
వైవిధ్య వినాయక.. ఈ 10 ఆసక్తికర గణనాథుడి ప్రతిమలు చూశారా?
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొలువు దీరిన వైవిధ్యమైన పది గణనాథుని ప్రతిమల్ని ఈ వీడియోల్లో చూడొచ్చు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొలువు దీరిన వైవిధ్యమైన పది గణనాథుని ప్రతిమల్ని ఈ వీడియోల్లో చూడొచ్చు.

హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)లో ఓపెన్ ప్లాట్లు భారీ ధర పలికాయి. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు హౌసింగ్ బోర్డు బుధవారం బహిరంగ వేలం నిర్వహించింది. చదరపు గజానికి కనీస ధర రూ.1.60లక్షలుగా నిర్ధరించగా.. అత్యధికంగా రూ.2.70లక్షలు పలికినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతమ్ తెలిపారు. మరో ప్లాట్‌ను చదరపు గజం రూ.2.36 లక్షలకు.. మరో రెండు ప్లాట్లు రూ.2.06 లక్షలకు వేలం పాటలో అమ్ముడుపోయినట్లు చెప్పారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలంలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకునేందుకు మొత్తం 19 మంది బిడ్డర్లు పోటీ పడ్డారని.. దీని ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు గౌతమ్ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

దిల్లీ: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి తన వివరణ ఇచ్చినట్లు చెప్పారు. నా వ్యవహారంపై పార్టీలో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. దిల్లీలో మీడియాతో కొండా సురేఖ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానానికి నేను చెప్పుకోవాల్సిందంతా చెప్పాను. పార్టీ పెద్దలు ఆలోచిస్తామని చెప్పారు. నా బిడ్డ స్వతంత్రంగా ఉంది. పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలిగా మాట్లాడిందని అనుకుంటున్నాను. ఆమె జీవితం ఆమె ఇష్టం. నాతో పాటు నా భర్త రాజకీయ జీవితం మా ఇష్టం. నేను మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్నాను. అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేస్తున్నా. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాను. పదవిలో కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరాను. నా బిడ్డ వ్యాఖ్యలపై నేను స్పందించను. సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. రోజూ ఎంతో మంది మాట్లాడతారు.. అందులో సుస్మిత కూడా ఒకరు. నా బిడ్డ కాబట్టి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు. ఆమె వ్యాఖ్యలను ఖండించడం, సమర్థించడం చేయను. నా వివరణను మీనాక్షి నటరాజన్‌కు చెప్పాను. అధిష్ఠానానికి ఆమె చెప్తానన్నారు. పార్టీలో కొందరితో నాపై ఆరోపణలు చేయించారు. ఎవరు అలా చేయించారో తెలుసు. పేర్లు చెబితే వివాదం అవుతుంది. నాపై ఆరోపణలు చేసిన వారికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. పార్టీ ఆ దిశగానూ ఆలోచించాలి. నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే తప్పు. ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నా.. అందుకే ఇక్కడికి వచ్చి నా బాధ చెప్పుకొన్నా. రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌కు రాతపూర్వకంగా వివరణ ఇచ్చా. పార్టీ తీసుకునే నిర్ణయం బట్టి నా ఆలోచన ఉంటుంది’’ అని కొండా సురేఖ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు

కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు(బుధవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సురేఖ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని అన్నారు. అధిష్ఠానం ఏం చేస్తుందో వేచిచూస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనను కోరలేదని చెప్పారు. బీసీ అయిన తనకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేబినెట్లో ఉన్న ఇతర సామాజికవర్గాల నేతలపై పెద్దఎత్తున అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగారు. అన్ని అంశాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా అధిష్ఠాన పెద్దలందరికీ రాతపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గేకు చెప్పినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్ కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, సెప్టెంబర్ 2: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు సీఎం అని రేవంత్ ఎలా అంటారని ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గేను కలిశానని, కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని తెలిపారు. వాళ్లు ఏం చేస్తారో వేచి చూస్తున్నానని కొండా సురేఖ పేర్కొన్నారు

రెజిమెంటల్ బజార్: రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నిలిమ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కాటేదాన్: రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన ఘటన మైలార్ దేవుపల్లి ఠాణా పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... పాతబస్తీ అలినగర్కి చెందిన ఖాజీ సోహెల్(28) ఓ రౌడీ షీటర్. బుధవారం తెల్లవారుజామున పాత కర్నూలు రహదారి మైలార్ దేవులపల్లి పల్లె చెరువు వ్యాపార కూడలి వద్ద గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అతడ్ని ద్విచక్రవాహనంపై తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న సోహెల్‌పై 17 సార్లు కత్తితో పొడిచి దాడి చేశారు. దీంతో సోహెల్ అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితులు ఎవరా ఆన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Cyber Crimes | ఇంటర్నెట్ డెస్క్: తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఒక్కోసారి పెను ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో స్నేహాలూ అంతే. మరీ ముఖ్యంగా ఈ మధ్యన టీనేజర్లను లక్ష్యంగా చేసుకొని స్నేహం ముసుగులో సైబర్ నేరగాళ్లు దగ్గరవుతున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి ఆ తర్వాత టీనేజర్లను బెదిరిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. లేదా వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పెంకుటింట్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి రూ.లక్షకు పైగా కరెంటు బిల్లు వచ్చిన ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ సభలో చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Teachers Strike: ఉపాధ్యాయులతో పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం చూడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాలు. సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన లక్ష్యం నేడు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ప్రొగ్రేసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు నేతలు మాట్లాడారు. తమ డిమాండ్ల అమలుకు సర్కార్ తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మరో రెండు దఫాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అదే నిజం కావాలంటే మేనిఫెస్టోలో నూటికి నూరు శాతం అమలు చేస్తేనే రెండు దఫాలు మీ ప్రభుత్వమే ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఐదు శాతం ఐఆర్ ఇచ్చి పీఆర్సీ కమిటీ వేయగానే.. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో అనేక అంశాలను చేర్చింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే పీఆర్సీ పాత కమిటీ రద్దు చేసి దాని స్థానంలో కొత్త కమిటీ వేసి 6 నెలల్లోపే నివేదిక తెప్పించుకుంటారని తాము భావించాము. కానీ పాత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిటీనే పొడిగిస్తూ.. వెళ్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మార్చి 31 తర్వాత రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ మనుగడలో ఉందా లేదా అనేది ఉద్యోగ సంఘాలకు తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కమిటీ ఉంటే ఎందుకు రిపోర్టు ప్రభుత్వానికి చేరడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు కార్యాచరణ తీసుకోగానే సీఎం పిలిచి

తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. లోతుకుంట భూవివాదం, కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన కఠిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ సంచలన స్టే విధించింది. సెప్టెంబర్ 1న వెలువడిన ఈ ఉత్తర్వులతో రంగనాథ్ ప్రస్తుతానికి తన పదవిలో కొనసాగే అవకాశం స్పష్టంగా ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటివరకు సింగిల్ బెంచ్ ఆదేశాలను అమలు చేయకపోగా, ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేతో ఆయన స్థానం మరింత పటిష్టంగా మారింది. ఈ వివాదం మెదక్-మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటలోని 40 ఎకరాల భూమి చుట్టూ ప్రారంభమైంది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ క్లెయిమ్ చేస్తున్న ఈ స్థలంలోకి హైడ్రా అధికారులు వెళ్లి తాత్కాలిక నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కంపెనీ, కోర్టు ఇచ్చిన అండర్‌టేకింగ్‌ను అధికారులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంటెంప్ట్ పిటిషన్లు దాఖలు చేసింది. గతంలో వివాదాస్పద స్థలానికి రక్షణగా సైన్యాన్ని కూడా కాపలాగా ఉంచే స్థాయికి ఈ గొడవ చేరింది. దీంతో జూలై 27న విచారణ చేపట్టిన జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి సింగిల్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్‌పై ఏడాదిన్నర వ్యవధిలో 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆయన సమర్పించిన క్షమాపణ అఫిడవిట్ సంతృప్తికరంగా లేదంటూ, సీఎస్ వెంటనే రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించి వేరొకరిని నియమించాలని సంచలన ఆదేశాలు ఇచ్చింది. అయితే, తాము పిటిషనర్ భూమిలోకి వెళ్లలేదని, ప్రభుత్వ స్థలాన్నే రక్షిస్తున్నామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఫలితంగా ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు పూర్తి స్థాయిలో బహిరంగ మద్దతుగా నిలిచారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా చట్టబద్ధంగానే పనిచేస్తోందని, కోర్టులను గౌరవిస్తూనే కబ్జాదారులపై పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు

గణపతి విగ్రహాల ధరలు పెంపు ముడిసరుకులు, రవాణా భారం అధికం ఈసారి ఇరవైశాతం రేట్లు పెరుగుదల Ganesh Idol Prices Hike: వినాయక చవితి పండగ సమీపిస్తుండటంతో భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల సందడి అప్పుడే మొదలైంది. హైదరాబాద్ నగరంలతో పాటు శివారు ప్రాంతాల్లో విగ్రహాల తయారీ పనులు తుదిమెరుగులకు చేరుకున్నాయి. అయితే ఈ ఏడాది గణనాథుని విగ్రహాల ధరలు భారీగా పెరగనుండటంతో భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ధరల భారం తప్పేలా లేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి విగ్రహాల రేట్లు దాదాపు 25 శాతం వరకు పెరిగినట్లు తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. PMAY-U: ఏపీ పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. సొంతింటి కోసం రూ.2.89 లక్షల సాయం.. డైరెక్ట్ అకౌంట్ లోకే ముడిసరుకులు, రవాణా భారం - పెరిగిన విగ్రహాల రేట్లు: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), కొబ్బరిపీచు, రంగులు, అలంకరణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడమే కాకుండా రవాణా ఛార్జీలు కూడా భారంగా మారాయని తయారీదారులు వెల్లడించారు. గతేడాది 20 అడుగుల విగ్రహం ధర(Ganesh Idol Prices Hike) రూ.85 వేలు ఉండగా, ఈసారి అది రూ.లక్ష దాటింది. అలాగే సాధారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేసే 12 నుండి 16 అడుగుల విగ్రహాల ధరలు గతంలో రూ.50-60 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.70 నుండి 80 వేల వరకు పలుకుతున్నాయి. ఎవర్ గ్రీన్ ధూల్‌పేట్ - శివార్లకు విస్తరించిన వ్యాపారం: నగరంలో వినాయక విగ్రహాల తయారీ అనగానే మొదట గుర్తుకొచ్చే ధూల్‌పేట్‌తో పాటు నాగోలు, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ధూల్‌పేట్ విగ్రహాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా విశేషమైన డిమాండ్ ఉంది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలను దిగుమతి చేసుకుని విక్రయిస్తుండటంతో మార్కెట్లో పోటీ బాగా పెరిగింది. Telangana

LPG Price Hike: సెప్టెంబర్ నెల తొలిరోజే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం ఇల్లాళ్లకు ఊరటనిచ్చే విషయంగా మారింది. ఆగస్టు నెల ప్రారంభంలో కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించిన ఆయిల్ కంపెనీలు, సెప్టెంబర్ 1న మళ్లీ పెంచి షాకిచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్ ప్రకటన ప్రకారం 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.9.50 వరకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో అయితే రూ.11 మేర భారం పెరిగింది. గతేడాది చివరిలో ధరలు తగ్గినప్పటికీ, మళ్లీ పెరగడం వల్ల హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, టీ కొట్ల నిర్వాహకులకు రోజువారీ నిర్వహణ వ్యయం పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరా వ్యయాలు, రూపాయి మారకం విలువల్లో వచ్చే మార్పుల వల్లే ఈ సవరణలు చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ సిలిండర్ల రేట్లు పెరిగినప్పటికీ 14.2 కేజీల సాధారణ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను కంపెనీలు తాకలేదు. సాధారణ ఇళ్లలో వాడే గ్యాస్ రేట్లు మునుపటిలాగే స్థిరంగా కొనసాగుతున్నాయి. 5 కేజీలు, 10 కేజీల చిన్న తరహా సిలిండర్ల ధరల్లోనూ ఎటువంటి మార్పూ చేయలేదు. ప్రస్తుతం 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్ రూ.349.50 వద్ద దొరుకుతుండగా, ఎక్స్‌ట్రాలైట్ సిలిండర్ ధర రూ.339 వద్దే ఉంది. కాకపోతే 5 కేజీల గృహేతర వాణిజ్య సిలిండర్ రేటు రూ.762 నుంచి రూ.764 కు పెరిగింది. తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో లేటెస్ట్ రేట్లు ధరల పెంపు తర్వాత నగరాల వారీగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. భాగ్యనగరం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.11 పెరిగి రూ.2,996 వద్దకు చేరి రూ.3,000 మార్కుకు అత్యంత చేరువైంది. దేశ

హైదరాబాద్: క్యూర్ పరిధిలోని 20 డార్క్ స్టోర్లలో ‘టీజీ-సేఫ్’ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో స్టోర్లలో ఈ తనిఖీలు జరిగాయి. పరిశుభ్రత నిర్వహణలో లోపాలను అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాల స్టోరేజ్ మేనేజ్మెంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా స్టోర్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి, నిబంధనలు ఉల్లంఘించిన స్టోర్లకు నోటీసులు అందజేశారు. అనుమానాస్పద ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన అధికారులు, వాటిని పరీక్షించి ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

జవహర్‌నగర్, మేడ్చల్, న్యూస్‌టుడే: ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మేడ్చల్ జిల్లా టీపీటీఎల్ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్‌నగర్‌లో రూపారెడ్డికి నివాళులర్పించారు. నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. ప్రభుత్వం పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు చట్టపరంగా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాప్రా మండల విద్యాధికారి అజామొయినుద్దీన్, కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్, గణేష్, నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మండల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్‌లో శాంతి ర్యాలీ నిర్వహించారు. గిరిబాబు, రాధాక్రిష్ణ, నారాయణమూర్తి, లవకుమార్గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

హైదరాబాబాద్: నగరంలోని రాయదుర్గంలో ఎకరం భూమి రికార్డు ధర పలికింది. పాన్మక్తాలో సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాల భూమికి టీజీఐఐసీ శుక్రవారం వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది. ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ అధిక ధర చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకుంది. మొత్తం 5.25 ఎకరాలనూ ఆ సంస్థే దక్కించుకుంది. ఇదే సర్వే నంబర్లో మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరా రూ.237 కోట్లు పలికింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

హైదరాబాద్: నగరంలోని మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో మంత్రి వివేక్ ముఖాముఖి నిర్వహించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖ పరిధిలోకి తెచ్చిన నేపథ్యంలో విద్యార్థులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒక్కో అంశంపై మంత్రి వారికి స్పష్టత ఇచ్చారు. ఫీజలు, పరీక్షలు, ఈసెట్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వివరించారు. ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలగదని భరోసా ఇచ్చారు. పాలిటెక్నిక్‌లలో అభివృద్ధి, ఆధునిక సాంకేతిక విద్యతో పాటు పరిశ్రమలతో అనుసంధానం, ఉపాధి కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తహసీల్దార్ కార్యాలయంలో వాష్‌రూమ్ శుభ్రం చేశారు