
హైదరాబాబాద్: నగరంలోని రాయదుర్గంలో ఎకరం భూమి రికార్డు ధర పలికింది. పాన్మక్తాలో సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాల భూమికి టీజీఐఐసీ శుక్రవారం వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది. ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ అధిక ధర చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకుంది. మొత్తం 5.25 ఎకరాలనూ ఆ సంస్థే దక్కించుకుంది. ఇదే సర్వే నంబర్లో మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరా రూ.237 కోట్లు పలికింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Nimisham EditorialSenior Editorial Lead





