
Aug 19 2026 12:51 PM | Updated on Aug 19 2026 12:56 PM
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా గెలుపు దిశగా మరింత పట్టు బిగించింది. గాలెలో బుధవారం నాటి ఆఖరి రోజు ఆటలో భోజన విరామ సమయానికి విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది.
కాగా ఓవర్‌నైట్ స్కోరు 84/4తో బుధవారం ఆట మొదలుపెట్టిన శ్రీలంకకు.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష జోడీ ఊపిరిలూదింది. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ ధనంజయ, సొనాల్ దినుష అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి జోడీని విడదీసేందుకు టీమిండియా బౌలర్లు మంగళవారం నుంచి విఫలయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
జిడ్డులా క్రీజులో పాతుకపోగా.. ఈ క్రమంలో సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఎట్టకేలకు ఈ పని పూర్తి చేశాడు. ధనంజయ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కూడా జిడ్డులా క్రీజులో పాతుకపోగా.. జడ్డూ 56వ ఓవర్లో రెండో బంతిని షాట్ ఆడేలా అతడిని ఊరించాడు. ఈ క్రమంలో బ్యాట్ టాప్ ఎడ్జ్‌ను తాకిన బంతి గాల్లోకి లేవగా.. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మానవ్ సుతార్ క్యాచ్ పట్టాడు.
జడ్డూ వైల్డ్ సెలబ్రేషన్ దీంతో ధనంజయ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 151 బంతులు ఎదుర్కొన్న అతడు 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. కాగా ధనంజయ, దినుష కలిసి ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించగా.. జడ్డూ ఎట్టకేలకు ఈ జంటను విడదీసి భారీ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. దీంతో టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి. జడ్డూ సైతం వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. లంచ్ బ్రేక్ సమయానికి దినుష 65, కేశారా నువాంత 8 పరుగులతో ఉన్నారు. లంక విజయానికి ఇంకా 197 పరుగులు కావాలి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం సంపాదించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా శ్రీలంకకు 372 పరుగుల మేర భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
చదవండి: ఇదేం గేమ్‌ప్లాన్?: టీమిండియాపై విమర్శలు
సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు)
కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు)
చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు)
అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు)
ఎన్నికల సమయంలోనే BCలపై ప్రేమలు చూపిస్తారు..!
బాలీవుడ్ ఆఫర్ వదిలేసి..! చరణ్‌తో జోడి కట్టిందా?





