
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక బ్యాటర్లు వికెట్ ఇవ్వకుండా పట్టుదల ప్రదర్శిస్తున్నారు. భారత బౌలర్లు మాత్రం శతవిధాలా ఏడో వికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఆరు ఓవర్లపాటు ఆట జరిగింది. కేశర నువాంత (12*), సోనాల్ దినుష (80*) మాత్రం డిఫెన్స్ ఆడేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 72 ఓవర్లకు 194/6. భారత్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉండగా.. శ్రీలంకకు 177 పరుగులు అవసరం.
శ్రీలంక - భారత్ తొలి టెస్టు ఐదో రోజు మొదటి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజ్‌లో సోనాల్ దినుష (65*), కేశర నువాంత (8*) ఉన్నారు. ఈ సెషన్లో భారత బౌలర్లు రెండు వికెట్లు తీయగలిగారు. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (59)తోపాటు నిరోషన్ డిక్వెల్లా (10) పెవిలియన్‌కు చేరారు. మరో నాలుగు వికెట్లు తీస్తే టీమ్ఇండియాదే టెస్టు విజయం. మరోవైపు శ్రీలంకకు 197 పరుగులు అవసరం.
శ్రీలంకకు స్వల్ప వ్యవధిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన పరుగులు చేసిన నిరోషన్ డిక్వెల్లా (10) పెవిలియన్‌కు చేరాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన (59.6వ ఓవర్) బంతిని షాట్ కొట్టే క్రమంలో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 156 పరుగుల వద్ద శ్రీలంక ఆరో వికెట్‌ను నష్టపోయింది. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 61 ఓవర్లకు 160/6. క్రీజ్‌లో కేశర (1*), సోనాల్ దినుష (57*) ఉన్నారు. మరో నాలుగు వికెట్లు తీస్తే టీమ్ఇండియాదే విజయం.
దాదాపు 24 ఓవర్ల తర్వాత భారత్‌కు వికెట్ దక్కింది. కెప్టెన్ ధనంజయ (59)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. జడ్డూ వేసిన (55.2వ ఓవర్) బంతిని ఆడేందుకు ప్రయత్నించి మానవ్ సుతార్‌కు ధనంజయ క్యాచ్ ఇచ్చాడు. దీంతో 95 పరుగులు ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 56 ఓవర్లకు 144/5. క్రీజ్‌లో సోనాల్ (51*), డిక్వెల్లా (1*) ఉన్నారు. శ్రీలంక విజయానికి 228 పరుగులు అవసరం. భారత్ ఐదు వికెట్లు తీస్తే గెలుస్తుంది.
శ్రీలంక - భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఐదో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్‌నైట్ 84/4 స్కోరుతో శ్రీలంక ఆఖరి రోజు ఆటను మొదలుపెట్టింది. కెప్టెన్ ధనంజయ (54*), సోనాల్ దినుష (50*) హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఇప్పటికే 91 పరుగులు జోడించారు. వికెట్ కోసం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 51 ఓవర్లకు 138/4. లంక విజయానికి ఇంకా 234 పరుగులు అవసరం కాగా.. భారత్‌కు ఆరు వికెట్లు కావాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





