
కేవలం 19 పరుగులకే 4 వికెట్లు.. ఈటీపీఎల్లో గత్తరలేపిన 23 ఏళ్ల పేసర్..!
European T20 Premier League: యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (European T20 Premier League, ETPL) పోరులో బెల్ఫాస్ట్ వోల్వ్స్ (Belfast Wolves) అదరగొట్టింది. ఆస్ట్రేలియా దిగ్గజాలు గ్లెన్ మ్యాక్స్వెల్, మాథ్యూ హెడెన్ జట్ల నడుమ సాగిన మ్యాచ్లో 23 ఏళ్ల యువ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. దీంతో హెడెన్ టీమ్ ఊహించని రీతిలో కుప్పకూలి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.













































