
హోంవర్క్ సున్నా.. ఆరోపణలు వంద.. ఇదే ఆ ఛానల్ పరిస్థితి: మంత్రి అచ్చెన్న
నిరుద్యోగుల అవకాశాలపై సాక్షి విషం చిమ్ముతోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా వైసీపీ భర్తీ చేయలేదని విమర్శించారు.

నిరుద్యోగుల అవకాశాలపై సాక్షి విషం చిమ్ముతోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా వైసీపీ భర్తీ చేయలేదని విమర్శించారు.

Donovan Ferreira The Hundred: పొట్టి ఫార్మాట్లో ఎప్పుడూ డాషింగ్ బ్యాటర్లదే పూర్తి ఆధిపత్యం. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఆటగాళ్లకు క్రికెట్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఫ్రాంచైజీలు సైతం ఇలాంటి ఇంపాక్ట్ ప్లేయర్ల కోసం ఎగబడి మరీ కోట్ల రూపాయలు కుమ్మరిస్తుంటాయి. సరిగ్గా ఇప్పుడు దక్షిణాఫ్రికా విధ్వంసకర ఫినిషర్ డోనోవన్ ఫెరీరా విషయంలోనూ ఇదే జరిగింది. ఇంగ్లాండ్‌లో జరిగిన టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారాడు. ఈ అసాధారణ హిట్టింగ్ నైపుణ్యంతో 2026 హండ్రెడ్ సీజన్ వేలానికి అతడి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 2,71,76,436 భారీ ధర వెచ్చించి అతడిని దక్కించుకుంది. ఆటగాడిగా జట్టులోకి తీసుకోవడమే కాకుండా ఏకంగా కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చి గౌరవించింది. క్రికెట్లో బంతుల లెక్కన ఆదాయం చూస్తే ఫెరీరా సంపాదన అభిమానుల మైండ్‌బ్లాంక్ చేస్తుంది. 2025లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ అతనికి 52 వేల పౌండ్లు చెల్లించింది. అంటే మైదానంలో అతను ఆడిన ఒక్కో బంతికి సుమారు రూ. 89,294 చొప్పున ముట్టాయి. అదే 2026 సీజన్లో బర్మింగ్‌హామ్ జట్టు నుంచి అందిన భారీ మొత్తంతో ఈ లెక్కలు ఆకాశాన్ని తాకాయి. కెప్టెన్‌గా 8 మ్యాచ్‌ల్లో 90 బంతులు ఆడి 101 రన్స్ చేశాడు. బౌలింగ్‌లో సైతం 40 బంతులు వేశాడు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే, ఈ ఏడాది అతడు మైదానంలో ఎదుర్కొన్న ఒక్కో బంతికి ఏకంగా రూ. 3,01,960 చొప్పున ఆదాయం దక్కింది. ఇలా బంతికి లక్షల్లో ఆర్జించడం లీగ్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డుగా నిలిచింది. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! Terrific power-hitting from Donovan Ferreira, smashing at a strike rate of 241.67 in The Hundred

బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్‌కు చెందిన నైట్ రైడర్స్ గ్రూప్ మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలో కొత్తగా జట్లు చేర్చితే.. అందులో ఒక ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు నైట్ రైడర్స్ గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గతేడాది ది హండ్రెడ్‌లోని ఎనిమిది ఫ్రాంచైజీల్లో వాటాల విక్రయ ప్రక్రియ జరిగినప్పుడు నైట్ రైడర్స్ గ్రూప్ ట్రెంట్ రాకెట్స్‌పై ఆసక్తి చూపింది. అయితే బిడ్డింగ్ ప్రక్రియలో ఆ ఫ్రాంచైజీ విలువ కొంత ఎక్కువగా ఉందని భావించి, చివరికి రేసు నుంచి తప్పుకుంది. దీంతో ట్రెంట్ రాకెట్స్‌లో 49 శాతం వాటాను కైన్ ఇంటర్నేషనల్ దక్కించుకుంది. చెల్సీ సహ యజమాని టాడ్ బోహ్లీ, బ్రిటిష్ వ్యాపారవేత్త జోనాథన్ గోల్డ్‌స్టీన్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ వాటాను 40 మిలియన్ పౌండ్ల కంటే తక్కువ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. 10 జట్లకు విస్తరిస్తే ఎంట్రీ..? బీబీసీ స్పోర్ట్ నివేదిక ప్రకారం.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు భవిష్యత్తులో ది హండ్రెడ్ను ఎనిమిది జట్ల నుంచి 10 జట్లకు విస్తరించాలని నిర్ణయిస్తే నైట్ రైడర్స్ గ్రూప్ మరోసారి బిడ్డింగ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత మీడియా హక్కుల ఒప్పందం 2028 వరకు కొనసాగుతున్నందున.. అంతకుముందు కొత్త జట్లను చేర్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. కొత్తగా రెండు జట్లు వస్తే వాటికి డర్హమ్‌తో పాటు నైరుతి ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ లేదా టాంటన్ ప్రాంతాలను స్థావరాలుగా పరిగణిస్తున్నట్లు సమాచారం. కొత్త జట్ల చేరికతో ది హండ్రెడ్ మీడియా హక్కుల విలువ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నైట్ రైడర్స్ విస్తరణ నైట్ రైడర్స్ గ్రూప్ ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో పలు ఫ్రాంచైజీలను నిర్వహిస్తోంది. భారత్‌లో (ఐపీఎల్) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు వెస్టిండీస్ (CPLలో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్), అమెరికా (MLCలో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్), యూఏఈల్లోనూ (ILT20లో అబుదాబీ నైట్‌రైడర్స్)

క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన 'ద హండ్రెడ్' ఆరో ఎడిషన్ నిన్న అట్టహాసంగా ముగిసింది. పురుషుల విభాగంలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ (ఎంఎస్‌జీ) తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. లండన్‌లోని చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన పురుషుల ఫైనల్లో మాంచెస్టర్ జట్టు, ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ జట్టు నిర్ణీత బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ జట్టుకు ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 38 బంతుల్లోనే 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ చివరి ఓవర్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. చివరి మూడు బంతుల్లో మూడు పరుగులు అవసరమైన దశలో లియామ్ డాసన్ అద్భుతమైన సిక్సర్ బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.ఈ విజయం మాంచెస్టర్ జట్టు యజమాని, లక్నో సూపర్ జెయింట్స్ సహ యజమాని అయిన సంజీవ్ గోయెంకాకు ఎంతో ప్రత్యేకమైంది. ఒక క్రికెట్ ఫ్రాంచైజీ యజమానిగా ఆయనకు ఇదే తొలి మేజర్ టోర్నమెంట్ టైటిల్. ఈ గెలుపుపై ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. "మన తొలి సీజన్లోనే ఛాంపియన్లుగా నిలిచాం. లార్డ్స్‌లో ఇది మాకు గర్వకారణమైన క్షణం. ఇది జట్టు సమష్టి కృషి. టిమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నూర్ కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. కెప్టెన్ జోస్

హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్‌ను ఈజీగా అందుకున్న సూపర్‌జెయింట్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్‌గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు. ట్రెంట్ రాకెట్స్‌కు మెయిడెన్ టైటిల్ మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్‌తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, డాని గిబ్సన్ 22

ది హండ్రెడ్ 2026లో ముంబై ఇండియన్స్ లండన్‌కు చేదు ముగింపు ఎదురైంది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌పై చివరి లీగ్ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించినప్పటికీ.. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ లీడ్స్ ముందంజ వేయడంతో MI లండన్ నాలుగో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన MI లండన్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాసన్ రాయ్ 26 పరుగులు చేశాడు. చివర్లో ఒల్లీ సైక్స్, టామ్ కరన్ వేగంగా పరుగులు చేయడంతో MI లండన్ పోరాడగలిగే స్కోరు సాధించింది. అయితే ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ను 98 పరుగులు లేదా అంతకంటే తక్కువకే ఆలౌట్ చేయాల్సి వచ్చింది. 23 పరుగులకే మూడు వికెట్లు పడటంతో MI లండన్ ఆ దిశగా అడుగులు వేసింది. సికందర్ రజా, రిచర్డ్ గ్లీసన్ ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. కానీ జో వెదర్లీ అడ్డుగా నిలిచాడు. 31 బంతుల్లో 42 పరుగులు చేసిన అతడు సీన్ డిక్సన్‌తో కలిసి 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఫీనిక్స్ 98 పరుగుల మార్కును దాటింది. ఆ క్షణంతోనే MI లండన్ ప్లేఆఫ్స్ ఆశలు ముగిశాయి. అయినప్పటికీ మ్యాచ్ మాత్రం ఉత్కంఠగా సాగింది. ఫీనిక్స్ చివరి దశలో విజయానికి చేరువైంది. 12 బంతుల్లో 32 పరుగులు కావాల్సిన దశ నుంచి రెహాన్ అహ్మద్, జోర్డాన్ థాంప్సన్ బౌండరీలతో లక్ష్యాన్ని దగ్గర చేశారు. చివరి 5 బంతుల్లో 13 పరుగులు కావాల్సి ఉండగా.. రెహాన్ సిక్సర్ కొట్టడంతో సమీకరణం మరింత ఆసక్తికరంగా మారింది. చివరకు 4 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన సమయంలో ట్రెంట్ బౌల్ట్ అద్భుతమైన యార్కర్లతో ఫీనిక్స్ను నిలువరించాడు. దీంతో MI లండన్

హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ లీడ్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సూపర్ జెయింట్స్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (40 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ వాల్టర్ (28 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో 128 పరుగుల టార్గెట్‌ను మరో 33 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సూపర్‌జెయింట్స్ పట్టికలో రెండో స్థానానికి చేరింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 127 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32), జాక్ క్రాలీ (31) రాణించగా, రికెల్టన్ (17) పర్వాలేదనిపించాడు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో గస్ అకిన్సన్ మూడు వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు బాదిన టిమ్ సీఫర్ట్ బ్రైడన్ కార్స్ బౌలింగ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. అతడు వేసిన ఇన్నింగ్స్ 7, 8, 9 బంతులను సీఫర్ట్ వరుసగా సిక్సర్లు సంధించాడు. ఇప్పటికే ట్రెంట్ రాకెట్స్ ఫైనల్లో అడుగుపెట్టగా, ఎలిమినేటర్ పోరు కోసం నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. ఇందులో సూపర్‌జెయింట్స్ రెండో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరులో ముందు వరుసలో ఉంది. ఆగస్టు 15న ఎలిమినేటర్ పోరు, ఆగస్టు 16న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. Read: స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్‌కు షాక్! ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు) ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి విజయ్ సంచలన నిర్ణయం