
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Teachers Strike: ఉపాధ్యాయులతో పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం చూడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాలు. సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన లక్ష్యం నేడు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ప్రొగ్రేసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు నేతలు మాట్లాడారు. తమ డిమాండ్ల అమలుకు సర్కార్ తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఈ మహాధర్నాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మరో రెండు దఫాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అదే నిజం కావాలంటే మేనిఫెస్టోలో నూటికి నూరు శాతం అమలు చేస్తేనే రెండు దఫాలు మీ ప్రభుత్వమే ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఐదు శాతం ఐఆర్ ఇచ్చి పీఆర్సీ కమిటీ వేయగానే.. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో అనేక అంశాలను చేర్చింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే పీఆర్సీ పాత కమిటీ రద్దు చేసి దాని స్థానంలో కొత్త కమిటీ వేసి 6 నెలల్లోపే నివేదిక తెప్పించుకుంటారని తాము భావించాము. కానీ పాత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిటీనే పొడిగిస్తూ.. వెళ్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మార్చి 31 తర్వాత రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ మనుగడలో ఉందా లేదా అనేది ఉద్యోగ సంఘాలకు తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కమిటీ ఉంటే ఎందుకు రిపోర్టు ప్రభుత్వానికి చేరడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు కార్యాచరణ తీసుకోగానే సీఎం పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం.. ఆ తర్వాత వాటిని ఏమాత్రం పట్టించుకోకపోవడం..ఇలా ఇప్పటి వరకు 5 సార్లు జరిగిందంటూ మండిపడ్డారు.
మరోవైపు రిటైర్ అయిన ఉద్యోగికి కోటి రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్న సీఎం రేవంత్ నిన్న మలక్ పేట సభలో చేసిన వ్యాఖ్యలపై శ్రీపాల్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం ఇచ్చే 13, 16 లక్షల వరకు గ్రాట్యుటీ తప్పా మిగతా డబ్బంతా ఉద్యోగి దాచుకున్న సొమ్మే తప్పా ప్రభుత్వానివి ఉంటూ ప్రశ్నించారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఉద్యోగులకు ఇవ్వకుండా సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులపై వ్యతిరేక భావం కలిగించేలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తే వాటిని కింది స్థాయిలో అమలు కావడం లేదని అసలు ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్ధితులు ఉన్నాయన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిల విడుదలకు స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క భార్య డిమాండ్ చేశారని.. ఓ మహిళా రిటైర్డ్ ఉద్యోగి ఆరోపణలు చేస్తే వాటిపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ, మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో మంత్రులు, ఉద్యోగులు సమానమని ఆయన అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.



