టుడే నివేదికల ప్రకారం ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ స్థానంలో సారాంశ జైన్‌కు అవకాశం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 33 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ద్వారా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ బలాన్ని కూడా పెంచవచ్చని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. సారాంశ జైన్ తన అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వార్త క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇది కూడా చదవండి: SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..! మధ్యప్రదేశ్‌కు చెందిన సారాంశ జైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 188 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్‌తో 2223 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021-22 సీజన్లో మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో సారాంశ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో 13 వికెట్లు తీయడంతో పాటు ఫైనల్లో 57 పరుగుల అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాతి సీజన్లో 360 పరుగులు

Kuldeep Yadav Bowling Stats: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత బౌలర్లు సమిష్టిగా రాణించినప్పటికీ, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న సమయంలోనూ కుల్దీప్ తన మాయాజాలాన్ని ప్రదర్శించలేక చేతులెత్తేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు 14 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 65 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడి ఎకానమీ రేటు 4.64గా నమోదు కావడం గమనార్హం. టెస్టు ఫార్మాట్లో ఒక స్పిన్నర్ ఇంత భారీగా పరుగులు ఇచ్చుకోవడం జట్టు యాజమాన్యాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అతడి బౌలింగ్‌ను శ్రీలంక బ్యాటర్లు చాలా సులువుగా ఎదుర్కొన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తప్పుల నుంచి కుల్దీప్ యాదవ్ ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదు. రెండో ఇన్నింగ్స్‌లో అతడి ప్రదర్శన మరింత నిరాశపరిచింది. మ్యాచ్ నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో అతడు 11 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇందులో 3.45 ఎకానమీతో 38 పరుగులు ఇచ్చాడు కానీ, ఒక్క బ్యాటర్‌ను కూడా పెవిలియన్ పంపలేకపోయాడు. ఒకవైపు మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతుంటే, కుల్దీప్ మాత్రం శ్రీలంక ఆటగాళ్లకు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. వికెట్ల వేటలో విఫలమవడమే కాకుండా ఇలా పరుగులు సమర్పించుకోవడం మైదానంలో జట్టుపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ స్థానానికి తీవ్ర ముప్పు వాటిల్లింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, శ్రీలంకతో త్వరలో జరగనున్న రెండో టెస్టు తుది జట్టు నుంచి అతడిని తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బెంచ్‌పై ఉన్న ఇతర స్పిన్నర్లకు

IND vs SL: గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ చేతిలో 165 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న శ్రీలంకకు ఆ తర్వాతి రోజే కోలుకోలేని షాక్ తగిలింది. ఆగస్టు 23 నుంచి జరగబోయే ఆఖరి టెస్టుకు జట్టులోని కీలక ప్లేయర్లు అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పటికే గాయాలతో ఇబ్బంది పడుతున్న కుసల్ మెండిస్, పథుమ్ నిస్సాంక బాటలోనే సీనియర్ బ్యాటర్ దినేష్ చండీమాల్ కూడా రెండో టెస్టు నుంచి తప్పుకున్నట్లు హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అధికారికంగా ప్రకటించారు. తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో దినేష్ చండీమాల్ తల, మెడ భాగానికి తీవ్ర గాయమైంది. గ్రౌండ్‌లోనే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడి స్థానంలో పాసిందూ సూర్యబండారను కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దించారు. ఇదే క్రమంలో పాసిందూ టెస్టు అరంగేట్రం కూడా జరిగింది. గాయం తీవ్రత తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు చండీమాల్ను రెండో టెస్టు నుంచి తప్పించారు. అతడితో పాటు తొడకండరాల గాయంతో బాధపడుతున్న కుసల్ మెండిస్, మణికట్టు గాయంతో ఉన్న ఓపెనర్ పథుమ్ నిస్సాంక ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యారు. గాయాలపై హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ స్పందిస్తూ మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. "కుసల్ మెండిస్ తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు, అతడు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. చండీమాల్ కూడా తదుపరి టెస్టుకు అందుబాటులో లేడు. సీనియర్ ఆటగాళ్లను మిస్ అవ్వడం జట్టుకు పెద్ద లోటే అయినప్పటికీ, ఇది యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి లభించిన అద్భుతమైన అవకాశం" అని కిర్‌స్టన్ పేర్కొన్నారు. మొదటి టెస్టులో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత శతకంతో మెరిశాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ కాగా, భారత


Mohammed Siraj Injury: బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో లంక పర్యటనలో పేస్ బాధ్యతలను సిరాజ్ తన భుజాలపై వేసుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గంభీర్ కేవలం ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగారు. అయితే మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ వేగం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఐదో రోజు తొలి సెషన్లో అతను కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో అతని అత్యధిక వేగం 132.8 కిలోమీటర్లు మాత్రమే కావడం గమనార్హం. మ్యాచ్ మొత్తం మీద సగటున 126 కిలోమీటర్ల వేగంతోనే బంతులు విసిరాడు. దీన్ని బట్టి అతను వంద శాతం ఫిట్‌గా లేడని, ఏదో నొప్పితో బాధపడుతున్నాడని దొడ్డ గణేశ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మామూలుగా అయితే సిరాజ్ ఇంత నెమ్మదిగా బౌలింగ్ చేయడని ఆయన గుర్తుచేశారు. సిరాజ్ ఫిట్‌నెస్‌పై వస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), బీసీసీఐ మెడికల్ టీమ్ పనితీరును బోనులో నిలబెడుతున్నాయి. శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు సిరాజ్ చాలా రోజుల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే గడిపాడు. అప్పుడే అతని గాయం గురించి వైద్యులకు తెలియలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉంటున్న ఈ స్టార్ బౌలర్ కెరీర్‌ను ప్రమాదంలో పడేసేలా మేనేజ్మెంట్ వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? Is Siraj carrying a niggle? This isn’t the pace he usually bowls #SLvIND — Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 19, 2026 గాలే టెస్టులో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో

India vs Sri Lanka: భారత్ గాలే టెస్టులో 372 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. చివరి రోజు ఆతిథ్య జట్టు బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ భారత బౌలర్లకు గట్టి పరీక్ష పెట్టారు. దినుషా 84, ధనంజయ డి సిల్వా 59 పరుగులతో పోరాడారు. వీరిద్దరి మధ్య 95 పరుగుల భాగస్వామ్యం శ్రీలంకకు ఆశలు రేపింది. మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో గాలే పిచ్‌పై బ్యాటింగ్ అంత సులువు కాకపోవడంతో ప్రతి వికెట్ కోసం భారత్ శ్రమించాల్సి వచ్చింది. చివరికి భారత బౌలింగ్ లోతు ఫలించింది. మానవ్ సుతార్ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. సుతార్ ప్రదర్శన ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ తరఫున శ్రీలంకపై టెస్టులో 10 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతడు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. శ్రీలంకలో భారత బౌలర్ అత్యుత్తమ మ్యాచ్ బౌలింగ్ గణాంకాల్లో సుతార్ 10/131తో అగ్రస్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ ఈ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, భారత్ తరఫున చాలా కాలం ఆడగల సామర్థ్యం అతడిలో కనిపిస్తోందని గిల్ పేర్కొన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పాదిక్కల్ 167 పరుగులు చేయడం ఆ స్కోరుకు ప్రధాన బలంగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకే పరిమితమైనా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా శ్రీలంక ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో పిచ్ ఐదో రోజు వరకు ఆటకు అనుకూలంగానే ఉన్నా, మూడో రోజు నుంచి స్పిన్‌కు ఎక్కువగా సహకరించింది. పాదిక్కల్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎడమచేతి వాటం బ్యాటర్లకు ఎడమచేతి స్పిన్నర్లను ఎదుర్కోవడం కొంత సులభంగా అనిపించిందని చెప్పాడు. ఈ విజయంతో భారత్
గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 165 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు కుప్పకూలింది. మానవ్ సుతార్ ఐదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. దీంతో రెండు మ్యాచుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు మొదటి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే పరిమితం చేశారు. దీంతో 178 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని భారత్ సొంతం చేసుకుంది. తొలి రోజు నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. చివరి వరకూ అదే జోరు కొనసాగించింది.రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 193 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌తో కలిసి శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య శ్రీలంక.. 206 పరుగులకు కుప్పకూలింది. నాలుగో రోజే కీలక వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా పయనించిన శ్రీలంక, ఆఖరి రోజున మిగిలిన వికెట్లను కూడా చకచకా సమర్పించుకుంది. దీంతో 165 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా స్పిన్నర్ మానవ్ సుతార్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచులో అతడు 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.తన 600వ టెస్ట్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించి.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్‌కు కీలకమైన 12 పాయింట్లు దక్కాయి. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మానవ్ సుతార్ ఫైఫర్ (6/55) నమోదు చేశాడు. శ్రీలంక బ్యాటర్లలో సోనాల్ దినుష (84), ధనంజయ డిసిల్వా (59) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6, ప్రసిద్ధ్ కృష్ణ 2.. సిరాజ్, జడేజా చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 193 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మారనప్పటికీ.. పర్సంటేజీని మాత్రం బాగా పెంచుకుంది. ప్రస్తుతం 53.33 శాతంతో ఐదో స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మరోసారి అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో (76వ) మూడు వికెట్లు తీశాడు. సోనాల్ దినుష (84), ప్రభాత్ జయసూర్య (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన అతడు.. ఓవర్ చివరి బంతికి లాహిరు కుమార (0)ను పెవిలియన్‌కు చేర్చాడు. సోనాల్ క్యాచ్‌ను స్లిప్‌లో ధ్రువ్ జురెల్ అందుకొన్నాడు. ప్రభాత్ జయసూర్య బౌల్డ్ అయ్యాడు. ఇక లాహిరు ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ పంత్ అందుకొన్నాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 199/9. శ్రీలంక బ్యాటర్లు వికెట్ ఇవ్వకుండా పట్టుదల ప్రదర్శిస్తున్నారు. భారత బౌలర్లు మాత్రం శతవిధాలా ఏడో వికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఆరు ఓవర్లపాటు ఆట జరిగింది. కేశర నువాంత (12*), సోనాల్ దినుష (80*) మాత్రం

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (6/55) అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగడంతో టీమిండియా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఖాతాలో 12 కీలక పాయింట్లను జమ చేసుకుంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం, గాలే స్టేడియానికి 50వ టెస్టు కావడం ఈ విజయానికి మరింత ప్రత్యేకతను చేకూర్చింది.నేడు ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన శ్రీలంక 77.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్ అయింది. లంచ్ విరామం తర్వాత శ్రీలంక బ్యాటర్లు సోనాల్ దినుష, కేశర నువంత కొద్దిసేపు భారత బౌలర్లను నిలువరించారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన దినుష (84) మరోసారి అద్భుతంగా ఆడి, రెండో సెంచరీ దిశగా సాగుతున్నట్లు కనిపించాడు. ఈ దశలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమోననిపించింది.అయితే, యువ కెరటం మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 76వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సుతార్, ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించాడు. ఆ ఓవర్లో దినుషను లెగ్ గల్లీలో ధ్రువ్ జురెల్ క్యాచ్ ద్వారా ఔట్ చేసి కీలక భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాతి బంతికే ప్రభాత్ జయసూర్యను క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యాట్రిక్ బంతిని లహిరు కుమార ఎదుర్కొన్నప్పటికీ

India vs Sri Lanka 1st Test : శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత జట్టు 165 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 462 పరుగులు చేసింది. శ్రీలంక 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 193 పరుగులు చేసి.. శ్రీలంక జట్టుకు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, లంక బ్యాటర్లు లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. కేవలం 206 పరుగులు మాత్రమే చేయగలిగారు. శ్రీలంక జట్టు ఓటమిలో టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక భూమిక పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు పడగొట్టిన సుతార్.. రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టాడు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 10 వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటర్లు భారీ పరుగులు చేయకుండా తన స్పిన్ మాయాజాలంతో అడ్డుకట్ట వేశాడు

శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా గెలుపు దిశగా మరింత పట్టు బిగించింది. గాలెలో బుధవారం నాటి ఆఖరి రోజు ఆటలో భోజన విరామ సమయానికి విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. కాగా ఓవర్‌నైట్ స్కోరు 84/4తో బుధవారం ఆట మొదలుపెట్టిన శ్రీలంకకు.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష జోడీ ఊపిరిలూదింది. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ ధనంజయ, సొనాల్ దినుష అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి జోడీని విడదీసేందుకు టీమిండియా బౌలర్లు మంగళవారం నుంచి విఫలయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. జిడ్డులా క్రీజులో పాతుకపోగా.. ఈ క్రమంలో సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఎట్టకేలకు ఈ పని పూర్తి చేశాడు. ధనంజయ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కూడా జిడ్డులా క్రీజులో పాతుకపోగా.. జడ్డూ 56వ ఓవర్లో రెండో బంతిని షాట్ ఆడేలా అతడిని ఊరించాడు. ఈ క్రమంలో బ్యాట్ టాప్ ఎడ్జ్‌ను తాకిన బంతి గాల్లోకి లేవగా.. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మానవ్ సుతార్ క్యాచ్ పట్టాడు. జడ్డూ వైల్డ్ సెలబ్రేషన్ దీంతో ధనంజయ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 151 బంతులు ఎదుర్కొన్న అతడు 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. కాగా ధనంజయ, దినుష కలిసి ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించగా.. జడ్డూ ఎట్టకేలకు ఈ జంటను విడదీసి భారీ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. దీంతో టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి. జడ్డూ సైతం వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. లంచ్ బ్రేక్ సమయానికి దినుష 65, కేశారా నువాంత 8 పరుగులతో ఉన్నారు. లంక విజయానికి ఇంకా 197 పరుగులు కావాలి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం సంపాదించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా

శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రికార్డుల వేట కొనసాగించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే సమయంలో ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 69 బంతుల్లో 66 పరుగులు సాధించి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను పంత్ దాటేశాడు.మొదటి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్ 66 పరుగులతో కలిపి డబ్ల్యూటీసీలో తన మొత్తం పరుగుల సంఖ్యను 2,885కి చేర్చుకున్నాడు. గిల్ (2,867 పరుగులు) కంటే పంత్ ప్రస్తుతం 18 పరుగులు ముందంజలో ఉన్నాడు. గాలే టెస్టులో గిల్ కేవలం 16, 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇద్దరూ 41 డబ్ల్యూటీసీ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, పంత్ 73 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డు సాధించాడు. గిల్ మాత్రం ఇందుకు 75 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (2,716), రవీంద్ర జడేజా (2,632), విరాట్ కోహ్లీ (2,617) తదుపరి స్థానాల్లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లోనే పంత్ మరొక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో లహిరు కుమార బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదడం ద్వారా టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన కేవలం నాలుగో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.డబ్ల్యూటీసీలో పంత్ ఇప్పటివరకు 6 సెంచరీలు, 17 అర్ధసెంచరీలు బాదాడు. ఇందులో అతడు అత్యుత్తమ స్కోరు 146 పరుగులు కాగా, సగటు 41.81గా ఉంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూటీసీ అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ (77 మ్యాచ్‌ల్లో 6,651 పరుగులు) పేరిట ఉంది. దీంతో ఎవరికీ అందనంత

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం నీటిపాలు కాక తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్ట్ క్రికెట్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఐదో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా లేదా ఆట పూర్తి కాకుండా ఆగిపోతే, ఆ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తారు. భారత్ గెలుపునకు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ, లేదా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ అది పరిగణనలోకి తీసుకోరు. వికెట్లు లేదా పరుగులు మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆట పూర్తవ్వకపోతే విజేతను ప్రకటించే అవకాశం ఐసీసీ నిబంధనల్లో లేదు. ఫలితంగా టీమిండియా విజయం సాధించే అవకాశాలు పూర్తిగా నీరుగారిపోతాయి. ఇది కూడా చదవండి: Watch: గాలే టెస్ట్‌లో తీవ్ర వివాదం.. ధ్రువ్ జురెల్ క్యాచ్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజమేంటి? చరిత్రలో లేని రికార్డును శ్రీలంక అందుకుంటుందా? గాలే మైదానంలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 342 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజ్ చేయలేదు. ఆ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. సొంత మైదానంలో శ్రీలంక ఇప్పటివరకు 300 పరుగుల మార్కును కూడా విజయవంతంగా ఛేజ్ చేయలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం లంకకు అసాధ్యమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక, గెలువడానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. ఇది

గాలే వేదికగా లంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ, భారత్ విజయానికి 6 వికెట్లు అవసరం. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వా 31 పరుగులు, సోనాల్ దినూష 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదోరోజు గాలేలో గంటల తరబడి భారీ వర్షం పడితే తప్ప ఆట రద్దుకు ఆస్కారం లేకపోవడంతో, లంక ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తుండడంతో స్పిన్ త్రయం జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్లు వికెట్ల వేటలో పడిపోయారు. ఇదిలా ఉంటే రవీంద్ర జడేజా చర్య పట్ల హెడ్‌కోచ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. నాలుగో రోజు ఆటలో జడేజా బౌలింగ్‌లో లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జడేజా వేసిన చివరి బంతి అద్భుతంగా టర్న్ తీసుకోవడంతో ఏడు పరుగులతో ఆడుతున్న ధనంజయ ఫస్ట్ స్లిప్‌లో సులభమైన క్యాచ్ ఇచ్చాడు. అయితే కీలక వికెట్ పడిందన్న ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు. కొంపముంచిన నో బాల్ ఎందుకంటే జడేజా బంతిని వేసేటప్పుడు క్రీజు దాటి ముందుకు వెళ్లడంతో అంపైర్ దానిని నో బాల్‌గా ప్రకటించడంతో సంబరాలు ఆగిపోయాయి. అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధనంజయ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గంభీర్ ముఖ కవళికల్లో మార్పులు కనిపించాయి. కీలక వికెట్ పడిందన్న సంతోషం క్షణమైనా లేకుండా పోయిందే అన్న తరహాలో గంభీర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. పనిలో పనిగా వికెట్ పడిందనుకున్న చోట జడేజా నో బాల్ కావడంతో అతడిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంభీర్ అసహనం వ్యక్తం

Yashasvi Jaiswal Test Career: శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ నుంచి టీమిండియా ఆశించిన ఇన్నింగ్స్ రాలేదు. రెండు ఇన్నింగ్స్‌లను కలిపి అతడు 32 పరుగులు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన యశస్వి, రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో బౌలర్‌తో ఢీకొన్న సందర్భంలో రనౌట్‌గా పెవిలియన్ చేరడం అతడి ఇన్నింగ్స్‌ను ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సాధారణ బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. కీలక టెస్టు సిరీస్‌లో ఓపెనర్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశించిన వేళ ఈ ప్రదర్శన టీమ్ మేనేజ్మెంట్కు ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది. గాల్ టెస్టుకు ముందు కూడా యశస్వి ఫామ్‌పై ప్రశ్నలు ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌తో ముల్లాంపూర్‌లో జరిగిన టెస్టులో అతడు 24 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 83 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ సిరీస్‌లో ఒక అర్ధశతకం మాత్రం అతడి ఖాతాలో ఉంది. ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..! ఇలా గత మ్యాచ్‌లతో కలిపి ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధశతకం మాత్రమే రావడం యశస్వి టెస్టు స్థానంపై చర్చకు కారణమవుతోంది. టెస్టు క్రికెట్లో భారత జట్టు ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టి సారించినట్లు మూల సమాచారం పేర్కొంటోంది. భారత్, శ్రీలంక రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది. అక్కడ యశస్వి బ్యాట్‌తో ప్రభావం చూపకపోతే అతడి టెస్టు భవిష్యత్‌పై టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్‌చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..! యశస్వి జైస్వాల్‌కు కోలంబో టెస్టు ఎంతో కీలకంగా

Watch: గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా మారింది. నాలుగో రోజు ఆటలో భారత ఫీల్డర్ ధ్రువ్ జురెల్ పట్టిన ఒక వివాదాస్పద క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ రాజేస్తోంది. లంక బ్యాటర్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై నెటిజన్లు రెండుగా చీలిపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. టీ బ్రేక్ తర్వాత లంక ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో 22వ ఓవర్లో అసలు వివాదం మొదలైంది. భారత యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ వేసిన నాలుగో బంతిని లంక బ్యాటర్ లాహిరు ఉదార డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ బయటి అంచుని తాకుతూ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ వైపు వేగంగా దూసుకెళ్లింది. జురెల్ నేలకి అత్యంత సమీపంలో బంతిని అందుకోవడంతో భారత్ గట్టిగా అపీల్ చేసింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు మైదానంలో నిర్ణయం చెప్పకుండా థర్డ్ అంపైర్‌కు రీప్లే నివేదించారు. జూమ్ చేసి చూసిన రీప్లేలో బంతి నేలను తాకినట్లు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, థర్డ్ అంపైర్ దానికి అవుట్‌గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రకటన రాగానే మైదానంలో భారత్ సంబరాలు చేసుకోగా, లంక అభిమానులు నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఈ క్యాచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది టెక్నాలజీ వైఫల్యమని, శ్రీలంకకు అన్యాయం జరిగిందని కొంతమంది వాదిస్తుండగా అది పక్కా క్యాచ్ అని భారత అభిమానులు సమర్థిస్తున్నారు. ఇది కూడా చదవండి: IND vs SL: టీమిండియాది చెత్త ప్లానింగ్ అంటూ కామెంటర్ ఫైర్.. గాలే టెస్ట్‌లో భారత్ చేసిన తప్పు అదేనా? Dhruv Jurel takes the catch on bowling of Manav Suthar. 🇮🇳 — Maina Singh

IND vs SL: శ్రీలంక యువ ఆఫ్ స్పిన్నర్ కేశర నువాంతకు తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. భారత బ్యాటర్ల వీరబాదుడును తట్టుకోలేక ఈ యంగ్ బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లు బౌలింగ్ చేసిన నువాంత ఏకంగా 175 పరుగులు సమర్పించుకున్నాడు. టెస్ట్ డెబ్యూలో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో బౌలర్‌గా అతడు నిలిచాడు. లంక వైపు నుంచి అరంగేట్రంలోనే అత్యంత భారీగా పరుగులు ఇచ్చిన అవాంఛనీయ రికార్డు సూరజ్ రణదీవ్ పేరిట ఉంది. అతడు 2010లో భారత్‌పైనే 222 రన్స్ ఇచ్చాడు. అయితే నువాంత భారీగా పరుగులు ఇచ్చినా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలాంటి ముగ్గురు దిగ్గజ బ్యాటర్ల వికెట్లు పడగొట్టడం కాస్త ఊరటనిచ్చే అంశం. భారత ఇన్నింగ్స్‌లో యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. లంక బౌలర్లను నలువైపులా బాదుతూ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 167 పరుగులు సాధించాడు. వికెట్ కోల్పోయిన ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా కేఎల్ రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత రిషబ్ పంత్‌తో కలిసి మరో 71 పరుగులు జోడించి జట్టు భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు. పడిక్కల్ ఆడిన ఈ క్లాసిక్ ఇన్నింగ్స్ జట్టుకు కొండంత బలాన్నిచ్చింది. ఇది కూడా చదవండి: Devdutt Padikkal Girlfriend: దేవదత్ పడిక్కల్ మనసు దోచిన ఈ భామ ఎవరు?.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ హాఫ్ సెంచరీతో రాణించిన రాహుల్, ధ్రువ్ జురెల్ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి 175 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసాడు. యంగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన ఫార్మ్‌ను కొనసాగిస్తూ 68 బంతుల్లోనే 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు

Victoria 1107 Runs Record: ఆధునిక క్రికెట్లో టీ20ల రాకతో బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు. పదుల సంఖ్యలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వన్డేల్లో 400 పరుగులు, టెస్టుల్లో 700 పరుగులు చేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. సరిగ్గా 99 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక బ్యాట్లు, రక్షణ పరికరాలు లేని కాలంలోనే ఓ జట్టు బౌలర్లపై అత్యంత దారుణంగా దాడికి దిగింది. 1926 డిసెంబర్ 24న ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ దీనికి వేదికైంది. ఆ రోజు విక్టోరియా బ్యాటర్లు ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక మహా రికార్డుగా మిగిలిపోయింది. విల్ వుడ్‌ఫుల్ సారథ్యంలోని ఆ జట్టు ఏకంగా 1107 పరుగులు బోర్డుపై ఉంచి కనీవినీ ఎరుగని చరిత్ర సృష్టించింది. ఒకే ఇన్నింగ్స్‌లో వెయ్యికి పైగా పరుగులు చేయడం భవిష్యత్తులోనూ ఏ జట్టుకు సాధ్యపడకపోవచ్చు. ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన పోన్స్‌ఫోర్డ్.. న్యూ సౌత్ వేల్స్ బౌలర్లకు ఆ మ్యాచ్ ఒక పీడకల లాంటిది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విక్టోరియా కెప్టెన్ బిల్ వుడ్‌ఫుల్ (133) పరుగుల వరదకు పునాది వేశాడు. అతనికి తోడుగా వచ్చిన మరో ఓపెనర్ బిల్ పోన్స్‌ఫోర్డ్ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 36 ఫోర్లు బాది 352 పరుగులతో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్క్ హెండ్రీ 100 పరుగులు సాధించగా, నాలుగో నంబర్ బ్యాటర్ జాక్ రైడర్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు

IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు భారత బ్యాటర్ల తీరుపై ప్రముఖ క్రికెట్ కామెంటర్ హర్షా భోగ్లే తీవ్ర విమర్శలు గుప్పించారు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ డిక్లేర్ చేయడంలో ఆలస్యం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా శ్రీలంక విజయానికి 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంకను ఆలౌట్ చేసేందుకు వీలుగా త్వరగా డిక్లేర్ చేయకుండా భారత్ సమయం వృథా చేసిందని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డారు. చివరి 40 నిమిషాల ఆటలో జట్టు అనుసరించిన విధానం తనకు అస్సలు అర్థం కాలేదని సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నప్పుడు బౌలర్లకు ఎక్కువ సమయం కేటాయించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత టాప్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే 69 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. పంత్‌తో పాటు దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు. మిగిలిన బ్యాటర్లందరూ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ అనుకున్న స్థాయిలో పరుగుల పసిడి సాధించలేకపోయింది. మైదాన సిబ్బంది కవర్లతో సిద్ధంగా ఉన్న దృశ్యాలను గుర్తు చేస్తూ వర్షం పడితే గెలుపు అవకాశాలు చేజారిపోతాయని భోగ్లే హెచ్చరించారు. ఇది కూడా చదవండి: IND vs SL: ఇజ్జత్ అంతా పాయే.. డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్ మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగొచ్చిన కర్ణాటక యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ఫార్మ్‌తో

Ravindra Jadeja No Ball: భారత్, శ్రీలంక మధ్య గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా అద్భుతంగా విసిరాడు. బంతి వేగంగా తిరిగి ధనంజయ డి సిల్వా బ్యాట్ అంచును తాకింది. తొలి స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో భారత ఆటగాళ్లు వికెట్ సంబరాల్లో మునిగిపోయారు. ధనంజయకు ఇక క్రీజులో అవకాశం లేదనుకున్న సమయంలో అంపైర్ నో-బాల్ ప్రకటించడంతో అంతా షాకయ్యారు. రీప్లేలో జడేజా పాదం పాపింగ్ క్రీజ్ దాటి ఉన్నట్లు కనిపించింది. దీంతో శ్రీలంక కెప్టెన్‌కు అనుకోని లైఫ్ దక్కింది. ఈ బంతి జడేజా సాధారణంగా వేసే బంతులకు భిన్నంగా ఉంది. వేగంగా తిరిగిన బంతి బ్యాట్ మధ్యభాగాన్ని తప్పించుకుని స్వల్పంగా ఎడ్జ్ తీసుకుంది. ఆ బంతిని ధనంజయ అడ్డుకునే అవకాశం కూడా కనిపించలేదు. కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో భారత శిబిరంలో ఉత్సాహం కనిపించింది. ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్‌చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..! క్యాచ్ పూర్తయిన వెంటనే నో-బాల్ నిర్ణయం రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జడేజా చేసిన ఈ తప్పిదం వల్ల శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా క్రీజులో కొనసాగేందుకు అవకాశం లభించింది. రీప్లే పరిశీలించిన తర్వాత జడేజా పాదం క్రీజ్ దాటినట్లు స్పష్టమైంది. ఈ మ్యాచ్‌లో అతను వేసిన నాలుగో నో-బాల్ ఇదే కావడం మరో అంశం. టెస్టు క్రికెట్లో స్పిన్ బౌలర్ నుంచి వరుసగా నో-బాల్స్ రావడం జట్టుకు ఆందోళన కలిగించే విషయమే. ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..! ఇంతకుముందు మూడు నో-బాల్స్ జరిగినా పెద్ద నష్టం కనిపించలేదు. ఈసారి మాత్రం శ్రీలంక కెప్టెన్ కీలక వికెట్

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌పై భారత్ పూర్తి పట్టు సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి కష్టాల్లో పడింది. విజయానికి టీమిండియా కేవలం 6 వికెట్ల దూరంలో నిలవగా, లంక గెలవాలంటే చివరి రోజు ఇంకా 288 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో నాలుగో రోజు ఆటలో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలింగ్ ప్రారంభించిన భారత్‌కు పేసర్ మహమ్మద్ సిరాజ్, యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన శుభారంభం అందించారు. సిరాజ్ తన బౌన్సర్‌తో నిషాన్ మదుష్క (6)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించగా, ఆ తర్వాతి ఓవర్లోనే మానవ్ సుతార్.. దినేష్ చండీమాల్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన పసిందు సూరియబండార (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కొద్దిసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ.. కమిందు మెండిస్ (2)ను కీపర్ క్యాచ్‌గా ఔట్ చేయడంతో శ్రీలంక 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ దశలో లహిరు ఉడార (16), కెప్టెన్ ధనంజయ డిసిల్వా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే, మరోసారి బౌలింగ్‌కు వచ్చిన మానవ్ సుతార్ ఈ జోడీని విడదీసి తన రెండో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సోనాల్ దినుష (25 నాటౌట్)తో కలిసి ధనంజయ డిసిల్వా (31 నాటౌట్) పోరాడటంతో

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో భారత రెండో ఇన్నింగ్స్ 193 పరుగులకే ముగిసింది. శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత ఆటగాడు మానవ్ సుతార్ చేసిన ఓ చర్యపై శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అభ్యంతరం వ్యక్తం చేశాడు. సుతార్ ఒక పరుగు కోసం పరిగెత్తే సమయంలో పిచ్ మధ్య భాగంలో అడుగులు వేశాడని ధనంజయ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గాలే టెస్టులో కొత్త చర్చకు దారితీసింది. క్రికెట్లో బ్యాటర్లు సాధారణంగా హాఫ్ స్పైక్స్ ధరిస్తారు. పిచ్ మధ్యలో పరుగెత్తడం వల్ల వారి బూట్ల ముద్రలతో ఆ ప్రాంతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాంతో తర్వాత బ్యాటింగ్ చేసే ఆటగాళ్లకు పరిస్థితులు మరింత కఠినంగా మారవచ్చు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండటంతోనే ధనంజయ ఈ విషయంపై అంపైర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మ్యాచ్‌లో పిచ్‌ను కావాలనే దెబ్బతీసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని అంపైర్లు పరిశీలిస్తారు. పిచ్‌ను దెబ్బతీసేలా బ్యాటర్ ప్రవర్తిస్తే అంపైర్ తొలుత హెచ్చరిక ఇస్తాడు. ఆ హెచ్చరిక మొత్తం ఇన్నింగ్స్‌కు వర్తిస్తుంది. ఆ తర్వాత అదే చర్య మళ్లీ జరిగితే, ఆ బంతికి వచ్చిన పరుగులను రద్దు చేసి ఫీల్డింగ్ జట్టుకు 5 అదనపు పరుగులు ఇచ్చే నిబంధన కూడా ఉంది. మ్యాచ్ పరిస్థితులు మాత్రం భారత్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. గాలేలో శ్రీలంక ఇప్పటివరకు నాలుగో ఇన్నింగ్స్‌లో 300 పరుగులు కూడా చేయలేదు

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు టీమిండియా ఆటగాడు ధ్రువ్ జురెల్ పట్టిన ఓ క్యాచ్ వివాదానికి దారితీసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో లహిరు ఉదారాను ఔట్ చేసేందుకు అతడు తీసుకున్న లో క్యాచ్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ వేసిన బంతిని ఉదారా డిఫెన్స్ చేయబోయాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తగిలి గల్లీ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జురెల్ అద్భుతంగా కిందకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి నేరుగా జురెల్ చేతిలో పడిందా..? లేక ముందుగా నేలను తాకిందా..? అనే అనుమానం తలెత్తింది. ఫీల్డ్ అంపైర్ క్యాచ్‌ను సమీక్ష కోసం థర్డ్ అంపైర్‌కు పంపాడు. రిప్లేలలో కూడా పరిస్థితి చాలా క్లిష్టంగా కనిపించింది. బంతి జురెల్ చేతుల్లోకి వెళ్లే సమయంలో నేలను తాకినట్లు కొందరికి అనిపించగా, మరికొందరు బంతి నేలను తాకకుండానే జురెల్ క్యాచ్ పూర్తి చేశాడని వాదించారు. చివరికి థర్డ్ అంపైర్ భారత్‌కు అనుకూలంగా నిర్ణయం ఇచ్చాడు. దీంతో లహిరు ఉదారా ఔట్‌గా వెనుదిరిగాడు. అంపైర్ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొంతమంది అభిమానులు జురెల్ క్యాచ్‌ను అద్భుతమైనదిగా అభివర్ణించగా, మరికొందరు బంతి నేలను తాకిందని పేర్కొంటూ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించారు. లంక టార్గెట్ 372 తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసిన భారత్.. శ్రీలంకను 284 పరుగులకుఆలౌట్ చేసి 174 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంక ముందు 372 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే

గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఇంటర్నెట్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో ధనంజయ డిసెల్వా(31*), సోనల్ దినూశ(25*) కొనసాగుతున్నారు. నాలుగో రోజు ఛేదనకు దిగిన లంక బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓపెనర్లు నిశాన్ మదుశంక(6), లాహిరు ఉదారా(16), పసిందు సూర్యబందరా(0), కమిందు మెండిస్(2) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలొక వికెట్ పడగొట్టారు. శ్రీలంక విజయానికి ఇంకా 288 పరుగులు అవసరం కాగా.. భారత్ విజయానికి ఇంకా ఆరు వికెట్లు కావాలి. మంగళవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(66) హాఫ్ సెంచరీ.. దేవదత్ పడిక్కల్(44), కేఎల్ రాహుల్(35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 3, లాహిరు కుమార 2, కేశర ఒక వికెట్ తీశారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని శ్రీలంకకు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు 17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!

శ్రీలంకతో తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత 'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్ రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద

భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున మూడో నంబర్లో బ్యాటింగ్ చేస్తూ.. స్వదేశం వెలుపల ఒక టెస్టు మ్యాచ్‌లో 200 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డు నెలకొల్పాడు. ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పడిక్కల్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో అతడు భారత్ తరఫున మూడో నంబర్లో బ్యాటింగ్ చేస్తూ.. స్వదేశం వెలుపల ఒక టెస్టు మ్యాచ్‌లో 200 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డు నెలకొల్పాడు. ఈ అరుదైన జాబితాలో పడిక్కల్ కంటే ముందు టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, సంజయ్ మంజ్రేకర్ మాత్రమే ఉన్నారు. ద్రవిడ్ ఏకంగా ఐదు సార్లు ఈ ఘనత సాధించగా.. మంజ్రేకర్ ఒకసారి 200 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత జట్టులో మూడో నంబర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన చతేశ్వర్ పుజారా కూడా ఈ ఘనతను సాధించలేకపోయాడు. శ్రీలంకతో తొలి టెస్టులో సాయి సుదర్శన్‌కు బ్యాకప్‌గా పడిక్కల్‌ను ఎంపిక చేశారు. అయితే సాయి సుదర్శన్ చేతి గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమవడంతో పడిక్కల్‌కు తుది జట్టులో అవకాశం లభించింది. ఇది అతడికి కేవలం మూడో టెస్ట్ మ్యాచ్. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న పడిక్కల్.. తొలి ఇన్నింగ్స్‌లోనే అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. తన కెరీర్లో తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేయడమే కాకుండా.. ఏకంగా 167 పరుగుల భారీ సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ పడిక్కల్ జోరు కొనసాగించాడు. క్రీజులో కుదురుగా కనిపించిన కర్ణాటక బ్యాటర్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. చివరకు కేశర నువాంత బౌలింగ్‌లో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌటైనప్పటికీ, తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యంతో కలిపి లంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (66) తనదైన శైలిలో మెరుపు అర్ధ శతకం సాధించడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (8) కూడా నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ (35) కాసేపు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, ప్రబాత్ జయసూర్య అతడిని పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 81 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవ్‌దత్ పడిక్కల్ (44) మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.అయితే అతడు ఔటైన తర్వాత వచ్చిన రిషభ్ పంత్ తన మార్క్ విధ్వంసం సృష్టించాడు. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తన 20వ అర్ధ శతకాన్ని, 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. పంత్ జోరు చూస్తే భారత్ స్కోరు మరింత పెరిగేలా కనిపించినా, లహిరు కుమార బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే లంక బౌలర్లు అసిత ఫెర్నాండో (4/31), ప్రబాత్ జయసూర్య (3/43) విజృంభించడంతో భారత

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా డాషింగ్ ఆటగాడు రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. భారత టెస్టు చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పిన తొలి బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అదేనండి.. టెస్టుల్లో భారత్ తరఫున శత సిక్స్‌ల వీరుడిగా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో పంత్ 66 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్స్‌లు ఉన్నాయి. దీంతో 100 సిక్స్‌లు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా అవతరించాడు. అతడి తర్వాత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (90), రోహిత్ శర్మ (88) ఉన్నారు. ప్రస్తుతం భారత్ తరఫున ఆడుతున్నవారిలో రవీంద్ర జడేజా (82) మాత్రమే కాస్త దగ్గరగా ఉన్నాడు. యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (47), యశస్వి జైస్వాల్ (45)కు ఈ మార్క్‌ను అందుకొనే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా రిషభ్ పంత్ కంటే ముందు ముగ్గురు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ (122 టెస్టుల్లో 138 సిక్స్‌లు), బ్రెండన్ మెక్కల్లమ్ (101 మ్యాచుల్లో 108), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (96 టెస్టుల్లో 100) వంద సిక్స్‌ల మైలురాయిని దాటారు. అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన బ్యాటర్ మాత్రం రిషభ్ పంత్‌నే. అతడు కేవలం 51వ టెస్టుల్లోనే నమోదు చేశాడు. మున్ముందు మెక్కల్లమ్తోపాటు బెన్ స్టోక్స్ అత్యధిక సిక్స్‌ల రికార్డును పంత్ బద్దలు కొట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీలంకతో

వికెట్ల వెనుక రిషభ్ పంత్ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంతి బంతికీ ఏదో ఒక మాటతో బ్యాటర్‌ను రెచ్చగొట్టడం, బౌలర్లను ఉత్సాహపరచడం ఆయనకు అలవాటు. శ్రీలంకతో తొలి టెస్టులోనూ పంత్ ఇదే తరహాలో సందడి చేశాడు. అయితే ఆయన మాటలు కొన్నిసార్లు ప్రత్యర్థి బ్యాటర్‌ను కాకుండా సొంత జట్టు బౌలర్లనే ఇబ్బంది పెడతాయని మాజీ క్రికెటర్ అజింక్య రహానె చెప్పాడు.పంత్ ఎప్పుడూ ఇలాగే ఉంటారని రహానె అన్నాడు. అతడు చాలా సరదాగా ఉంటారని చెప్పాడు. అయితే శ్రీలంక ఆటగాళ్లకు హిందీ అర్థం కాకపోవడంతో పంత్ మాటలతో బ్యాటర్ ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉందన్నాడు. అదే సమయంలో స్లిప్స్, షార్ట్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్లు మాత్రం బంతిపై పూర్తిగా దృష్టి పెట్టాలని చెప్పాడు. క్యాచ్ వచ్చే సమయంలో పంత్ మాటలతో ఫీల్డర్ దృష్టి మళ్లితే బౌలర్లు కోపం తెచ్చుకునేవారని రహానె వెల్లడించాడు.తాను భారత జట్టులో ఉన్న సమయంలో అశ్విన్, జడేజా లాంటి బౌలర్లు పంత్ మాటలతో ఇబ్బంది పడేవారని రహానె గుర్తు చేసుకున్నాడు. బ్యాటర్‌ను డిస్టర్బ్ చేయాలి కానీ.. సొంత ఆటగాళ్లను కాదని పంత్‌కు చెప్పాల్సి వచ్చేదని తెలిపాడు.శ్రీలంకతో టెస్టులో పంత్ మరోసారి తన చమత్కారంతో నవ్వులు పూయించాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి స్టంప్ మైక్‌లో వినిపించిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. జడేజా ఇంకా బౌలింగ్‌కు రాకపోవడంతో సర్ఫరాజ్.. ‘లాంగ్ గేమ్.. అందరం కలిసి వికెట్లు పంచుకుందాం’ అన్నాడు. వెంటనే పంత్ స్పందిస్తూ.. ‘అందరం కలిసి కత్తులు తిప్పుదాం’ అంటూ

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాను ఔటైనట్లుగా భావించి మైదానం నుంచి వెళ్తున్న కేఎల్ రాహుల్‌కు దేవదత్ పడిక్కల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాతి పరిణామలతో పడిక్కల్‌ను రాహుల్ గట్టిగా హగ్ చేసుకున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. లంక బ్యాటర్ల తరహాలోనే టీమిండియా బ్యాటర్లు పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇవాళ ఆటలో భారత్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఊహించని లైఫ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన రాహుల్.. దేవదత్ పడిక్కల్ ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య వేసిన అద్భుతమైన బంతి రాహుల్ కాలికి తగిలింది. దీంతో లంక ప్లేయర్లు అప్పిల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రాహుల్‌ను ఔటైనట్లు ప్రకటించాడు. అయితే, నాన్ స్ట్రేకర్ ఎండ్ లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ వెంటనే జోక్యం చేసుకున్నాడు. డీఆర్ఎస్ (DRS) తీసుకోవాలని రాహుల్‌ను ఒప్పించాడు. దీంతో రాహుల్ అయిష్టంగానే రివ్యూ కోరాడు. రీప్లేలో బాల్ ట్రాకింగ్ పరిశీలించగా.. బంతి లెగ్ స్టంప్ పైనుంచి వెళ్తున్నట్లు తేలడంతో అంపైర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. లైఫ్ దక్కడంతో ఊపిరి పీల్చుకున్న రాహుల్, తనను కాపాడిన పడిక్కల్‌ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ దృశ్యం మ్యాచ్‌లోనే ప్రత్యేక క్షణంగా నిలిచింది. అయితే, ఈ జీవనదానంను రాహుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రివ్యూ తర్వాత కొద్దిసేపు దూకుడుగా ఆడిన రాహుల్ (47 బంతుల్లో 35 పరుగులు) మళ్లీ జయసూర్య బౌలింగ్‌లోనే మిడాఫ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించి మిల్టన్ రత్నాయకేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య గాలె వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీలంక ప్రధాన బ్యాటర్ దినేష్ చండీమాల్ ఫీల్డింగ్ చేస్తూ మెడకు తీవ్ర గాయమవడంతో మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. లంక జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. గాలె టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేస్తున్న లంక బౌలర్ నువన్ తుషార బౌలింగ్‌లో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన షాట్ ఆడాడు. ఆ బంతిని బౌండరీ దాటకుండా ఆపేందుకు దినేష్ చండీమాల్ ఎంతో వేగంగా పరుగెత్తాడు. బంతిని ఆపడంలో విజయం సాధించినప్పటికీ, ఆ వేగంలో నియంత్రణ కోల్పోయి నేలను బలంగా ఢీకొట్టడంతో ఆయన మెడ భాగానికి తీవ్రమైన దెబ్బ తగిలింది. గాయం తీవ్రత కారణంగా చండీమాల్ మైదానంలోనే తీవ్ర నొప్పితో కిందపడిపోయాడు. ఆయన పరిస్థితిని గమనించిన తోటి ఆటగాళ్లు వెంటనే ఫిజియోను పిలిచారు. మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో, ఆయనను మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: Cricket Records: సచిన్ ఖాతాలో ఎవరూ బ్రేక్ చేయలేని ‘వరల్డ్ రికార్డ్’..100 ఏళ్లయినా ఇది బద్దలవడం అసాధ్యమే చండీమాల్ గాయపడి మైదానం వీడటం శ్రీలంక జట్టును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గాలె టెస్టులో కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ప్రధాన బ్యాటర్ అందుబాటులో లేకపోవడం లంక అవకాశాలను దెబ్బతీసే అంశం. మొదటి ఇన్నింగ్స్‌లో ఆయన కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో ఆయన కీలకంగా మారతాడని లంక యాజమాన్యం ఆశించింది. ఆయన మెడ గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన