
పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’తో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా సభకు హాజరై వందేమాతరం ఆరు చరణాలను ఆలపించారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. వందేమాతరాన్ని అవమానిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం.. వందేమాతరం పాడేటప్పుడు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటారు. దీంతో జాతీయ గీతం జనగణమనకు ఉన్న రక్షణ వందేమాతరానికీ లభించింది. ఈ వార్త చదివారా: ఆఖరి రోజూ అంతేనా?





